టిక్‌టాక్‌ సరదాకు యువకుడు బలి: (వైరల్ వీడియో)

పేట్‌బషీరాబాద్: టిక్ టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం బలితీసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం…. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి చెందిన శరణయ్య కుమారుడు బేగరి నర్సింహులు (24) దూలపల్లిలోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. వరుసకు అన్నదమ్ములైన ప్రశాంత్‌తో కలిసి ఈ నెల 9న దూలపల్లిలోని తూమార్ చెరువు వద్ద సరదాగా స్నానానికని ఇంటి నుంచి వెళ్ళారు. అనంతరం చెరువులో దిగి […] The post టిక్‌టాక్‌ సరదాకు యువకుడు బలి: (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పేట్‌బషీరాబాద్: టిక్ టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం బలితీసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం…. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి చెందిన శరణయ్య కుమారుడు బేగరి నర్సింహులు (24) దూలపల్లిలోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. వరుసకు అన్నదమ్ములైన ప్రశాంత్‌తో కలిసి ఈ నెల 9న దూలపల్లిలోని తూమార్ చెరువు వద్ద సరదాగా స్నానానికని ఇంటి నుంచి వెళ్ళారు. అనంతరం చెరువులో దిగి టిక్ టాక్ యాప్‌ను అనుకరిస్తూ స్నానం చేస్తూ ప్రశాంత్, నర్సింహాలు సెల్ఫీ వీడియో చిత్రికరిస్తున్నారు.

అయితే నర్సింహాకు ఈతరాకపోవడంతో వీడియో తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. దీంతో భయాబ్రాంతులకు గురైన ప్రశాంత్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టిక్ టాక్ మోజులో పడి యువత ప్రమాదాల భారీన పడవద్దని సిఐ మహేష్ అన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో యువత చెడు మార్గాలను ఎంచుకోకుండ మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకెళ్ళాలన్నారు.

Courtesy by NewsX

Youth Died Making Tiktok Video

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిక్‌టాక్‌ సరదాకు యువకుడు బలి: (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: