నకిలీ కస్టమ్స్ అధికారి అరెస్టు

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: కస్టమ్స్ అధికారినని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసి పరారైన ఘరానా దొంగను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ కస్టమ్స్ ఆఫీసర్ ఐడి కార్డు, ఆధార్, ఓటర్ ఐడి కార్డులు, స్టాంపులు, మొబైల్ ఫోన్, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేరెడ్‌మెట్‌లోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. […] The post నకిలీ కస్టమ్స్ అధికారి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: కస్టమ్స్ అధికారినని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసి పరారైన ఘరానా దొంగను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ కస్టమ్స్ ఆఫీసర్ ఐడి కార్డు, ఆధార్, ఓటర్ ఐడి కార్డులు, స్టాంపులు, మొబైల్ ఫోన్, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేరెడ్‌మెట్‌లోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెస్ట్‌బెంగాల్, ఉల్‌బేరియా జిల్లా, ఆంటిలా గ్రామానికి చెందిన సౌమన్ బెనర్జీ(43) సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. అతడి గ్రామంలో ఛీటింగ్ చేయడంతో తప్పించుకుని భార్య సుప్రాణ బెనర్జీ, కుమారుడు సుసోవాన్ బెనర్జీతో కలిసి 2013లో నగరానికి వచ్చి మేడిపల్లి సమీపంలోని చెంగిచెర్లలో స్థిరపడ్డాడు. తను వైజాగ్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని స్థాని కులకు చెప్పాడు. బిల్లులు లేకుండా బంగారం బిస్కెట్లను తీసుకువచ్చిన ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసు కుంటామని దానిని సగం ధరకు ఇస్తామని స్థానికులకు చెప్పాడు.

ఇది నమ్మి కొందరు ముందుగానే కొంత డబ్బులు ఇచ్చారు. ప్రారంభంలో వారిని నమ్మించడానిక వారికి బంగారం బిస్కెట్లు తెచ్చి ఇచ్చాడు. దీనిని నమ్మిన స్థానికులు కోట్లలో సౌమన్ బెనర్జీకి డబ్బులు ఇచ్చారు. వారినే కాకుండా రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేసేందుకు చెంగిచెర్ల, మారేడ్‌పల్లిలో నిత్యావసరాల స్టోర్స్‌ను ఏర్పాటు చేశాడు. బ్యాంకు లోన్ తీసుకుని రెండు విల్లాలు (60లక్షలకు ఒకటి చొప్పున), రెండు కార్లు, మూడు మోటార్ సైకిళ్లు, ఆటో ట్రాలీని కొనుగోలు చేశాడు. తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వారికి 30శాతం వడ్డీ ఇస్తానని చెప్పాడు. ఈ విధంగా కోట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశాడు. సౌమన్ బెనర్జీ కి వివిధ బ్యాంకుల్లో 20 ఖాతాలు ఉన్నాయి. ఇండియా బుల్స్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని విల్లాలు కొనుగోలు చేశాడు. ఖరీదైన ఎలాక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
పార్టీలు, టూర్లు, ట్రిప్పులతో పడేశాడు…
చెంగిచెర్లలో తన సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఖరీదైన పార్టీలు ఇచ్చేవాడు. పెట్టుబడి పెట్టినన వారిని టూర్లకు, ఎక్స్‌కర్షన్ ట్రిప్పులకు తీసుకువెళ్లేవాడు. ఈ క్రమంలోనే 2017, జనవరి, 31వ తేదీన చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. దీంతో బాధితులు తాము మోసపోయామని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి నిందితుడి కోసం వెతుకుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఎస్‌ఓటి పోలీసులు వెస్ట్‌బెంగాల్, గోవా, శిర్డీ, పూణే, ముంబై, ఢిల్లీ, నాగపూర్‌కు వెళ్లారు. సౌమన్ బెనర్జ్జీకి కాంటాక్ట్‌లో ఉన్నవారిని కూడా విచారించారు. ఎలాంటి క్లూ పోలీసులకు లభించలేదు, దీంతో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల నుంచి సమాచారం సేకరించారు. ఈ క్రమంలోనే నాగపూర్ రైల్వే స్టేషన్‌లో ఎర్టిగా కారును గుర్తించారు. అప్పటి నుంచి అమృత్‌సర్‌లో ఉన్నట్లు గుర్తించారు.
కుటుంబంతో పాటు ఆరు నెలల ఉన్న సౌమన్ బెనర్జీ భార్యా, కుమారుడితో కలిసి ఆరు నెలల ఉన్న తర్వాత అక్కడి నుంచి 16, ఫిబ్రవరి, 2017లో వెళ్లి పోయాడని స్థానికులు తెలిపారు. అక్కడ చాలా మందికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి జార్ఖండ్ మీదుగా ఒడిస్సాకు వచ్చాడు.
ఒరిస్సాలో చిక్కాడు…
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు సౌమన్ బెనర్జీ ఒడిసా, భువనేశ్వర్, ధౌలి ఏరియాలో ఉన్నట్లు కనిపెట్టారు. వెంటనే మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు భువనేశ్వర్‌కు వెళ్లి సౌమన్ బెనర్జీ ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టారు. వెంటనే అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న నకిలీ స్టాంప్‌లు, ఐడి కార్డులను స్వాధీనం చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేస్ భగవత్, ఎస్‌ఓటి అడిషనల్ డిసిపి సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్లు నవీన్ కుమార్, అంజిరెడ్డి, మేడిపల్లి పోలీసులు అవినాష్ బాబు, రత్నం, సిబంది నిందితుడిని పట్టుకున్నారు.
అధిక వడ్డీకి మోసపోవద్దు : మహేష్ భగవత్
అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఇచ్చి మోసగాళ్ల చేతిలో మోసపోవద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు. 30శాతం వడ్డీ ఇవ్వడం సాధ్యం కాదని అమాయకులు నమ్మ వద్దని ఎవరైనా ఇస్తామని చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Fake customs officer arrestedRelated Images:

[See image gallery at manatelangana.news]

The post నకిలీ కస్టమ్స్ అధికారి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: