చంద్రబాబుకు సిఎం జగన్ వార్నింగ్

అమరావతి : ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రైతు రుణాల‌పై సిఎం జ‌గ‌న్ త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ంటూ టిడిపి  స‌భ‌లో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. సిఎం జ‌గ‌న్ రాజీనామా చేస్తారా అని చంద్రబాబు స‌వాల్ చేశారు. సిఎం జ‌గ‌న్ మాట్లాడుతున్న స‌మ‌యంలో టిడిపి ఎంఎల్ఎలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో జగన్ టిడిపి ఎంఎల్ఎలపై మండిపడ్డారు. తమ వైసిపి ఎంఎల్ఎలు  లేస్తే టిడిపి ఎంఎల్ఎలు  త‌మ స్థానాల్లో కూర్చోలేర‌ని జగన్ హెచ్చరించారు. మ‌ర్యాద , […] The post చంద్రబాబుకు సిఎం జగన్ వార్నింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి : ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రైతు రుణాల‌పై సిఎం జ‌గ‌న్ త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ంటూ టిడిపి  స‌భ‌లో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. సిఎం జ‌గ‌న్ రాజీనామా చేస్తారా అని చంద్రబాబు స‌వాల్ చేశారు. సిఎం జ‌గ‌న్ మాట్లాడుతున్న స‌మ‌యంలో టిడిపి ఎంఎల్ఎలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో జగన్ టిడిపి ఎంఎల్ఎలపై మండిపడ్డారు. తమ వైసిపి ఎంఎల్ఎలు  లేస్తే టిడిపి ఎంఎల్ఎలు  త‌మ స్థానాల్లో కూర్చోలేర‌ని జగన్ హెచ్చరించారు. మ‌ర్యాద , గౌర‌వం లేకుండా టిడిపి ఎంఎల్ఎలు ప్రవర్తిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్ర‌బాబు మాట్లాడిన‌ సమయంలో తాము ఏమైనా మాట్లాడామా అని జగన్ ప్రశ్నించారు. బుద్ధి, జ్ఞానం లేని టిడిపి నేతలు ఎలా ఎంఎల్ఎలు అయ్యారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కళ్లతో బెదిరిస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డుతారా అని చంద్ర‌బాబును ఉద్దేశిస్తూ జ‌గ‌న్  అన్నారు.  ప‌ర్స‌నాల్టీ పెంచడం కాదని, బుద్ధి కూడా పెరగాలని ఆయన టిడిపి ఎంఎల్ఎ అచ్చంనాయుడును ఉద్దేశిస్తూ అన్నారు.

CM Jagan Give Warning to Chandrababu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చంద్రబాబుకు సిఎం జగన్ వార్నింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: