జైళ్లలో మార్పు సామాజిక విజయం

కాలంలో అన గా 201011 సంవత్సరాలలో రాష్ట్రం లో ఉన్న 143 జైళ్లలో వసతుల లేమితో కొట్టుమిట్టాడేవి. అనారోగ్యకర వాతావరణంలో ఖైదీలు వ్యాధుల పీడితులై చనిపోయేవారు. 2010-11లో రాష్ట్రంలో జైళ్ల మరమ్మత్తు, వసతుల కల్పన కోసం రూ. 10 కోట్లు కేటాయించినా ఆ సొమ్ము దేనికీ సరిపోలేదు. ఇప్పుడు జైళ్ల నిర్వహణలో ఉన్న పెట్రోలు పంపులే ఏడాదికి రూ. 10 కోట్ల పై లాభాల్ని గడిస్తున్నాయి. పాత రోజుల్లో జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోతే సమీపంలో జైళ్లలోకి వారిని […] The post జైళ్లలో మార్పు సామాజిక విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాలంలో అన గా 201011 సంవత్సరాలలో రాష్ట్రం లో ఉన్న 143 జైళ్లలో వసతుల లేమితో కొట్టుమిట్టాడేవి. అనారోగ్యకర వాతావరణంలో ఖైదీలు వ్యాధుల పీడితులై చనిపోయేవారు. 2010-11లో రాష్ట్రంలో జైళ్ల మరమ్మత్తు, వసతుల కల్పన కోసం రూ. 10 కోట్లు కేటాయించినా ఆ సొమ్ము దేనికీ సరిపోలేదు. ఇప్పుడు జైళ్ల నిర్వహణలో ఉన్న పెట్రోలు పంపులే ఏడాదికి రూ. 10 కోట్ల పై లాభాల్ని గడిస్తున్నాయి. పాత రోజుల్లో జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోతే సమీపంలో జైళ్లలోకి వారిని పంపేవారు.

ఎప్పుడూ జైళ్లు వాటి సామర్థాన్ని మించిన సంఖ్యతో ఉండేవి. ప్రస్తుతం కేంద్ర కారాగారాలు ముషీరాబాద్, చంచల్‌గూడ, వరంగల్‌లో ఉండగా జిల్లా జైళ్లు ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మంలో ఉన్నాయి. స్త్రీల కోసం ప్రత్యేక జైలు హైదరాబాద్‌లో ఉంది. అదే విధంగా బాల నేరస్థుల కోసం బోస్టల్ పాఠశాల నిజామాబాద్‌లో ఉంది. వీటిలో వసతుల కల్పన మెరుగైనందువల్ల ఖైదీల మానసిక వికాసానికి కూడా తోడైయింది. వైద్య సదుపాయాలు పెరిగినందువల్ల ఖైదీల మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే మళ్లీ అదే తరహాలో నేరం చేసి పోలీసులకు చిక్కిన వారిని గురించి వార్తల్లో చూస్తుంటాము. జైలు జీవితం వల్ల వారిలో ఎలాంటి మార్పురానందుకు బాధ వేస్తుంది కూడా. అయితే అందుకు భిన్నంగా 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో వచ్చిన మార్పులు, చేపట్టిన సంస్కరణలు ఖైదీల నవ సామాజిక జీవనం పట్ల ఆశలు రేకెత్తిస్తాయి.

శిక్షపడ్డ ఖైదీగా అనుభవించిన జైలు జీవితం ఆ మనిషిలో మార్పుకు నాందీ పలికి తిరిగి నేరం చేయడానికి ఇష్టపడని కాలం రావడం గొప్ప విషయమే. దానికి రుజువుగా తెలంగాణ రాష్ట్రంలో జైళ్లు ఖైదీలు లేక మూతపడుతున్నాయి. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో ఉన్న 49 జైళ్లలో 17 మూతపడడం ఓ శుభ పరిణామమే. గత రెండేళ్లుగా 7000 ఖైదీల్లో విడుదలయిన వారు పోగా, కొత్తవారు రాగా మిగిలిన సంఖ్య 5000 లోపే. ఎప్పుడూ సరాసరిగా సాగే ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పటికే ఆర్మూర్, బోధన్, నర్సంపేట, మధిర, పరకాల జైళ్లలో మిగిలిన కొద్దిపాటి ఖైదీలను సమీప జిల్లా జైళ్లలోకి తరలించారు. ఖాళీ అయిన జైళ్లను సంక్షేమ కేంద్రాలు అనాథల నిలయాలుగా మార్చుతున్నారు. సత్ప్రవర్తనతో విడుదలకు సిఫారసు చేయబడ్డ వేయి మంది ఖైదీల జాబితా ఆమోదం కోసం గవర్నర్ కార్యాలయంలో ఉన్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అనగా 2010-11 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న 143 జైళ్లలో వసతుల లేమితో కొట్టుమిట్టాడేవి. అనారోగ్యకర వాతావరణంలో ఖైదీలు వ్యాధుల పీడితులై చనిపోయేవారు. 2010-11లో రాష్ట్రంలో జైళ్ల మరమ్మత్తు, వసతుల కల్పన కోసం రూ. 10 కోట్లు కేటాయించినా ఆ సొమ్ము దేనికీ సరిపోలేదు. ఇప్పుడు జైళ్ల నిర్వహణలో ఉన్న పెట్రోలు పంపులే ఏడాదికి రూ. 10 కోట్ల పై లాభాల్ని గడిస్తున్నాయి. పాత రోజుల్లో జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోతే సమీపంలో జైళ్లలోకి వారిని పంపేవారు. ఎప్పుడూ జైళ్లు వాటి సామర్థాన్ని మించిన సంఖ్యతో ఉండేవి.

ప్రస్తుతం కేంద్ర కారాగారాలు ముషీరాబాద్, చంచల్‌గూడ, వరంగల్‌లో ఉండగా జిల్లా జైళ్లు ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మంలో ఉన్నాయి. స్త్రీల కోసం ప్రత్యేక జైలు హైదరాబాద్‌లో ఉంది. అదే విధంగా బాల నేరస్థుల కోసం బోస్టల్ పాఠశాల నిజామాబాద్‌లో ఉంది. వీటిలో వసతుల కల్పన మెరుగైనందువల్ల ఖైదీల మానసిక వికాసానికి కూడా తోడైయింది. వైద్య సదుపాయాలు పెరిగినందువల్ల ఖైదీల మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

2013లో 53 మంది జైలు జీవితం గడుపుతూ చనిపోగా 2018 లో కేవలం 8 మంది ఖైదీలు మరణించారు. ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఖైదీలు అనారోగ్య పీడితులు కావడం సర్వసాధారణంగా ఉండే దశ నుండి మార్పు రావడానికి మరో కారణం జైళ్లలో ధూమపానాన్ని నిషేధించడం అనవచ్చు. ఖైదీలు పొద్దు పోవడానికి బీడీలు, సిగరెట్లు కాల్చడం పరిపాటి. అలవాటు లేనివాళ్లకు కూడా ఆ వాతావరణం, కుటుంబానికి దూరమైన బెంగ ధూమపానాన్ని చేరువ చేస్తుంది. జైలు క్యాంటీన్లలో వాటి అమ్మకాలు ఉండేవి. అయితే 2015లో రాష్ట్రంలోని జైళ్లలో పొగ త్రాగడం పూర్తి స్థాయిలో నిషేధింపబడింది.

క్యాంటీన్లలో వాటి అమ్మకం నిలిపివేశారు. అతిగా అలవాటున్న ఖైదీలు తాళలేక జైలు అధికారులతో గొడవ పెట్టుకున్నారు కూడా. వారికి వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆరోగ్యంతో పాటు, జైల్లో సంపాదించిన సొమ్ము కూడా వృథా అవుతుందని హితబోధ చేసి నెల రోజుల్లో గొడవ సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. ఖాళీగా ఉన్న జైలును ఇతర రాష్ట్రాల ఖైదీలకు సదుపాయంగా మలచి దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని జైళ్ల శాఖ భావిస్తోంది. వసతుల కల్పన ద్వారా ఒక్కో ఖైదీ నెలకు రూ. 10,000/ వసూలు చేయవచ్చు. నార్వే దేశంలో జై ళ్లు దాదాపుగా ఖాళీ అయ్యాయి. వాటిలో ప్రస్తుతం విదేశీ ఖైదీలకు ఆశ్రయమిచ్చి ఖర్చు రాబట్టుతోంది.

పంజాబ్ రాష్ట్రంలో జైళ్ల సామర్థం తక్కువ. 1500 మందికి వసతి కల్పించే వాటిలో 3500 మంది కుక్కుతున్నారు. చత్తీస్‌గఢ్‌లోనూ అదే పరిస్థితి. ఆయా రాష్ట్రాల ఖైదీలకు తెలంగాణ అతిథ్య మీయవచ్చు. 26.1.2019 నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలోని జైళ్లలో 5256 మగ, 394 ఆడ ఖైదీలున్నారు. వారిలో శిక్షపడిన వారు 2171 కాగా రిమాండ్ ఖైదీలు 3228 మంది ఉన్నారు. జైళ్ల నిర్వహణ కోసం సిబ్బంది జీతభత్యాలతో ఏడాది రూ. 100 కోట్లు ఖర్చవుతాయి. ఈ భారాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖపై తగ్గించేందుకు జైల్లో ఆదాయ మార్గాలు చూసుకుంటున్నాయి. ప్రస్తుతం జైళ్ల నిర్వహణలో 20 ప్యూయిల్ స్టేషన్లు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా రూ. 17 కోట్ల ఆదాయం వస్తోంది. వీటి సంఖ్య పెంచుకోవడానికి కేంద్ర పెట్రోలియం శాఖకు జైళ్ల నిర్వాహకులు తమకు ప్రత్యేక కోటా ఈయాలని లేఖ రాయడం జరిగింది. ఆ రకంగా కనీసం వంద పెట్రోలు పంపులను పొందగలిగితే ఏటా ఆదాయం రూ. 100 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. వీటిని విడుదలైన ఖైదీలతో, డిపార్ట్‌మెంట్‌లో రిటైరైన ఉద్యోగులతో నడపాలని ఆలోచన.

జైలు నిర్వహణలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా జైలు ఆదాయం, ఖైదీలకు కూలీ లభించడం ఒక లాభమైతే వృత్తి నైపుణ్యం పొందిన ఖైదీ బయటి ప్రపంచంలో తిరిగి నేరం చేసే అవసరం రాకపోవచ్చు. తమకు తెలిసిన వృత్తిలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జైళ్లలో సబ్బులు, బెడ్‌షీట్లు, ఫర్నీచర్ తయారవుతున్నాయి. వీటికి సంబంధించిన అమ్మకపు కేంద్రాలు రాష్ట్ర మంతటా ఉన్నాయి. 2014 నాటికి ఈ ఉత్పత్తుల టర్నోవర్ 149 కోట్లు ఉండగా లాభం 3 కోట్ల దాకా వచ్చింది. 2018 నాటికి వ్యాపారం రూ. 496 కోట్లకు పెరిగి లాభం కూడా రూ. 17 కోట్లు దక్కింది. ఖైదీల్లో 73 శాతం మంది ఈ ఉద్యోగావకాశాల్ని వాడుకుంటున్నారు.

జైళ్లలో ఉన్న ఖైదీలతో సందర్భాను గుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. వయోజన విద్యా కేంద్రంలో దాదాపు అందరూ పాలు పంచుకుంటున్నారు. చదువుపై ఆసక్తి ఉన్నవారు, మధ్యలో వదిలేసిన వారు విద్యాధికులు అవుతున్నారు. గతేడాది జైళ్లలో నిర్వహించిన జాబ్ మేళాలో 235 మంది ఎంపికయ్యారు. ఫ్లిప్‌కార్డ్, స్విగ్గీ, కార్వీ లాంటి 20 కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. రాష్ట్రంలో చేపట్టిన హరిత హారంలోనూ జైళ్లు కీలక పాత్ర పోషించాయి. చంచల్ గూడ జైలో నలుగురు యావజ్జీవ ఖైదీలు 5700మొక్కలను కాపాడుతూ వస్తున్నారు. 2014 నుండి రాష్ట్ర జైళ్ల శాఖకు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించిన వికె సింగ్ ఆలోచనల, శ్రమ ఫలితం ఈ మార్పు. ఈ మధ్యనే ఆయన ప్రింటింగ్ స్టేషనరీ డిపార్ట్‌మెంటుకు కమిషనర్‌గా బదిలీ అయ్యారు. జైళ్ల నిర్వహణ ప్రస్తుతం సందీప్ శాండిల్య సారథ్యంలో ఉంది.

                                                                                              బి.నర్సన్, 9440128169

Change in Prisons is Social Success

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జైళ్లలో మార్పు సామాజిక విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: