ప్రాణం తీసిన టిక్‌టాక్ సరదా

మేడ్చల్ జిల్లా దూలపల్లిలో చెరువులో మునిగి మృతిచెందిన యువకుడు మన తెలంగాణ/ పేట్‌బషీరాబాద్ : టిక్ టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం బలితీసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. సిఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా కోహిర్ మండ లం సజ్జాపూర్ గ్రామానికి చెందిన శరణయ్య కుమారుడు బేగరి నర్సింహులు (24) దూలపల్లిలోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. వరుసకు అన్నదమ్ములైన ప్రశాంత్‌తో కలిసి ఈ నెల 9న […] The post ప్రాణం తీసిన టిక్‌టాక్ సరదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మేడ్చల్ జిల్లా దూలపల్లిలో చెరువులో మునిగి మృతిచెందిన యువకుడు

మన తెలంగాణ/ పేట్‌బషీరాబాద్ : టిక్ టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం బలితీసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. సిఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా కోహిర్ మండ లం సజ్జాపూర్ గ్రామానికి చెందిన శరణయ్య కుమారుడు బేగరి నర్సింహులు (24) దూలపల్లిలోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. వరుసకు అన్నదమ్ములైన ప్రశాంత్‌తో కలిసి ఈ నెల 9న దూలపల్లిలోని తూమార్ చెరువు వద్ద సరదాగా స్నానానికని ఇంటి నుంచి వెళ్ళారు. అనంతరం చెరువులో దిగి టిక్ టాక్ యాప్‌ను అనుకరిస్తూ స్నానం చేస్తూ ప్రశాంత్, నర్సింహాలు సెల్ఫీ వీడి యో చిత్రికరిస్తున్నారు. అయితే నర్సింహాకు ఈతరాకపోవడంతో వీడి యో తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. దీంతో భయాబ్రాంతులకు గురైన ప్రశాంత్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.టిక్‌టాక్ మోజులో పడి యువత ప్రమాదాల భారీన పడవద్దని సిఐ మహేష్ అన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో యువత చెడు మార్గాలను ఎంచుకోకుండ మంచిమార్గాన్ని ఎంచుకుని ముందుకెళ్ళాలన్నారు.

Death by drowning in the pond of a young man

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రాణం తీసిన టిక్‌టాక్ సరదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: