ఎసిబి సోదాల్లో ఎంఆర్ఒ ఇంట్లో 93 లక్షలు

  హైదరాబాద్: కేశంపేట తహసీల్దార్‌ లావణ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె ఇంట్లో ఎసిబి అధికారులు తనిఖీలు చేయగా.. ఎక్కడ చూసినా రూ.2000, రూ.500 నోట్ల కట్టలు! బీరువాలు, కప్‌ బోర్డుల్లో కరెన్సీ కట్టలు! మూడు గంటల్లోనే రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు అదుపులోకి తీసుకొని వాటిని అధికారులు సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్లితే… దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి చెన్నయ్యకు 12 ఎకరాల భూమి ఉంది. అందులో 9.7 […] The post ఎసిబి సోదాల్లో ఎంఆర్ఒ ఇంట్లో 93 లక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కేశంపేట తహసీల్దార్‌ లావణ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె ఇంట్లో ఎసిబి అధికారులు తనిఖీలు చేయగా.. ఎక్కడ చూసినా రూ.2000, రూ.500 నోట్ల కట్టలు! బీరువాలు, కప్‌ బోర్డుల్లో కరెన్సీ కట్టలు! మూడు గంటల్లోనే రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు అదుపులోకి తీసుకొని వాటిని అధికారులు సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్లితే… దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి చెన్నయ్యకు 12 ఎకరాల భూమి ఉంది. అందులో 9.7 ఎకరాలను తన పేరు మీద చేసేందుకు చెన్నయ్య కుమారుడు భాస్కర్, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ఒ అనంతయ్యను కలిశాడు. దీంతో  ఆన్‌లైన్‌లో అతని పేరు నమోదు చేయడానికి రూ.30 వేలు లంచం తీసుకొని చేశారు. కానీ, గత నెల 18న ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసి 24న తొలగించడంతో భాస్కర్‌ మళ్లీ అనంతయ్యను సంప్రదించాడు.

ఈ సారి విఆర్ఒ అనంతయ్య ఎకరాకు రూ.లక్ష చొప్పున 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని భాస్కర్‌ చెప్పడంతో రూ.8 లక్షలకు ఒప్పందం కుదిరింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎసిబి అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో భాస్కర్‌ ఎసిబి అధికారులను సంప్రదించగా ముందుగా పానిన్న పతకం ప్రకారం బుధవారం కొందుర్గులో భాస్కర్‌, అనంతయ్యకు రూ.4 లక్షలు లంచం ఇస్తూ పట్టుంచాడు. ఎసిబి అధికారులు విఆర్ఒను ప్రశ్నించగా ఇందులో రూ.5 లక్షలు కేశంపేట తహసీల్దార్‌ లావణ్యకు, మిగ్గత రూ.3 లక్షలు తనకని విఆర్ఒ అనంతయ్య చెప్పినట్లు డిఎస్ సి తెలియజేశారు.

గురువారం విఆర్ఒ అనంతయ్యను పథకం ప్రకారం బాధితుడు అతనికి డబ్బులు ఇచ్చి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించారు. మొత్తం రూ.9 లక్షలు డిమాండ్‌ చేసిన విఆర్ఒ దాంట్లో రూ.5 లక్షలు తహసీల్దార్‌ వాటా అని చెప్పాడు. దీంతో ఎసిబి అధికారులు ఆ మహిళా తహసీల్దార్‌ను విచారించగా ఆ లంఛంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తీరా, ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. ఎక్కడ చూసినా రూ.2000, రూ.500 నోట్ల కట్టలు! బీరువాలు, కప్‌ బోర్డుల్లో కరెన్సీ కట్టలు మూడు గంటల్లోనే రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. ఇక్కడ ఏసీబీకి పట్టుబడింది కొందుర్గు వీఆర్వో అనంతయ్య కాగా.. ఎసిబి విచారణ ఎదుర్కొంటున్న ఆ మహిళా అధికారి రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసిల్దార్‌ లావణ్యను రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఉత్తమ అధికారిణిగా గుర్తించింది.

 

The post ఎసిబి సోదాల్లో ఎంఆర్ఒ ఇంట్లో 93 లక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: