ఎన్జీటీ ఆదేశాలను పాటించాలి

జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి ప్రణాళికలను రూపొందించుకోవాలి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ మనతెలంగాణ/హైదరాబాద్: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయంలో OA నెంబర్ 606/2018 నకు సంబంధించి ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై సిఎస్ జోషి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ […] The post ఎన్జీటీ ఆదేశాలను పాటించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి
ప్రణాళికలను రూపొందించుకోవాలి
జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

మనతెలంగాణ/హైదరాబాద్: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయంలో OA నెంబర్ 606/2018 నకు సంబంధించి ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై సిఎస్ జోషి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయోమెడికల్ వేస్ట్, నదుల కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, స్యాండ్ మైనింగ్ తదితర అంశాలకు సంబంధించి సిఎస్ సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, నదులు, వాయుకాల్యుష్యం, బయోమెడికల్ వేస్ట్ తదితర అంశాలపై జిల్లా కమిటీలు ప్రతినెల సమావేశమై మినెట్స్‌ను పంపడంతో పాటు త్రైమాసిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని జోషి ఆదేశించారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించి జిహెచ్‌ఎంసి జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు చూపించాలన్నారు. పట్టణ, గ్రామాలకు డంపింగ్ యార్డులు ఉండేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. చెత్తను సేకరించే వారికి తడి, పొడి చెత్త వేరు చేయడంపై హౌజ్ హోల్డ్‌ను చైతన్యం చేసేలా జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని, చెత్త సేకరణకు అవసరమైన ఆటోలు, రిక్షాలు సమకూర్చుకోవాలని సిఎస్ సూచించారు.
వినియోగంలో లేని
క్వారీల వివరాలు పంపాలి
సాలీడ్ వేస్ట్ కు సంబంధించి జిహెచ్‌ఎంసి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, సిద్ధిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ మున్సిపాలిటీలతో పాటు ప్రతి జిల్లాలో 3 గ్రామాల్లో పూర్తి స్థాయిలో అక్టోబర్ 29 నాటికి అమలు చేసేలా తీసుకుంటున్న చర్యలను సిఎస్ సమీక్షించారు. డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు, చెత్త సేకరణ, ప్రాసెసింగ్, వేరు చేయటం, డిస్పోజల్ తదితర అంశాల గురించి కలెక్టర్లతో ఆయన మాట్లాడారు.
వివిధ జిల్లాలో మైనింగ్ అనంతరం వినియోగంలో లేని క్వారీల వివరాలను కలెక్టర్లకు పంపాలని వాటిని ఘన వ్యర్ధాల నిర్వహణకు వినియోగించుకునేలా చూడాలని సిఎస్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ అంశాలకు సంబంధించి కమిటీ ప్రత్యేక సమావేశం ప్రతినెలా నిర్వహించి నివేదికను పిసిబికి పంపాలన్నారు.
బయోమెడికల్ వేస్ట్ కు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులను 11 ఇన్సులేటరీ యూనిట్స్ కు ట్యాగ్ చేయాలని, రిజిస్ట్రర్ కాని ఆసుపత్రులను రిజిస్ట్రర్ అయ్యేలా చూడాలని సిఎస్ పేర్కొన్నారు. నదుల పొల్యూషన్ స్ట్రెచెస్ కు సంబంధించి జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అక్రమ ఇసుక మైనింగ్, శుద్ధి చేయని వ్యర్ధాలు కలవకుండా చూడాలని కలెక్టర్లను ఆయన కోరారు, నగరీకరణ, పారిశ్రామికీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాయుకాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చోట ఎయిర్ క్వాలిటీ స్టేషన్‌లను ఏర్పాటు చేయాల న్నారు. ఇసుక మైనింగ్ కు సంబంధించి సైంటిఫిక్ పద్ధతిలో చేయాలని, అక్రమ మైనింగ్ జరగకుండా కలెక్టర్లు చూసుకోవాలన్నారు.
జిల్లా స్థాయి కమిటీలు
నెలవారీ సమావేశాలు నిర్వహించాలి
అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లా స్థాయి కమిటీలు నెలవారీ సమావేశాలు నిర్వహించాలని, త్రైమాసిక నివేదికల్లో భాగంగా ఆ పీరియడ్‌లో రెగ్యులర్ గా చేపడుతున్న కార్యక్రమాలు, చర్యల వివరాలతో పాటు కొత్తగా చేపట్టిన అంశాలను ప్రత్యేకంగా పేర్కొనాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు జిల్లాలో తీసుకున్న చర్యల నివేదికలను క్రోడీకరించి ఎన్జీటికి సమర్పిస్తామన్నారు. ఈ అంశాలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను కలెక్టర్లకు పంపుతున్నామన్నారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్, సిబిసి సెక్రటరీ అనిల్ కుమార్, పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ మాణిక్ రాజ్, మల్సూర్, మైన్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Secretary General of Government Video Conference with Collectors

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎన్జీటీ ఆదేశాలను పాటించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: