ఆ రోజు తిరుమలకు రాకండి…

తిరుమల : ఈ నెల 16న చంద్రగ్రహణం ఉన్నందున ఆ రోజు భక్తులు శ్రీవారి దర్శనానికి రావద్దని టిటిడి అధికారులు సూచించారు. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు శ్రీవారి ఆలయాన్ని రాత్రి ఏడు గంటలకు మూసివేస్తామని వారు తెలిపారు. ఈ క్రమంలోనే భక్తులను ముందు రోజు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలోకి అనుమతించరని వారు పేర్కొన్నారు. తిరిగి ఆలయాన్ని 17వ తేదీ ఉదయం 5 గంటలకు తెరుస్తారని వారు చెప్పారు. చంద్రగ్రహణం కారణంగానే సుమారు 12 గంటల పాటు […] The post ఆ రోజు తిరుమలకు రాకండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తిరుమల : ఈ నెల 16న చంద్రగ్రహణం ఉన్నందున ఆ రోజు భక్తులు శ్రీవారి దర్శనానికి రావద్దని టిటిడి అధికారులు సూచించారు. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు శ్రీవారి ఆలయాన్ని రాత్రి ఏడు గంటలకు మూసివేస్తామని వారు తెలిపారు. ఈ క్రమంలోనే భక్తులను ముందు రోజు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలోకి అనుమతించరని వారు పేర్కొన్నారు. తిరిగి ఆలయాన్ని 17వ తేదీ ఉదయం 5 గంటలకు తెరుస్తారని వారు చెప్పారు. చంద్రగ్రహణం కారణంగానే సుమారు 12 గంటల పాటు శ్రీవారి దర్శనం ఉండదని వారు పేర్కొన్నారు. క్యూలైన్లలోకి కూడా భక్తులను అనుమతించనందున కొండపైకి వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు వెల్లడించారు. ఈ క్రమంలో భక్తులు ఆ రోజు శ్రీవారి దర్శనానికి రావొద్దని,  ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Don’t Come To Tirumala Temple On 16th July

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ రోజు తిరుమలకు రాకండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: