బిజెపిలో చేరిన టిడిపి నేత

ఢిల్లీ: టిడిపి నేత, ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ ఆ పార్టీకి, ఎంఎల్‌సి పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన  ఢిల్లీలో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అన్నం సతీష్ కు  నడ్డా బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో తో గురవారం  సతీష్ భేటీ తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. 2014లో బాపట్ల నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా […] The post బిజెపిలో చేరిన టిడిపి నేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: టిడిపి నేత, ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ ఆ పార్టీకి, ఎంఎల్‌సి పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన  ఢిల్లీలో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అన్నం సతీష్ కు  నడ్డా బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో తో గురవారం  సతీష్ భేటీ తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. 2014లో బాపట్ల నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా సతీష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  అనంతరం స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఆయన గెలుపొందారు. అప్పటి నుంచి ఎంఎల్‌సిగా  ఉన్న సతీష్ 2019లోనూ టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి సతీష్ టిడిపికి దూరంగా ఉంటున్నారు.

TDP Leader Annam Satish Prabhakar Joining BJP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిజెపిలో చేరిన టిడిపి నేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.