మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటే.. మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు..

  తిరువనంతపురం : వివాహ ధృవీకరణ ప్రతం కోసం వివాహ నమోదు కార్యాలయానికి వెళ్లిన ఓ వ్యక్తికి కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైన సంఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… కోజికోడ్ జిల్లాకు చెందిన మధుసూదన్ అనే వ్యక్తి ప్రత్యేక మ్యారేజ్ చట్టం కింద 2003 ఫిబ్రవరి 27వ తేదీన వివాహం చేసుకున్నాడు. మధుసూదన్ నాడు వివాహ ధృవీకరణ ప్రతం తీసుకోలేదు. అయితే గత నెల జూన్ 19వ తేదీన వివాహ ధృవీకరణ పత్రం […] The post మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటే.. మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిరువనంతపురం : వివాహ ధృవీకరణ ప్రతం కోసం వివాహ నమోదు కార్యాలయానికి వెళ్లిన ఓ వ్యక్తికి కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైన సంఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… కోజికోడ్ జిల్లాకు చెందిన మధుసూదన్ అనే వ్యక్తి ప్రత్యేక మ్యారేజ్ చట్టం కింద 2003 ఫిబ్రవరి 27వ తేదీన వివాహం చేసుకున్నాడు. మధుసూదన్ నాడు వివాహ ధృవీకరణ ప్రతం తీసుకోలేదు. అయితే గత నెల జూన్ 19వ తేదీన వివాహ ధృవీకరణ పత్రం అవసరం ఉండి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లితే అక్కడ వారు 16 ఏళ్ల రికార్డును చూడలేక తనను మళ్లీ పెళ్లి చేసుకోవాలని, మూడు రోజుల్లో సర్టిఫికెల్ ఇస్తామని అధికారులు మధుసూదన్ ను అవమానించారు. దీంతో తనకు జరిగిన అమానాన్ని సోషల్ మీడియాల్లో పోస్లు చేశాడు. దీంతో ఈ విషయం కేరళ రాష్ట్ర రిజిస్టేషన్ మంత్రి సుధాకరన్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని రిజిస్టేషన్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలను జారి చేశారు. విధుల పట్ల నిర్టక్ష్యంగా వహించిన ముక్కోమ్ మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయం నలుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సుధాకరన్ ఆదేశించారు.

Man seeking wedding certificate asked to marry again

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటే.. మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: