రేషన్ డీలర్ల అక్రమ దందాపై నిఘా…

  గతంలో 523 దుకాణాల్లో అక్రమాలు గుర్తింపు సరుకులు పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు రికార్డులు, ఈపాస్ యంత్రాల నిర్వహణ తీరుపై అనుమానాలు అక్రమాలు తేలితే కేసులు నమోదు, డీలర్‌షిప్ రద్దుకు సన్నాహాలు హైదరాబాద్ : నగరంలో ప్రజాపంపిణీ వ్యవస్థ్ద ద్వారా నెలనెలా పేదలకు అందజేసే సరుకులు పక్కదారిపడుతున్నాయనే విమర్శలకు చెక్ పెట్టేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారులు డీలర్ల పనితీరుపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకునేందుకు నడుంబిగిస్తున్నారు. రెండునెలల కితం విజిలెన్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు బృందాలు […] The post రేషన్ డీలర్ల అక్రమ దందాపై నిఘా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గతంలో 523 దుకాణాల్లో అక్రమాలు గుర్తింపు
సరుకులు పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు
రికార్డులు, ఈపాస్ యంత్రాల నిర్వహణ తీరుపై అనుమానాలు
అక్రమాలు తేలితే కేసులు నమోదు, డీలర్‌షిప్ రద్దుకు సన్నాహాలు

హైదరాబాద్ : నగరంలో ప్రజాపంపిణీ వ్యవస్థ్ద ద్వారా నెలనెలా పేదలకు అందజేసే సరుకులు పక్కదారిపడుతున్నాయనే విమర్శలకు చెక్ పెట్టేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారులు డీలర్ల పనితీరుపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకునేందుకు నడుంబిగిస్తున్నారు. రెండునెలల కితం విజిలెన్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు బృందాలు చేసి తనిఖీలో గ్రేటర్ పరిధిలో 523 రేషన్‌దుకాణాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించి వారికి నోటీసులు కూడా జారీ చేశారు. అయిన డీలర్లు పాతపద్దతిలో బ్లాక్ మార్కెట్ బాట వీడటంలేదు.

వీరి అక్రమాలకు కళ్లెంవేసి లబ్దిదారులకు ప్రభుత్వం అందజేసే సరుకులు పూర్తిగా చేరేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతినెలా సరుకుల సంబంధించిన రికార్డుల తనిఖీలు, ఈపాస్‌యంత్రాల్లో జరిగే గోల్‌మాల్ వ్యవహారాలను పసిగట్టి, అక్రమాలు జరిగితే డీలర్‌షిప్‌ను రద్దుచేసేందుకు కూడా వెనకడమని వెల్లడిస్తున్నారు. రేషన్‌దారులు నెలవారీగా తీసుకునే సరుకుల్లో బియ్యం ఎక్కువ తీసుకున్నట్లు, మిగతా సరుకులు తీసుకోవడంలేదని,వాటిని దర్జాగా దళారులకు విక్రయిస్తున్నట్లు బయటపడింది. వేలిముద్రలు ప్రక్రియ పూర్తిగానే కార్డుదారుని పోన్‌కు తీసుకున్నట్లు సమాచారం రావాలని, కానీ అలాంటి ఏమిరాకుండా డీలర్లు జాగ్రత్తలు తీసుకుని, బియ్యం ఒకటే తీసుకుని రేషన్ ద్వారా అందే సరుకులు పూర్తిగా తీసుకున్నట్లు రికార్డులో నమోదు చేశారు.

వాస్తవానికి లబ్దిదారులు తీసుకునేది బియ్యం మాత్రమే, మిగతా సరుకులు ఇవ్వమంటే ప్రస్తుతానికి అందుబాటులో లేని సమాధానం చెప్పి రేషన్ దుకాణాల సమయం ముగిసిన తరువాత డబుల్ ధరలు అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 9సర్కిళ్లల్లో 1545 రేషన్‌దుకాణాల ద్వారా 16,02,150 ఆహారభద్రతకార్డులతో రేషన్ సరుకులు అందజేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 5,85,039 కార్డులుండగా 21,85,668 యూనిట్లు, రంగారెడ్డిలో 5,23,089 కార్డులు, 17,46,079 యూనిట్లు, మేడ్చల్ జిల్లాలో ఆహారభద్రత కార్డులు 4,94,006కార్డులు, 16,4 7,269 యూనిట్లు ఉన్నాయి. ఇందులో నెలవారీగా 15శాతం మంది కా ర్డుదారులు సరకులు తీసుకోకుండా డీలరుకే సరుకులు ఇచ్చి బియ్యానికి కిలో రూ. 12, గోదుమలు రూ. 18 చొప్పన ఇస్తూ బ్లాక్ మార్కెట్ దందా కు ప్రోత్సాహిస్తున్నారు.

వీరంతా ధనవంతులు కావడంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పొందేందుకు రేషన్‌కార్డులు తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్సు తనిఖీలు చేసినప్పడు గుర్తించారు.వీటిపై సివిల్ సప్లయి అధికారులకు స్దానికులు ఫిర్యాదులు చేసిన తొలగించడంలేదని విమర్శిస్తున్నారు. అధికారులు మాత్రం తొలగించాలని నోటీసులు జారీచేస్తే రాజకీయ ఒత్తిడిలు చేయించి తమను ఇబ్బందులకు గురిచేశారని వాపోతున్నారు. ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఆహారభద్రత కార్డులను ఇంటింటి పరిశీలన చేస్తే సుమారుగా 2 లక్షలవరకు అనర్హులు తేలుతారని అంటున్నారు.ఈసారి మాత్రం ఊపేక్షించికుండా రేషన్‌సరుకులు బ్లాక్‌మార్కెట్ తరలించే డీలర్లను గుర్తించి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్దమైతున్నట్లు వివరిస్తున్నారు.

Surveillance on illicit racket of Ration Dealers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రేషన్ డీలర్ల అక్రమ దందాపై నిఘా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: