ఒక్కరోజే 930 పెరిగింది..

రూ.36 వేలకు చేరువలో బంగారం ధర ముంబై: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం ఒక్కరోజే వెయ్యి రూపాయల వరకు పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.36 వేలకు చేరువ అవుతోంది. కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాన్ని పెంచినప్పటి నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తోంది. క్రితం రోజుల్లో కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్లీ ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం నాడు అమాంతం రూ.930 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 35,800కు చేరింది. ఇదే […] The post ఒక్కరోజే 930 పెరిగింది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
రూ.36 వేలకు చేరువలో బంగారం ధర

ముంబై: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం ఒక్కరోజే వెయ్యి రూపాయల వరకు పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.36 వేలకు చేరువ అవుతోంది. కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాన్ని పెంచినప్పటి నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తోంది. క్రితం రోజుల్లో కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్లీ ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం నాడు అమాంతం రూ.930 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 35,800కు చేరింది.

ఇదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలు కూడా బం గారం ధరలు మరింత పెరగడానికి కారణమయ్యాయి. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించనున్నామనిసంకేతాలు ఇవ్వడం పుత్తడి డిమాండ్‌ను మరింత పెంచింది. ఫెడ్ ఇచ్చిన సంకేతాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడికి బంగారమే మేలని భావించారని, అందువల్లే ఈ విలువైన లోహం ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు పే ర్కొంటున్నారు. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఈ లోహాలకు డిమాండ్‌ను పెంచిందని పేర్కొన్నా రు. మరోవైపు బంగారం దారిలో వెండి పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కిలో వెండి ధర రూ. 300 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 39,200కు చేరింది.

దేశీయంగానూ డిమాండ్

ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ ప్రకారం, 99.9%, అలాగే 99.5% స్వచ్ఛత బంగారం ధర రూ.930 పెరిగి వరుసగా రూ.35,800, రూ.35,630లకు (10 గ్రాములు) చేరుకుంది. అంతర్జాతీయంగానూ అలాగే దేశీయంగానూ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పుత్తడి ధర పరుగులు పెట్టిందని ట్రేడర్లు పేర్కొంటున్నారు. సావరిన్ గోల్డ్ కూడా రూ.100 పెరిగి 8 గ్రాములకు రూ.27,400కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో..

త్వరలో వడ్డీరేట్లు తగ్గొచ్చిన అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలివ్వడంతో బంగారం డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ ఆర్థిక దృక్పథం బలహీనం, అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు పరిష్కారం కాకపోవడం వంటి కారణాలను వడ్డీ తగ్గింపునకు కారణాలుగా చూపారు. అంతర్జాతీయంగా చూస్తే.. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1,420.80 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.24 డాలర్లుగా ఉంది.

Gold prices hike

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒక్కరోజే 930 పెరిగింది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: