ఎపి బడ్జెట్ …కేటాయింపులు ఇవే…

అమరావతి: ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను  ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు … మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు బడ్జెట్ అంచనా-19.32 శాతం పెరుగుదల రెవెన్యూ వ్యయం-20.10శాతం పెరుగుతందని అంచనా వేశారు. […] The post ఎపి బడ్జెట్ … కేటాయింపులు ఇవే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను  ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌లో కేటాయింపులు …
  • మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు
  • రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు
  • బడ్జెట్ అంచనా-19.32 శాతం పెరుగుదల
  • రెవెన్యూ వ్యయం-20.10శాతం పెరుగుతందని అంచనా వేశారు.
రాజధాని అమరావతికి రూ.500 కోట్లు కేటాయించారు. విద్యుత్‌ కొనుగోళ్లు ఒప్పందం కోసం అదనంగా రూ.2 వేల కోట్లు చెల్లిస్త్తామని మంత్రి బుగ్గన తెలిపారు. ఇంధన రంగంలో గత ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్లు రుణంగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సాగునీటి శాఖకు 13,139 కోట్లు, వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు 8750 కోట్లు, అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్లు కేటాయించినట్టు ఆయన చెప్పారు. ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు, వైఎస్‌ఆర్‌ 9గంటల ఉచిత విద్యుత్‌కు 4525 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లను బడ్జెట్ లో కేటాయించామని బుగ్గన పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు, ఫసల్‌ బీయా యోజనకు రూ.1163 కోట్లు, ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీ కోసం రూ.475 కోట్లు కేటాయించారు. వైఎస్‌ బోర్‌ వెల్‌పథకానికి రూ.200 కోట్లు, విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు, పాఠశాలల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.1077 కోట్లు, వైఎస్‌ఆర్‌ స్కూల్‌ మెయింటనెన్స్‌ గ్రాంట్‌ రూ.160 కోట్లు ఇస్తున్నట్టు మంత్రి బుగ్గన వెల్లడించారు. ఆరోగ్యశ్రీ  పథకం కోసం రూ.1740 కోట్లు, ఆస్పత్రుల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు, ఆశావర్కర్ల గౌరవవేతనం కోసం 456 కోట్లు, వైఎస్‌ఆర్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజి కోసం రూ.66 కోట్లు, గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజి కోసం 66 కోట్లు, విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజి కోసం 66 కోట్లు, శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతికి 50 కోట్లు బడ్జెట్ లో కేటాయించామని ఆయన వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ 5వేల కోట్లు, పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.1370 కోట్లు, బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు, వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు వెయ్యి కోట్లు కేటాయించామని మంత్రి బుగ్గన తెలిపారు. 
AP Budget … Allocations

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎపి బడ్జెట్ … కేటాయింపులు ఇవే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: