తెలంగాణలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

  తెలంగాణకు చేయూతనివ్వండి అన్ని పంటలకూ ఎంఎస్‌పి ఇవ్వాలి… వ్యవసాయ శాఖ మంత్రుల భేటీలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. అలాగే రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగుకు సహకరించాలన్నారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అధ్యక్షతన షిండే హాల్ లో అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. […] The post తెలంగాణలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలంగాణకు చేయూతనివ్వండి
అన్ని పంటలకూ ఎంఎస్‌పి ఇవ్వాలి…
వ్యవసాయ శాఖ మంత్రుల భేటీలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. అలాగే రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగుకు సహకరించాలన్నారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అధ్యక్షతన షిండే హాల్ లో అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ మన్ ధాన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రికల్చర్ ఎక్స్‌పోర్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెట్ కమిటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అంశాలపై చర్చ జరిగింది.

రాష్ట్రం నుంచి హాజరైన నిరంజన్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ.. వేరుశనగ ఉత్పత్తిలో పలుమార్లు జాతీయ రికార్డు సాధించామని, వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పంటలకూ మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని పంటలకే పరిమితం చేయడం మూలంగా రైతు నష్టపోతున్నారని, రాష్ట్రం మీద భారం పడుతుందన్నారు. తెలంగాణలో మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులు పునరుద్ధరించామని,  నీతి అయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సూచించినా కేంద్రం నిధులివ్వలేదన్నారు. సూక్ష్మ సేద్యానికి పెద్దపీట వేయడంతో పాటు, వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం అందించామని వివరించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న అన్ని విషయాలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో మొదలుపెట్టిందని, కేంద్రం అమలుచేస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనకు తెలంగాణ రైతుబంధు అమలు విధానాలు మార్గదర్శకం కావడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఉన్నారు.

 All state Agriculture Ministers meeting in New Delhi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: