టిఆర్ఎస్ లో చేరిన కోమటిరెడ్డి

నల్గొండ: చిట్యాల మాజీ మార్కెట్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. కోమటిరెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ సర్పంచులు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. వీరికి  మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సిఎం […] The post టిఆర్ఎస్ లో చేరిన కోమటిరెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్గొండ: చిట్యాల మాజీ మార్కెట్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. కోమటిరెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ సర్పంచులు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. వీరికి  మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలిపారు. టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని ఆయన చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.

Komatireddy China Venkat Reddy Joins TRS

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్ఎస్ లో చేరిన కోమటిరెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: