ఆ నటిపై కేసు నమోదు

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై యుపి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ స్టేజ్ ప్రదర్శన ఇచ్చేందుకు సోనాక్షి సిన్హా 2018లో అంగీకరించారు. ఈ క్రమంలో  అడ్వాన్స్ గా రూ. 24 లక్షలను ఆమె తీసుకున్నారు. అయితే ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. సోనాక్షి సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రోగ్రామ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోనాక్షి సిన్హాపై […] The post ఆ నటిపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై యుపి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ స్టేజ్ ప్రదర్శన ఇచ్చేందుకు సోనాక్షి సిన్హా 2018లో అంగీకరించారు. ఈ క్రమంలో  అడ్వాన్స్ గా రూ. 24 లక్షలను ఆమె తీసుకున్నారు. అయితే ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. సోనాక్షి సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రోగ్రామ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోనాక్షి సిన్హాపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, 406 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు యుపి నుంచి ఓ పోలీసు బృందం గురువారం సాయంత్రం ముంబయిలోని సోనాక్షి సిన్హా ఇంటికి వెళ్లింది. అయితే తాము ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో సోనాక్షి సిన్హా అందుబాటులో లేరని యుపి పోలీసులు తెలిపారు.

Case Against Bollywood Actress Sonakshi Sinha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ నటిపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: