ఫైనల్లో ఇంగ్లండ్

చెలరేగిన వోక్స్, రాయ్ మెరుపులు.. సెమీస్‌లో ఆస్ట్రేలియా చిత్తు బర్మింగ్‌హామ్: ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం లార్డ్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ (85), కారే (46) తప్ప మిగతావారు విఫలం కావడంతో ఆస్ట్రేలియా తక్కువ […] The post ఫైనల్లో ఇంగ్లండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
చెలరేగిన వోక్స్, రాయ్ మెరుపులు.. సెమీస్‌లో ఆస్ట్రేలియా చిత్తు

బర్మింగ్‌హామ్: ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం లార్డ్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ (85), కారే (46) తప్ప మిగతావారు విఫలం కావడంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 32.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఊరిస్తున్న లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్‌స్టోలు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. బెయిర్‌స్టో సమన్వయంతో ఆడగా, రాయ్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బెయిర్‌స్టో ఐదు ఫోర్లతో 34 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక, మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రాయ్ 65 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 9 ఫోర్లతో 85 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో బెయిర్‌స్టోతో కలిసి తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించాడు. బెయిర్‌స్టో, రాయ్‌లు ఒకరి వెంట ఒకరూ పెవిలియన్ చేరినా అప్పటికే ఇంగ్లండ్ సురక్షిత స్థితికి చేరుకుంది. మిగతా లాంఛనాన్ని జో రూట్ (49 నాటౌట్; 46 బంతుల్లో 8×4), కెప్టెన్ మోర్గాన్ (45 నాటౌట్; 39 బంతుల్లో 8×4) పూర్తి చేశారు.

ఆదుకున్న స్మిత్, కారే

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఇంగ్లండ్ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించారు. 10 పరుగుల్లోపే ఆరోన్ ఫించ్ (0)ను ఆర్చర్, డేవిడ్ వార్నర్ (9)ని వోక్స్ పెవిలియన్ పంపించారు. మరో 4 పరుగులకే పీటర్ హాండ్స్‌కొంబ్ (4)ను వోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 14 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తనపై వేసుకున్నాడు. అతనికి వికెట్ కీపర్ అలెక్స్ కారే అండగా నిలిచాడు. ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. స్మిత్ సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. మరోవైపు కారే దూకుడుగా ఆడాడు. ఈ సమయంలో ఆటలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న అలెక్స్ కారేకు ఈ సమయంలో తీవ్ర గాయమైంది. ఇంగ్లండ్ స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ బంతికి కారే తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్చర్ బంతి దవడకు తగలడంతో కారేకు తీవ్ర గాయమైంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా కష్టాలు మరింత పెరగడం ఖాయమని అందరూ భావించారు. అయితే కారే మాత్రం జట్టు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మైదానంలోనే నిలిచాడు. ప్రథమ చికిత్స చేసుకుని బ్యాండెజ్‌తో బ్యాటింగ్ కొనసాగించాడు. కారే అంకితభావానికి మైదానంలో అభిమానులు ఫిదా అయ్యారు. ఇరు దేశాల అభిమానులు కూడా కారేను ప్రోత్సహించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కారే 70 బంతుల్లో నాలుగు బౌండరీలతో 46 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇదే సమయంలో స్మిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు కీలకమైన 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కూడా రషీద్‌కే దక్కింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మిత్ పోరాటం కొనసాగించాడు. ఇదే సమయంలో మాక్స్‌వెల్‌తో కలిసి 39 పరుగులు జోడించాడు. ధాటిగా ఆడిన మాక్స్‌వెల్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన స్మిత్ 119 బంతుల్లో ఆరు ఫోర్లతో 85 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతావారిలో స్టార్క్ (29) మాత్రమే రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, రషీద్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఆర్చర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

స్కోరు బోర్డు:

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) బెయిర్‌స్టో (బి) క్రిస్ వోక్స్ 9, అరోన్ ఫించ్ ఎల్బీబి జోఫ్రా ఆర్చర్ 0, స్టీవ్ స్మిత్ రనౌట్ 85, పీటర్ హాండ్స్‌కొంబ్ (బి) క్రిస్ వోక్స్ 4, అలెక్స్ కారే (సి) విన్స్ (బి) ఆదిల్ రషీద్ 46, మార్కస్ స్టోయినిస్ ఎల్బీబి ఆదిల్ రషీద్ 0, గ్లెన్ మాక్స్‌వెల్ (సి) మోర్గాన్ (బి) ఆర్చర్ 22, పాట్ కమిన్స్ (సి) రూట్ (బి) ఆదిల్ రషీద్ 6, మిఛెల్ స్టార్క్ (సి) బట్లర్ (బి) క్రిస్ వోక్స్ 29, బెహ్రాన్‌డార్ఫ్ (బి) మార్క్‌వుడ్ 1, నాథన్ లియాన్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం 49 ఓవర్లలో 223 ఆలౌట్.బౌలింగ్: క్రిస్ వోక్స్ 80203, జోఫ్రా ఆర్చర్ 100322, బెన్‌స్టోక్స్ 40220, మార్క్‌వుడ్ 90451, ఫ్లంకెట్ 80440, ఆదిల్ రషీద్ 100543.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ (సి) కారే (బి) కమిన్స్ 85, జానీ బెయిర్‌స్టో ఎల్బీబి స్టార్క్ 34, రూట్ నాటౌట్ 49, మోర్గాన్ నాటౌట్ 45, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం 32.1 ఓవర్లలో 226/2.
బౌలింగ్: బెహ్రాన్‌డార్ఫ్ 8.12380, మిఛెల్ స్టార్క్ 90701, పాట్ కమిన్స్ 70341, నాథన్ లియాన్ 50490, స్టీవ్ స్మిత్ 10210, మార్కస్ స్టోయినిస్ 20130.

England in Final of World Cup

The post ఫైనల్లో ఇంగ్లండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: