తల్లి ప్రేమలో గొప్పదనం ఇదే…

హైదరాబాద్ : సృష్టిలో తల్లే మొదటి దైవమంటారు. తల్లి పంచే ప్రేమలో ఏమాత్రం అసూయద్వేషాలు ఉండవు. అంత స్వచ్ఛమైన తల్లి ప్రేమ ఒక్క మనుషుల్లోనే కాదు జంతువులు, పక్షుల్లో కూడా ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ. ట్రాక్టర్ కింద పక్షి పడితే ఏమవుతుంది…నామరూపాల్లేకుండా పోతుంది. కానీ ఆ పక్షి మాత్రం ట్రాక్టర్ ను అడ్డుకుంది. తాను పొదిగిన గుడ్లను ట్రాక్టర్ ఎక్కడ నాశనం చేస్తుందోనన్న ఆందోళనతో ఆ పక్షి ట్రాక్టర్ ను అడ్డుకుంది. ఈ ఘటన చైనలోని ఉలాంకలో […] The post తల్లి ప్రేమలో గొప్పదనం ఇదే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : సృష్టిలో తల్లే మొదటి దైవమంటారు. తల్లి పంచే ప్రేమలో ఏమాత్రం అసూయద్వేషాలు ఉండవు. అంత స్వచ్ఛమైన తల్లి ప్రేమ ఒక్క మనుషుల్లోనే కాదు జంతువులు, పక్షుల్లో కూడా ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ. ట్రాక్టర్ కింద పక్షి పడితే ఏమవుతుంది…నామరూపాల్లేకుండా పోతుంది. కానీ ఆ పక్షి మాత్రం ట్రాక్టర్ ను అడ్డుకుంది. తాను పొదిగిన గుడ్లను ట్రాక్టర్ ఎక్కడ నాశనం చేస్తుందోనన్న ఆందోళనతో ఆ పక్షి ట్రాక్టర్ ను అడ్డుకుంది. ఈ ఘటన చైనలోని ఉలాంకలో జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ కు కనిపించేలా రెక్కలాడిస్తూ ఆ పక్షి ట్రాక్టర్ ముందు భాగంలోకి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ కిందకు దిగి దాని ధైర్యానికి మెచ్చి కొన్ని నీళ్లు అక్కడ పోశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ప్రాణాలను అడ్డుపెట్టి తన పిల్లలను కాపాడుకున్న పక్షి స్వచ్ఛమైన  తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచిందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Mother Love Is Great

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తల్లి ప్రేమలో గొప్పదనం ఇదే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: