కోలుకోని అభిమానులు

ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓటమి పాలుకావడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. మ్యాచ్ ముగిసి ఒక రోజు గడిచినా ఆ షాక్ నుంచి క్రికెట్ ప్రేమీకులు బయట పడలేక పోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. జట్టు ఓటమిపై సోషల్ మీడియా వేదికగా తమకు తోచిన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయాలపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆడాల్సిన సమయంలో […] The post కోలుకోని అభిమానులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓటమి పాలుకావడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. మ్యాచ్ ముగిసి ఒక రోజు గడిచినా ఆ షాక్ నుంచి క్రికెట్ ప్రేమీకులు బయట పడలేక పోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. జట్టు ఓటమిపై సోషల్ మీడియా వేదికగా తమకు తోచిన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయాలపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆడాల్సిన సమయంలో ముగ్గురు కీలక ఆటగాళ్లు వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు.

ముఖ్యంగా కోహ్లి, రాహుల్, రోహిత్, కార్తీక్‌లపై వీరు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరైనా 20 ఓవర్ల వరకు క్రీజులో నిలిచి ఉంటే భారత్ కచ్చితంగా ఫైనల్‌కు చేరేదని వారు వాపోతున్నారు. ఇక, కీలక మ్యాచ్‌లో షమిని పక్కన బెట్టడం, కివీస్‌ను తక్కువ స్కోరురే పరిమితం చేసే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోక పోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. చాహల్‌ను ఈ మ్యాచ్‌లో తీసుకుని పెద్ద తప్పిదమే చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాహల్ వేసిన ఓ చెత్త ఓవర్ భారత్‌ను మ్యాచ్ నుంచి దూరం చేసిందని మరి కొందరూ విమర్శిస్తున్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో కోహ్లి సేనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

india vs newzealand match

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోలుకోని అభిమానులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: