పండ్లతో అనారోగ్యం దూరం!

వర్షాకాలం… పలు సమస్యలను తెస్తుంది. ఈ కాలంలో సరైన ఆహారం తీసుకోకుంటే రోగ నిరోధక శక్తి దెబ్బతిని అనారోగ్యాల బారిన పడతారు. ఏం తినాలి, తాగాలి, ఏం తినకూడదు అనే విషయాల మీద అవగాహన ఉండాలి. మాంసంతో జాగ్రత్త: ఈ కాలంలో మాంసం అతిగా తినటం అనర్థదాయకం. జీర్ణక్రియ మీద భారం పడుతుంది. కాబట్టి మాంసాహారం మితంగా తీసుకోవాలి. సూప్స్, హెవీ గ్రేవీస్ లాంటివి ఆరోగ్యానికి మంచిది. కారానికి దూరం: కారం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే శరీర […] The post పండ్లతో అనారోగ్యం దూరం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వర్షాకాలం… పలు సమస్యలను తెస్తుంది. ఈ కాలంలో సరైన ఆహారం తీసుకోకుంటే రోగ నిరోధక శక్తి దెబ్బతిని అనారోగ్యాల బారిన పడతారు. ఏం తినాలి, తాగాలి, ఏం తినకూడదు అనే విషయాల మీద అవగాహన ఉండాలి.
మాంసంతో జాగ్రత్త: ఈ కాలంలో మాంసం అతిగా తినటం అనర్థదాయకం. జీర్ణక్రియ మీద భారం పడుతుంది. కాబట్టి మాంసాహారం మితంగా తీసుకోవాలి. సూప్స్, హెవీ గ్రేవీస్ లాంటివి ఆరోగ్యానికి మంచిది.

కారానికి దూరం: కారం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను పెంచి రక్త ప్రసరణను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల అలర్జీలు త్వరగా శరీరం అంతటా వ్యాపిస్తాయి. అలర్జీలకు గురయ్యే స్వభావం ఉన్నవారు కారం అతిగా తినటాన్ని తగ్గించాలి.
శక్తికి ధాన్యాలు : పప్పుధాన్యాలు, తృణధాన్యాలలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. రాగులు, సోయాబీన్, పెసలు, మొక్కజొన్న లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు సమతులాహారం శరీరానికి అందుతుంది. రెట్టించిన శక్తితో ఉత్సాహంగా ఉంటారు.
మితమే హితం: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తిన్నది జీర్ణమవటానికి చాలా సమయం పడుతుది. కాబట్టి ఆహారం కొద్ది మొత్తంలో తీసుకోవటం మంచిది.
దినుసులతో కషాయాలు: ఈ కాలంలో చాలా త్వరగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అల్లం, తులసి, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్కలాంటి ఔషధగుణాలున్న దినుసులతో కషాయాలు తయారుచేసుకోని గోరువెచ్చటి నీటితో తీసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. కూరగాయలు, పళ్లు తీసుకోండి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్న కూరగాయలు, పళ్లను అధికంగా తీసుకోవాలి. దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటి లాంటి పండ్లను తీసుకోవాలి. పళ్లు, కూరగాయల వినియోగానికి ముందు తప్పనిసరిగా వాటిని శుభ్రంగా కడగండి. దీనివల్ల సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూరలాంటి వాటిని తినటం మానేయాలి.
బయట ఫుడ్ వద్దు: రోడ్డు పక్కన అమ్మే ఛాట్, పానీపూరి, జ్యూస్, బట్టర్‌మిల్క్, ఐస్‌క్రీం, కుల్ఫీల వంటి ఆహార పదార్థాలు, పానీయాల తయారీలో కలుషిత నీటిని వాడే అవకాశం ఉంది. వాటివల్ల అనారోగ్యం పాలవటం ఖాయం. ఆఫీసుకు, బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లటం మంచిది. తప్పనిసరి అయితే శుచీ శుభ్రత పాటించే హోటళ్లలో మాత్రమే తినాలి.
వెచ్చని పానీయాలు: ఈ కాలం టీ, కాఫీలకు బదులు గ్రీన్‌టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ లాంటివి తీసుకోవాలి. అల్లం, మిరియాలు, తేనె కలుపుకొని టీ చేసుకోని తాగాలి. పుదీనా, తులసి ఆకులు కూడా కలిపితే మంచిది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. ఆరోగ్యానికి మంచిది.

Sick distance with fruits

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పండ్లతో అనారోగ్యం దూరం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: