ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత సరదా

మహబూబాబాద్ : ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కురవి మండలం తిరుమలాపురంలో శుక్రవారం జరిగింది. చిత్తానూరి సూర్యతేజ (8), విశాల్ తేజ (5) ఈత కోసం గ్రామ సమీపంలోని మర్రికుంటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారు కుంటలో మునిగిపోయి చనిపోయారు. సూర్యతేజ, విశాల్ తేజ మృతదేహాలను వెలికి తీశారు. ఈ చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శవపరీక్ష కోసం సూర్యతేజ, విశాల్ తేజల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై […] The post ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత సరదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబాబాద్ : ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కురవి మండలం తిరుమలాపురంలో శుక్రవారం జరిగింది. చిత్తానూరి సూర్యతేజ (8), విశాల్ తేజ (5) ఈత కోసం గ్రామ సమీపంలోని మర్రికుంటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారు కుంటలో మునిగిపోయి చనిపోయారు. సూర్యతేజ, విశాల్ తేజ మృతదేహాలను వెలికి తీశారు. ఈ చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శవపరీక్ష కోసం సూర్యతేజ, విశాల్ తేజల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

2 Boys Drowns In Pond And Died

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత సరదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: