యాదాద్రి క్షేత్ర నిర్మాణం.. చారిత్రాత్మకం

మన తెలంగాణ/యాదాద్రి: తెలంగాణ ప్రసిద్ధ క్షేత్రంగా యాదాద్రి ఆలయాన్ని సిఎం కెసిఆర్ పునర్‌నిర్మాణ అభివృద్ధి సంకల్పం చారిత్రాత్మకమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనార్థం గురువారం యాదాద్రి క్షేత్రాన్ని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కొండపై జరుగుతున్న ప్రధాన గర్భాలయ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి పనుల వివరాలను పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకొని సూచనలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి […] The post యాదాద్రి క్షేత్ర నిర్మాణం.. చారిత్రాత్మకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/యాదాద్రి: తెలంగాణ ప్రసిద్ధ క్షేత్రంగా యాదాద్రి ఆలయాన్ని సిఎం కెసిఆర్ పునర్‌నిర్మాణ అభివృద్ధి సంకల్పం చారిత్రాత్మకమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనార్థం గురువారం యాదాద్రి క్షేత్రాన్ని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కొండపై జరుగుతున్న ప్రధాన గర్భాలయ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి పనుల వివరాలను పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకొని సూచనలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదాద్రి క్షేత్రం తిరుమల తరహాలో మహాక్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని, ప్రధానాలయం పూర్తిగా కృష్ణశిల సంపదతో ఆధ్యాత్మికంగా నిర్మించబడుతున్నటువంటి నిర్మాణంలో శిల్పుల కృషి అమోఘమని అన్నారు.

ఆలయాభివృద్ధిలో స్వామి వారి దర్శనానికి వచ్చే అశేష భక్తజనులకు పూర్తి స్థాయి వసతులు చేపట్టడం జరుగుతుందని, భక్తుల కోసం కాటేజీల పనులు, విఐపిల వసతి కోసం సూట్ల నిర్మాణం శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే గర్భాలయ నిర్మాణం పనులు, శివాలయ నిర్మాణం, ఆలయ ప్రహారీ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని, గర్భాలయ ముఖద్వార తలుపులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయాభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరుగుతుందని, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, యాదాద్రి క్షేత్ర పునర్‌ప్రారంభం ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ ఈవో గీత తదితరులున్నారు.

మంత్రికి పూర్ణకుంభ స్వాగతం : స్వామి వారి దర్శనార్ధం యాదాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభంతో స్వామి వారి బాలాలయంలోకి స్వాగతించారు. శ్రీవారి బాలాలయంలోనే కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహుని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం స్వామి వారి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Minister indrakaran reddy visit yadadri Temple

Related Images:

[See image gallery at manatelangana.news]

The post యాదాద్రి క్షేత్ర నిర్మాణం.. చారిత్రాత్మకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: