అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బుగ్గన

అమరావతి: ఎపి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  తాను సత్యానికి తప్ప దేనికీ లొంగి ఉండనని, సత్యం కాక తాను సేవించ వలసిన ఏ దేవుడూ లేడంటూ మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలను సభలో బుగ్గన ఉటంకించారు. రాజకీయాల్లో విశ్వసనీయత అతి ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు.. ప్రజారంజక పాలన కోసం సిఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. నమ్మకం, విశ్వసనీయతే ప్రాతిపదికగా ఇటీవల జరిగిన ఎపి ఎన్నికల్లో […] The post అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బుగ్గన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: ఎపి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  తాను సత్యానికి తప్ప దేనికీ లొంగి ఉండనని, సత్యం కాక తాను సేవించ వలసిన ఏ దేవుడూ లేడంటూ మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలను సభలో బుగ్గన ఉటంకించారు. రాజకీయాల్లో విశ్వసనీయత అతి ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు.. ప్రజారంజక పాలన కోసం సిఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. నమ్మకం, విశ్వసనీయతే ప్రాతిపదికగా ఇటీవల జరిగిన ఎపి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించేందుకు సిఎం జగన్ కృషి చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. వైసిపి మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని సిఎం జగన్‌ చెప్పారని, తమ ప్రభుత్వానికి మేనిఫెస్టోనే ప్రధాన నియమావళిగా ఉంటుందని బుగ్గన పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ బడ్జెట్ ఉంటుందని, ఇది పేదల బడ్జెట్ అని బుగ్గన తెలిపారు.

Minister Buggana Budget Speech In Assembly

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బుగ్గన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: