భారమైన ప్రయాణం…

  సదాశివనగర్ : ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. నేటి కాలంలో పట్టణం, పల్లె అని కాకుండా ప్రతీచోటా వాహనాల వినియోగం ఎంతో పెరిగింది. మారుతున్న కాలంతో పాటు ప్రతి ఇంటికి ద్విచక్రవాహనం తప్పనిసరిగ్గా మారింది. ప్రతిరోజు నిత్యవసరాల కోసం ద్విచక్రవాహనాలతో పాటు ఆటోట్రాలీలు, తేలిక వాహనాలు ఖచ్చితంగా నడవాల్సిందే, లేదంటే కుటుంబం పస్తులుండాల్సిందే. వీటితో పాటు నిత్యం కార్లు, బస్సులు, లారీలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే వ్యవసాయానికి […] The post భారమైన ప్రయాణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సదాశివనగర్ : ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. నేటి కాలంలో పట్టణం, పల్లె అని కాకుండా ప్రతీచోటా వాహనాల వినియోగం ఎంతో పెరిగింది. మారుతున్న కాలంతో పాటు ప్రతి ఇంటికి ద్విచక్రవాహనం తప్పనిసరిగ్గా మారింది. ప్రతిరోజు నిత్యవసరాల కోసం ద్విచక్రవాహనాలతో పాటు ఆటోట్రాలీలు, తేలిక వాహనాలు ఖచ్చితంగా నడవాల్సిందే, లేదంటే కుటుంబం పస్తులుండాల్సిందే. వీటితో పాటు నిత్యం కార్లు, బస్సులు, లారీలు రాకపోకలు సాగిస్తుంటారు.

అలాగే వ్యవసాయానికి కూడా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగిస్తుండటంతో రైతులకు ఇంధన అవసరం పెరిగింది. ఇలా వ్యాపారం సహ ప్రతి చిన్నపెద్ద పనులకు వాహనాలు ఖచ్చితం కావడంతో ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఇంధన ధరలు పెంచేస్తున్నాయని పలువురు విద్యావంతుల వాదన. ఇంధన అవసరాలను ఆసరాగా తీసుకొని పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండటం వలన అన్ని వర్గాలపై భారం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అవస్థలు పడుతున్నారు…
డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో అవస్థలు పడుతున్న ప్రజల పై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇంధన ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున మరింత భారం పడనుంది. ఇక ధరల హెచ్చుతగ్గుల విషయం వినియోగదారుడికి పెట్రోల్ బంక్‌లోకి వచ్చే వరకు తెలియడం లేదు. ధరలు పెరగడం వలన ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారంగా మారింది. చిరు వ్యాపారులు, ప్రైవేట్ సంస్థలలో చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్లేవారి పరిస్థితి దారుణంగా ఉంది. పనులకు బస్సుల్లో వెళ్తే సమయానికి చేరుకోలేమని, ద్విచక్రవాహనం పై వెళ్దామంటే పెట్రోల్‌కే జీతం సరిపోతుందంటున్నారు.
గత రెండేళ్ళ నుండి డీజిల్, పెట్రలో ధరలు
డీజిల్ 2017, 69.25, పెట్రోల్ : 2017 78.47
డీజిల్ 2018, 78.11, పెట్రోల్ : 2017 – 83.93

People are struggling with rising Petrol prices

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారమైన ప్రయాణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: