అగ్రకుల అమ్మాయితో పెళ్లి.. దళిత యువకుడిని నడిరోడ్డుపై నరికి నరికి…

  గాంధీనగర్: అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని దళిత యువకుడిని పోలీసుల ముందు నడిరోడ్డులో నరికి చంపిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ సమీపంలోని వార్మోర్ అనే గ్రామంలో హరేశ్ అనే దళిత యువకుడు, రాజ్‌పూత్ వర్గానికి చెందిన ఊర్మిళ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఊర్మిళ కుటుంబ సభ్యులు వీళ్ల పెళ్లిని వ్యతిరేకించారు. పోలీసులు రక్షణ కల్పించడంలో వీళ్లు జీవనం సాగిస్తున్నారు. ఊర్మిళ తండ్రి ప్రేమ జంటను ఏమీ చేయనని హామీ ఇవ్వడంతో […] The post అగ్రకుల అమ్మాయితో పెళ్లి.. దళిత యువకుడిని నడిరోడ్డుపై నరికి నరికి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గాంధీనగర్: అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని దళిత యువకుడిని పోలీసుల ముందు నడిరోడ్డులో నరికి చంపిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ సమీపంలోని వార్మోర్ అనే గ్రామంలో హరేశ్ అనే దళిత యువకుడు, రాజ్‌పూత్ వర్గానికి చెందిన ఊర్మిళ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఊర్మిళ కుటుంబ సభ్యులు వీళ్ల పెళ్లిని వ్యతిరేకించారు. పోలీసులు రక్షణ కల్పించడంలో వీళ్లు జీవనం సాగిస్తున్నారు. ఊర్మిళ తండ్రి ప్రేమ జంటను ఏమీ చేయనని హామీ ఇవ్వడంతో రెండు నెలల గర్భవతి అయినా ఊర్మిళ తన అమ్మగారింటికి వెళ్లింది. అనంతరం తన భార్యను తీసుకొచ్చేందుకు రాష్ట్ర మహిళా సహాయ కేంద్రం కౌన్సిలర్‌తో పాటు కానిస్టేబుల్ వెంటబెట్టుకొని పోలీస్ వాహనంలో హరేశ్ తన అత్తగారింటికి వెళ్లాడు. హరేష్ పోలీసు వాహనంలో కూర్చొని ఉండగా అధికారులు ఊర్మిళ ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఊర్మిళ పంపేందుకు ఒక నెల గడువు కావాలని కుటుంబ సభ్యులు సదరు అధికారులను కోరారు. దీంతో ఇంటి నుంచి అధికారులు బయటకు వస్తున్నప్పుడు ఊర్మిళ తండ్రి దశరథ్ సిన్హ కూడా బయటకు వచ్చాడు. పోలీస్ వాహనంలో కూర్చున్న హరేశ్ దశరథ్‌కు కనిపించాడు. దీంతో తన బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్న హరజనుడు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు నరికేయండని గట్టిగా ఆరిచాడు. ఇంతలోనే పది మంది కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. అడ్డువచ్చిన లేడీ కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశారు. పది నిమిషాల్లోనే హరేశ్ ను నడి రోడ్డు పై నరికి నరికి ముక్కలు చేశారు. గాయపడిన కానిస్టేబుల్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి బలగాలను పంపించాలని తెలిపింది. వాళ్లు 15 నిమిషాలు తరువాత ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే హరేశ్ కన్నుమూశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నారు. హరేశ్ కుటుంబం అతడిపై ఆధారపడి జీవిస్తోంది.

The post అగ్రకుల అమ్మాయితో పెళ్లి.. దళిత యువకుడిని నడిరోడ్డుపై నరికి నరికి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: