సుప్రీం ఆదేశాలతో కదిలిన కర్నాటక స్పీకర్

రెబెల్స్ తాజా రాజీనామాల లేఖలు, సరిగానే ఉన్నాయన్న సభాపతి, బలపరీక్ష ఎదుర్కొంటా : సిఎం కుమారస్వామి బెంగళూరు : కర్నాటక సంకీర్ణ సర్కారు సంక్షోభం గురువారం పలు కీలక మలుపులు తిరిగింది. ఎమ్మెల్యేల రాజీనామాలు నిజమైనవా? స్వచ్ఛందంగానే చేశారా? అనేది తాము నిర్థారించుకోవల్సి ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ గురువారం స్పష్టం చేశారు.గురువారమే రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలకు వీలు కల్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లడం, తనకు నిర్ణయం తీసుకునే సమయం అవసరం అని స్పీకర్ […] The post సుప్రీం ఆదేశాలతో కదిలిన కర్నాటక స్పీకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రెబెల్స్ తాజా రాజీనామాల లేఖలు, సరిగానే ఉన్నాయన్న సభాపతి, బలపరీక్ష ఎదుర్కొంటా : సిఎం కుమారస్వామి

బెంగళూరు : కర్నాటక సంకీర్ణ సర్కారు సంక్షోభం గురువారం పలు కీలక మలుపులు తిరిగింది. ఎమ్మెల్యేల రాజీనామాలు నిజమైనవా? స్వచ్ఛందంగానే చేశారా? అనేది తాము నిర్థారించుకోవల్సి ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ గురువారం స్పష్టం చేశారు.గురువారమే రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలకు వీలు కల్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లడం, తనకు నిర్ణయం తీసుకునే సమయం అవసరం అని స్పీకర్ ప్రతి పిటిషన్ వేయడం, ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరడం, స్పీకర్‌తో భేటీ కావడం , శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో కర్నాటకలో రాజకీయాలు అత్యంత కీలక దశకు చేరాయి. గురువారమే రాజీనామాలపై నిర్ణయం సంగతి తెలియచేయాలని సుప్రీంకోర్టు పేర్కొనడం, కీలక అంశంపై మెరుపు వేగపు చర్యలు కుదరవని స్పీకర్ పేర్కొనడం కీలకంగా మారాయి. రాత్రంతా తాను రాజీనామాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సుప్రీంకోర్టు గురువారం ఎమ్మెల్యేల అంశంపై స్పందించడంతో స్పీకర్ తమ వైఖరిని ప్రకటించారు. తమ రాజీనామాల విషయం తేల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతితో ప్రత్యేక విమానంలో వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో స్పీకర్‌ను కలిశారు.

తమ రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితికి తన బాధ్యత ఏమీ లేదని , దీని వల్ల జరగబోయే పరిస్థితి గురించి కూడా తనకు అవసరం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్‌లోనే రాజీనామాలకు దిగినట్లు తెలిసిందని, అయితే ఇవి స్వచ్ఛందమైనవా కావా? అనేది తాను పరిశీలించాల్సి ఉంటుందని స్పీకర్ వారికి తేల్చిచెప్పారు. తమ రాజీనామా నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియచేసేందుకు సుప్రీంకోర్టు గురువార ం అనుమతిని ఇచ్చింది. వీరి రాజీనామాల గురించి స్పీకర్ తన నిర్ణయాన్ని తమకు గురువారమే తెలియచేయాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశించారు. కర్నాటక పోలీసులు ఈ ఎమ్మెల్యేలు బెంగళూరులో భద్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కర్నాటక డిజిపిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలు కలియడానికి అనుమతిని ఇచ్చిన స్పీకర్ తాను ఉన్నట్లుండి రాజీనామాలపై స్పందించలేనని, మెరుపు వేగం ఇటువంటి వాటిలో కుదరదని తేల్చిచెప్పారు. అయితే కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణానికి సహకరించేందుకు స్పీకర్ పావులు కదుపుతున్నారని, రాజీనామాలపై నిర్ణయం తీసుకోకపోవడం ఇందులో భాగం అని రెబెల్ ఎమ్మెల్యేలు విమర్శించారు.

కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు వలయం మధ్య ఎమ్మెల్యేల బృందం గురువారం మధ్యాహ్నం విధాన సౌధలోని అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లారు. దీనితో ఈ ప్రాంతంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ వారితో గంటసేపు భేటీ అయ్యారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. రాజీనామాలను ఆమోదిస్తున్నారా? లేదా అనే విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ , తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని , రాత్రంతా కూడా రాజీనామాలను పరిశీలించుకుని, వీటిలో నిజాయితీ ఎంత అనేది ఖరారు చేసుకోవల్సి ఉంటుందని తరువాతనే నిర్ణయం ఉంటుందని తేల్చిచెప్పారు. స్పీకర్ చాంబర్‌లోకి ప్రజా ప్రతినిధులు వెళ్లడం ఇతర ఘటనలను వీడియో తీశారు. ఒక్కరోజు క్రితం రెబెల్ ఎమ్మెల్యేలలో ఒకరైన కె సుధాకర్‌ను సంకీర్ణ పక్షంలోని జెడిఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టారని, గదిలో బంధించారని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రవేశాన్ని రికార్డు చేశారు.

గురువారం బస్బరాజ్ అనే ఎమ్మెల్యే దాదాపుగా పరుగులు తీస్తూ స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లడం కన్పించింది. రాజీనామాల గురించి స్పీకర్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజీనామాలను తాను అన్నివిధాలుగా పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ ధర్మం అని తన అభ్యర్థనలో తెలిపారు. ఇటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు ఒక్కరోజు గడువుతోనే ముగియడం కుదరదని తేల్చిచెప్పారు.
రాజీనామాలు చేయనివ్వని స్పీకర్ : ఎమ్మెల్యేలు
కర్నాటక స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించడం లేదని రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది. సుప్రీంకోర్టులో గురువారం వీరితరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ వాదించారు. రాజీనామాలకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడ్డారని, అయితే స్పీకర్ అనుమతించడం లేదని తెలిపారు. రాజీనామాలకు వెళ్లినప్పుడు వారికి కన్పించకుండా స్పీకర్ వెనుక గుమ్మం నుంచి చాంబర్ వదిలి వెళ్లారని న్యాయవాది తెలిపారు. తమ వద్దకు వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే విషయం గురించి అనుమతిని ఇస్తున్నట్లు ఇతరుల గురించి కాదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. గురువారం పిటిషన్ వేసిన ఎమ్మెల్యేలలో ప్రతాప్ గౌడ పాటిల్, రమేష్ జర్కిహోలీ, బైరాతి బస్వరాజ్ , బిసి పాటిల్ ఇతరులు ఉన్నారు. ఈ నెల 12వ తేదీనే శుక్రవారం అసెంబ్లీ భేటీ ఉందని, అయితే దీనికి ముందే రెబెల్స్‌పై అనర్హత వేటుకు అధికార పక్షం స్పీకర్‌ను కోరిందని, స్పీకర్ కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉందని రెబెల్స్ తరఫు న్యాయవాది తెలిపారు. బలపరీక్షకు వీలు కల్పించకుండా స్పీకర్ వివక్షతతో సభ్యులను అనర్హులుగా చేసేందుకు యత్నిస్తున్నారని , తాము రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్లాలనుకుంటున్నామని , తిరిగి ఎన్నికలు కోరుకుంటున్నామని ఈ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ నెల 1వ తేదీనుంచి జరిగిన పరిణామాల గురించి న్యాయవాది రోహత్గీ ధర్మాసనానికి వివరించారు. అయితే తమకు ఇవేవీ ఆశ్చర్యం కల్గిండచం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Karnataka Political crisis

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సుప్రీం ఆదేశాలతో కదిలిన కర్నాటక స్పీకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: