18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18 న అసెంబ్లీ 19న మండలి సమావేశం కానుంది. జులై 18వ తేదీన బిల్లు ప్రతులను శాసనసభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19 న అది చట్టంగా ఆమోదం పొందుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ మండలి […] The post 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్ : నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18 న అసెంబ్లీ 19న మండలి సమావేశం కానుంది. జులై 18వ తేదీన బిల్లు ప్రతులను శాసనసభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19 న అది చట్టంగా ఆమోదం పొందుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్ధేశించిందని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఏమీ ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు సిఎం తెలిపారు. కాగా మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.

Telangana Assembly meets On July 18th or 19th

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: