భార్య, కుమారుడిని గొంతు నులిమి చంపి…నిప్పంటించి

    మన తెలంగాణ / నారాయణఖేడ్ :  సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామంలో మద్యానికి బానిసైన ఓ భర్త తన భార్య, కుమారుడిని గొంతు నులిమి చంపేసి అనంతరం గ్యాస్ నూనె పోసి నిప్పటించాడు.  బంధువుల, పోలీసుల కథనం ప్రకారం… కరస్‌గుత్తి గ్రామానికి చెందిన కవిత, వెంకట్‌రెడ్డిలకు గత 11 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, కొన్నేళ్లుగా కాపురం సజావుగా కొనసాగిందనుకున్న సమయంలో వెంకట్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. వెంకట్ రెడ్డి […] The post భార్య, కుమారుడిని గొంతు నులిమి చంపి… నిప్పంటించి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

మన తెలంగాణ / నారాయణఖేడ్ :  సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామంలో మద్యానికి బానిసైన ఓ భర్త తన భార్య, కుమారుడిని గొంతు నులిమి చంపేసి అనంతరం గ్యాస్ నూనె పోసి నిప్పటించాడు.  బంధువుల, పోలీసుల కథనం ప్రకారం… కరస్‌గుత్తి గ్రామానికి చెందిన కవిత, వెంకట్‌రెడ్డిలకు గత 11 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, కొన్నేళ్లుగా కాపురం సజావుగా కొనసాగిందనుకున్న సమయంలో వెంకట్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. వెంకట్ రెడ్డి మద్యానికి బానిసై తన పేరు మీద ఉన్న భూమిని అమ్మాడు. దీంతో రోజు తాగి వచ్చి భార్యతో గొడవలు పడేవాడు. దీంతో తాగుడు బానిస కావడంతో అప్పులు పెరిగాయి. మృతురాలి కవిత పేరిట నాలుగు ఎకరాల భూమి, మృతురాలి భర్త వెంకట్ రెడ్డి పేరు మీదు నాలుగు ఎకరాల భూమి ఉండగా మృతురాలి కవిత పేర మీద ఉన్న భూమి అమ్మాలని భర్త వెంకట్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు కవిత నిరాకరించడంతో తరచుగా గొడువలు పడేవారన్నారు. పలుమార్లు పెద్దల ముందు పంచాయతీలు జరిగాయన్నారు. అయినా వెంకట్ రెడ్డి వినకుండా కవిత , కుమారుడు దినేష్‌రెడ్డి(4)లను చంపి కిరోసిన్ పోసి అనుమానాస్పద హత్యగా చిత్రీకరించాడు. గ్రామస్థులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు. పోలీసులు తనదైన శైలిలో విచారించగా వెంకట్ రెడ్డి తానే చంపినట్టుగా ఒప్పుకున్నాడు. 

The post భార్య, కుమారుడిని గొంతు నులిమి చంపి… నిప్పంటించి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: