కటకటాలు దాటి గడపలోకి ఎప్పుడోస్తావ్ బిడ్డా!

చేతిలో చిల్లి గవ్వ లేక తిప్పలు షార్జా జైల్‌లో మగ్గుతున్న కొత్తపేట వాసి   మన తెలంగాణ/జగిత్యాల:  ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్ బాట పట్టిన ఓ యువకుడిని విధి వెంటాడింది. ఓ హత్య కేసులో బాధ్యుడిగా గుర్తించిన పోలీసులు అక్కడి జైలుకు పంపడంతో ఇరవై ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న వలసజీవి చివరికి మానసిక వేదనతో వీల్ చైర్‌కే పరిమితమై అనారోగ్యం బారిన పడినట్లు తెలిసింది. స్వగ్రామంలో తల్లి పరిస్థితి అంతంతా మాత్రమే కాగ, జైలు గోడల […] The post కటకటాలు దాటి గడపలోకి ఎప్పుడోస్తావ్ బిడ్డా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చేతిలో చిల్లి గవ్వ లేక తిప్పలు
షార్జా జైల్‌లో మగ్గుతున్న కొత్తపేట వాసి

 

మన తెలంగాణ/జగిత్యాల:  ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్ బాట పట్టిన ఓ యువకుడిని విధి వెంటాడింది. ఓ హత్య కేసులో బాధ్యుడిగా గుర్తించిన పోలీసులు అక్కడి జైలుకు పంపడంతో ఇరవై ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న వలసజీవి చివరికి మానసిక వేదనతో వీల్ చైర్‌కే పరిమితమై అనారోగ్యం బారిన పడినట్లు తెలిసింది. స్వగ్రామంలో తల్లి పరిస్థితి అంతంతా మాత్రమే కాగ, జైలు గోడల మధ్య ఉన్న కన్నకొడుకు ఆనారోగ్యం బారిన పడి చివరి అంకెలు లెక్క బెడుతుండటం కన్నతల్లికి అంతులేని వేదనను మిగిల్చుతుంది. జైలులో ఉన్న కన్నకొడుకు ఎప్పుడోస్తాడా…? మంచాన పడ్డ తనకు ఆసరాగా ఎప్పుడు నిలబడతాడా? అని వృద్ధ తల్లి కళ్లల్లో వత్తులు వేసుకొని జీవిస్తోంది.

హత్యకు గురైన యువకుడి కుటుంబానికి రూ.3లక్షల పరిహారం చెల్లించే స్థోమత లేక ఈ దళిత కుటుంబం కన్నీటి పర్యంతమౌతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ధరూరి నర్సయ్య-లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు కాగ నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ముగ్గురు కుమారులను లక్ష్మి పెంచి పోషించింది. అయితే రెండో కుమారుడైన ధరూరి బుచ్చన్న (42) అనే వ్యక్తి స్వగ్రామంలో సాగు అచ్చి రాక అందరు వెళ్లుతున్నట్లుగానే గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దొరికిన చోట్ల అప్పులు చేసి 2001 ఏటా గల్ఫ్ బాట పట్టాడు. కంపనీ వీసాపై వెళ్లిన బుచ్చన్న భవన నిర్మాణ పనిలో కూలిగా కుదిరాడు. అక్కడే తనతో కలిసి ఉండే నిజామాబాద్ జిల్లా బాల్కోండ మండలం ముక్ఫాల్‌కు చెందిన బి. గోవర్ధన్‌తో గొడవ పడగా ఈ ఘర్షణలో గోవర్ధన్ మృతి చెందాడు.

దాంతో అక్కడి న్యాయస్థానం బుచ్చన్నకు జీవిత ఖైదు విధించింది. ఇరవై ఏళ్ల వయస్సులో జీవనోపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన బుచ్చన్నపై విధి పగబట్టింది. జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన బుచ్చన్న చివరికి జైలు పాలై అనారోగ్యానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హత్యకు గురైన గోవర్ధన్ కుటుంబానికి రూ.3లక్షల పరిహారం ఇవ్వలేక కొత్తపేట గ్రామంలోని బుచ్చన్న కుటుంబం తల్లడిల్లుతోంది. సాయం చేసే చేతుల కోసం ఈ వృద్దతల్లి కనబడ్డ వాళ్లనళ్లా తన కొడుకును రక్షించాలని వేడుకుంటుంది. దళిత కుటుంబానికి చెందిన లక్ష్మి వృద్ధాప్యంలో కన్న కొడుకును జైలు నుండి విడిపించేందుకు పడరాని పాట్లు పడుతుంది. తాను చనిపోయేలోగా తన కొడుకును తనవితీరా చూడాలని ఆ తల్లి పడే వ్యథ వర్ణనాతీతం.

 

Mother Waiting for Son in Jail in Gulf

 

The post కటకటాలు దాటి గడపలోకి ఎప్పుడోస్తావ్ బిడ్డా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: