దోపిడి దొంగల అరెస్ట్…

  హైదరాబాద్ : షేరింగ్ ఆటోలో ప్రయాణిస్తున్న వారిని దోచుకుంటున్న ఐదుగురు దొంగలను నార్త్ జోన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆటో రిక్షా, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అర్మాన్ ఆలం, అక్షయ్ చంద్రశేఖర్ సూర్య వంశీ అలియాస్ యాబా, దీపక్ యాదవ్, హరి రాజు ఫ్రాన్సిస్ అలియాస్ చోటు, బొమ్మకంటి ప్రదీప్ గౌడ్ కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న వారిని […] The post దోపిడి దొంగల అరెస్ట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : షేరింగ్ ఆటోలో ప్రయాణిస్తున్న వారిని దోచుకుంటున్న ఐదుగురు దొంగలను నార్త్ జోన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆటో రిక్షా, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అర్మాన్ ఆలం, అక్షయ్ చంద్రశేఖర్ సూర్య వంశీ అలియాస్ యాబా, దీపక్ యాదవ్, హరి రాజు ఫ్రాన్సిస్ అలియాస్ చోటు, బొమ్మకంటి ప్రదీప్ గౌడ్ కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న వారిని టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. ఈ విధంగా గత రెండేళ్ల నుంచి ప్రయాణికులపై దాడి చేసి దోచుకుంటున్నారు.

గతంలో గోపాలపురం, నల్లకుంట, ఘట్‌కేసర్, జిఆర్‌పి సికింద్రాబాద్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తున్నారు. ఐదుగురిలో నలుగురు మహారాష్ట్ర, బీహార్‌కు చెందిన వారు కాగా ఒకరు నిజామాబాద్‌కు చెందిన వాడు. ఈ నెల 7వతేదీన నగరంలోని కార్కానాకు చెందిన ఓ వ్యక్తి పటాన్‌చెరువులో విధులు ముగించుకుని తన స్నేహితుడి పదో రోజుకు పోచారం గ్రామానికి వెళ్లాడు. కార్యక్రమం చూసుకుని తిరిగి బస్సులో సికింద్రాబాద్‌కు వచ్చాడు. ఇంటికి వెళ్లేందుకు బస్‌స్టాప్‌లో వేచిఉండగా ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్లాలని అడగగా కార్కానాకు వెళ్లాలని తెలుపగా ఆటో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం పోయాక మిగతా వారు కూడా ఆటో ఎక్కారు. ఆటోను డ్రైవర్ కార్కానా వైపు తీసుకువెళ్లకుండా వేరే రూట్‌లో వెళ్తుండగా బాధితుడు ప్రశ్నించాడు.

దారిలో ఓ వ్యక్తిని దింపివేయాలని చేప్పాడు, కాని ఆటోను బటిండ గార్డెన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాలనికి తీసుకువెళ్లి అతడిపై ఐదుగురు దాడి చేసి రూ.1,800 నగదు, మొబైల్ ఫోన్, ఎటిఎం, పాన్, ఆధార్ కార్డులు బలవంతంగా తీసుకున్నారు. తర్వాత ఆటోలో నుంచి తోసివేసి కేజేఆర్ గార్డెన్ వైపు పారిపోయారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ ఇంటికి వచ్చిన బాధితుడు కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు ఐదుగురు 25నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటారని చెప్పారు.

విచారణ చేస్తున్న పోలీసులు శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇప్పటి వరకు వీరు రెండు దోపిడీలు చేసినట్లు చెప్పారు. ఈ విధంగా అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్న వారిని టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్‌స్టాండ్, మారేడ్‌పల్లిలో ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని కొద్ది దూరం పోయాక దోచుకుంటున్నారు. డిఐ నేతాజీ, ఎస్‌ఐపి సందీప్ రెడ్డి, క్రైం సిబ్బంది రాజశేఖర్, శ్రీధర్, అభిలాష్, రాకేష్, పురుషోత్తం నిందితులను పట్టుకున్నారు.

Arrested Looters for Robbing Passengers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దోపిడి దొంగల అరెస్ట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: