పసుపు బోర్డు ప్రస్తావన లేని బడ్జెట్

  భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం తర్వాత రాష్ట్రంలోని నిజామాబాద్ రైతు సమస్యలను రాజకీయ సమస్యలుగా పసుపు, ఎర్ర జొన్న పంటలు మార్చడం దేశ వ్యాప్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా సంవత్సరాల నుండి దేశంలో పసుపు సౌందర్య సాధనంగా, ఔషధంగా, ఆహారం దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. పసుపు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. మహారాష్ట్రకు చెందిన సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలో అత్యధికమైన పసుపు వ్యాపారం జరుగుతుంది. పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా […] The post పసుపు బోర్డు ప్రస్తావన లేని బడ్జెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం తర్వాత రాష్ట్రంలోని నిజామాబాద్ రైతు సమస్యలను రాజకీయ సమస్యలుగా పసుపు, ఎర్ర జొన్న పంటలు మార్చడం దేశ వ్యాప్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా సంవత్సరాల నుండి దేశంలో పసుపు సౌందర్య సాధనంగా, ఔషధంగా, ఆహారం దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. పసుపు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. మహారాష్ట్రకు చెందిన సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలో అత్యధికమైన పసుపు వ్యాపారం జరుగుతుంది. పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతోంది. భౌగోళిక పరిస్థితులు, నేలల అనుకూలం వలన పసుపు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా పండించడం జరుగుతుంది.

అదే విధంగా తమిళనాడు, ఒరిస్సా, కేరళ మహారాష్ట్రలు కూడా పండిస్తున్నారు. దేశ అవసరాలకు, ఎగుమతులకు 50 నుండి 55 లక్షల బస్తాల పసుపు సరిపోతుందని అంచనా కానీ 65 నుండి 70 లక్షల బస్తాల వరకు ఉత్పత్తి అవుతుంది. పసుపు పంట అవసరానికి మించి దేశంలో పండుతుంది. ఎర్ర జొన్నలను ఆహారంలో చిరు ధాన్యాలుగా వివిధ రూపాలలో వినియోగించుకోవడం జరుగుతుంది. ఎర్ర జొన్నలు శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే సూక్ష్మపోషకాలను ఇవ్వడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ ఎర్ర జొన్న పంట కూడా నిజామాబాద్ ప్రాంతంలో అత్యధికంగా పండుతూ ఆహారంలో చిరుధాన్య పంటగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా పసుపు, ఎర్ర జొన్న పంటలను కనీస మద్దతు ధర పరిధిలోకి తీసుకురాకపోవడం, దళారుల చేతుల్లో మోసపోయి గిట్టుబాటు ధర రాక పోవడం, అధిక వర్షపాతం వలన పంట నష్టపోవడంతో పరిహారం లేకపోవడం లాంటి అనేక సమస్యల వలన రైతులు న్యాయం కోసం తరచు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనకు దిగడం జరుగుతున్నది. పసుపు పంట వాణిజ్య పంట కావడంతో అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మద్దతు ధర కల్పించాలంటే పసుపు బోర్డు మాత్రమే పరిష్కారం అని నేతలు తప్పించుకోవడం, అదే విధంగా మన ప్రజాస్వామ్య దేశంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడిన వారి తరపు ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను చట్టసభల్లో సరైన విధంగా ప్రశ్నించకపోవడంతో ఆ రైతుల సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందడంతో రాజకీయ సమస్య వైపు దారి తీయడం జరిగింది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ ప్రాంతంలోని 176 మంది రైతులు నిరసనగా నామినేషన్లు దాఖలు చేయడంతో పాటు వారణాసి నియోజక వర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయడం దేశ దృష్టిని ఆకర్షించటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల వాగ్దానాల వైఫల్యాలకు నిదర్శనం. కేవలం ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ, తాత్కాలిక ప్రయోజనాలకు పై దృష్టి పెడుతూ సామాన్య ప్రజానీకాన్ని మభ్యపెట్టి ఎన్నికలలో గెలుస్తూ దీర్ఘకాలిక రైతు ప్రయోజనాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ రైతు ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో పసుపు, ఎర్రజొన్న రైతులు ప్రభుత్వాల ముందు అనేక డిమాండ్లను పెట్టడం జరిగింది. కావున ముఖ్యంగా అమలు చేయవలసినవి పరిశీలిస్తే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, వ్యవసాయ మెగా ఆహార పార్కులు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు పంటను కొనుగోలు చేసేలా కృషి చేయాలి. పసుపును ఎగుమతి చేయడానికి ప్రత్యేక బ్రాండ్ సృష్టించాలి, మద్దతు ధరకు కొనుగోలు చేసేలా కృషి చేయాలి. పసుపు శుద్ధి చేసే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి విదేశాలకు ఎగుమతి అయ్యేలా చూడాలి. పసుపు సాగు పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ఒకవేళ ధర పడిపోతే ఈ విభాగం ద్వారా కొనుగోలు చేయాలి. దీనికై ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి.

రైతులకు నాణ్యమైన, ఎర్రజొన్న విత్తనాలను రాయితీతో అందించాలి దాని కోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలి. పసుపు కొమ్ములు ఉడక పెట్టాక ఆరబెట్టడానికి సిమెంటు కల్లాలు ఏర్పాటు చేయాలి, పసుపు పంటను నిల్వ చేయడానికి గోదాములను ఏర్పాటు చేయాలి. దేశంలో సమీకృత మార్కెట్ వ్యవస్థ అయిన ఈ నామ్(e NAM) లోకి పసుపు, ఎర్ర జొన్నలను చేర్చి మార్కెట్లో ఆన్‌లైన్ అమ్మకాలు జరిగేలా చూడాలి. ఎర్ర జొన్న, పసుపు విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులు గిట్టుబాటు ధర లేదని తక్కువ ధరకు కొనుగోలు చేయడం జరుగుతున్నది. తద్వారా రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పసుపు ధర క్వింటాలుకు రూ. 15 వేల వరకు, ఎర్ర జొన్నలు క్వింటాలుకు రూ. 4 వేలు ఉండే విధంగా మద్దతు ధరను ప్రకటించాలని అనేక డిమాండ్లను వ్యక్తం చేసినప్పటికీ భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ల్లో పసుపు బోర్డు పై ఎలాంటి ప్రస్తావన లేకుండా సాదాసీదాగా కొనసాగించడం జరిగినది.

గత కొన్ని దశాబ్దాల కాలం నుండి వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో పడిన నేపథ్యంలో దేశానికి వెన్నెముకగా పిలవబడుతున్న రైతు ఆత్మహత్యలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజకీయాలకతీతంగా పసుపు, ఎర్రజొన్న రైతులకు ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ రైతుల సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి వారు పండిస్తున్న పసుపు, ఎర్రజొన్నకు తగిన గిట్టుబాటు ధర అందిస్తూ ప్రోత్సాహాన్ని కల్పించవలసి ఉంది. అదే విధంగా పసుపు, ఎర్ర జొన్న పంటలకు తెలంగాణ రాష్ట్రం దేశంలో, ప్రపంచంలో ప్రత్యేకత చాటే విధంగా కృషి చేయవలసిన అవసరం ఉంది. పసుపు, ఎర్రజొన్న పండే ప్రాంతాలను (crop colony) పంట కాలనీగా గుర్తించవలసిన అవసరం ఉంది. అదే విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేసి రైతుకు ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రతను కల్పిస్తూ నవ శకాన్ని వ్యవసాయ రంగంలోకి తెచ్చే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

Yellow board Not In Budget 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పసుపు బోర్డు ప్రస్తావన లేని బడ్జెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: