మధ్యవర్తులూ…అయోధ్య పరిష్కారమేదీ?

న్యూఢిల్లీ : అయోధ్య భూ వివాద కేసులో మధ్యవర్తిత్వ ప్రక్రియపై సుప్రీంకోర్టు గురువారం ఆరా తీసింది. మధ్య వర్తుల కమిటీ తాము తేల్చుకున్న అంశాలతో స్థాయీ నివేదికను వారం రోజుల్లోగా సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఈ నివేదికలో సదరు కమిటీవారు సమస్యకు సామరస్య పరిష్కారం చూపలేకపోతే, తామే ఇక రంగంలోకి దిగాల్సి ఉంటుందని రా జ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సవ్యమైన పరిష్కార మార్గాలు చూపెట్టలేకపోతే కమిటీకి […] The post మధ్యవర్తులూ… అయోధ్య పరిష్కారమేదీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ : అయోధ్య భూ వివాద కేసులో మధ్యవర్తిత్వ ప్రక్రియపై సుప్రీంకోర్టు గురువారం ఆరా తీసింది. మధ్య వర్తుల కమిటీ తాము తేల్చుకున్న అంశాలతో స్థాయీ నివేదికను వారం రోజుల్లోగా సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఈ నివేదికలో సదరు కమిటీవారు సమస్యకు సామరస్య పరిష్కారం చూపలేకపోతే, తామే ఇక రంగంలోకి దిగాల్సి ఉంటుందని రా జ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సవ్యమైన పరిష్కార మార్గాలు చూపెట్టలేకపోతే కమిటీకి బుదులుగా తామే ఇక ఈనెల 25వ తేదీనుంచి అయోధ్య వ్యాజ్యంపై రోజువారీ విచారణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని విస్తృత ధర్మాసనం తెలిపింది. మధ్యవర్తిత్వ కమిటీతో ఎటువంటి ప్రయోజనంలేదని, దీనితో వ్యవహారాన్ని తిరిగి సరైన రీతిలో తేల్చాల్సి ఉందని రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం వాస్తవ క్లయింట్లలో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం స్పందించింది. కక్షిదారు తరఫున సీనియర్ న్యాయవాది కెఎస్ పరశరణ్ వాదనలు విన్పించారు. మధ్యవర్తిత్వం కుదరదని, న్యాయస్థానం జోక్యమే మార్గమని పిటిషనర్ తెలిపారు. దీనిపై స్పందించిన రాజ్యాంగ ధర్మాసనం కమిటీకి వారం రోజుల గడువు ఇచ్చింది.

మధ్యవర్తిత్వ పరిష్కారం కోసం ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించిం ది. ఇందులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎం ఖలీలుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశం కర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచూ సభ్యులుగా ఉన్నారు. సామరస్య పరిష్కార సూచనకు ఈ కమిటీకి ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకూ తొలుత గడువు ఇచ్చింది. అయితే ఇప్పటివరకూ కమిటీ వివిధ స్థాయిలలో అభిప్రాయ సేకరణ నిర్వహించింది కానీ ఎటువంటి ప్రతిపాదనలు, సూచనలు వెలువరించలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే దాఖలు అయిన పిటిషన్‌ను తీవ్రంగానే పరిగణించిన ధర్మాసనం ఇప్పుడు కమిటీ నుంచి స్థాయీ నివేదికను కోరింది. చీఫ్ జస్టిస్‌తో పాటు ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్‌ఎ బోడ్బే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎన్‌ఎ నజీర్ సభ్యులుగా ఉన్నారు. ‘ఇప్పటివరకూ మధ్యవర్తిత ప్రక్రియతో జరిగిన పురోగతి, ప్రస్తుత దశ గురించి తెలియచేయాలని జస్టిస్ (రిటైర్డ్) ఎఫ్‌ఎం ఖలీఫుల్లాను అభ్యర్థించడం సముచితం అని భావిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.

వచ్చే గురు వారం నాటికి జస్టిస్ ఖలీఫుల్లా నుంచి నివేదిక అందుతుందని ఆశిస్తున్నట్లు, దీనిని బట్టి ఆ తేదీననే తదుపరి ఆదేశాలను వెలువరించడం జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత పిటిషన్ విచారణ క్రమం లో ఇతర కక్షిదార్లు మధ్యవర్తిత్వ ప్రక్రియకు వ్యతిరేకంగా అనుకూలంగావాదనలు విన్పించారు. రామ్‌లల్లా వజ్రమాన్ తరఫు న్యాయవాది రంజీత్ కుమార్ తమ వాదనలో ప్రస్తుత పిటిషన్ సరైనదే అని తెలిపారు. కీలక వ్యాజ్యాన్ని మధ్యవర్తిత్వ కమిటీకి నివేదించడం వల్ల ప్ర యోజనం లేదని తాము ఆది నుంచి చెపుతూ వస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లిం పక్షం తరఫున హాజరయిన న్యాయవాది రాజీవ్‌ధావన్ మధ్యవర్తిత్వ ప్రక్రియ రద్దును వ్యతిరేకించారు. కమిటీ కొనసాగాలని, ఇప్పుడు దాఖలైన పిటిషన్ కేవలం సామరస్య పరిష్కారానికి విఘాతం కల్పించడం అవుతుందని తెలిపారు. ఈ దశలో న్యాయస్థానం కలుగచేసుకుని తాము మధ్యవర్తిత్వ ప్యానెల్‌ను స్వయంగాఏర్పాటు చేయడంవల్ల, కమిటీ తాజా స్థాయీ నివేదికను పొంది, తగు విధంగా స్పందించేందుకు వీ లుందని,దీనిపై వాదనలు అవసరంలేదనిస్పష్టం చేశారు.

Ayodhya land dispute case

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మధ్యవర్తులూ… అయోధ్య పరిష్కారమేదీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: