పాక్ లో ఘోర రైలు ప్రమాదం

పాక్ : దక్షిణ పంజాబ్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాదిఖాబాద్‌లోని వాల్హర్‌  రైల్వేస్టేషన్‌లో పట్టాలపై నిలిపి ఉంచిన గూడ్స్‌రైలును అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఓ మహిళ ఉంది. గాయపడిన వారిలో 9 మంది మహిళలు, 11 […] The post పాక్ లో ఘోర రైలు ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాక్ : దక్షిణ పంజాబ్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాదిఖాబాద్‌లోని వాల్హర్‌  రైల్వేస్టేషన్‌లో పట్టాలపై నిలిపి ఉంచిన గూడ్స్‌రైలును అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఓ మహిళ ఉంది. గాయపడిన వారిలో 9 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు హైడ్రలిక్ కట్టర్ లను తెప్పించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని పాక్ రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Train Accident in Pak

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాక్ లో ఘోర రైలు ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: