ప్రతి వీధి వ్యాపారి విధిగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకోవాలి…

  హైదరాబాద్‌ : గ్రేటర్ హైదరాబాద్‌లోని వీధి వ్యాపారులు ( స్ట్రీట్ వెండర్స్) త ప్పని సరిగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జిహెచ్‌ఎంసి అధికారులను కమిషనర్ ఎం. దానకిషోర్ ఆదేశించారు. సోమవారం ‘సాఫ్ హైదరాబాద్.. షాన్ హైదరాబాద్ ’ ,హరితహరం, కోర్టు కేసులు, స్ట్రీట్ వెండింగ్ పాలసీ తదితర అంశాలపై జోనల్, డిప్యూటీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ద కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున చర్యలు […] The post ప్రతి వీధి వ్యాపారి విధిగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకోవాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌ : గ్రేటర్ హైదరాబాద్‌లోని వీధి వ్యాపారులు ( స్ట్రీట్ వెండర్స్) త ప్పని సరిగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జిహెచ్‌ఎంసి అధికారులను కమిషనర్ ఎం. దానకిషోర్ ఆదేశించారు. సోమవారం ‘సాఫ్ హైదరాబాద్.. షాన్ హైదరాబాద్ ’ ,హరితహరం, కోర్టు కేసులు, స్ట్రీట్ వెండింగ్ పాలసీ తదితర అంశాలపై జోనల్, డిప్యూటీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ద కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నప్పటికి పుట్‌పాత్‌లు, రహదారులకు ఇరువైపులా ఉండే చిరు వ్యాపారులు రాత్రి వేళలో పెద్ద ఎత్తున గార్బెజ్‌ను రహదారులపై వదిలిపెడుతున్నారని, తద్వారా స్వచ్చ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందన్నారు.

ప్రతి వీధి వ్యాపారి, విధిగా డస్ట్‌బిన్‌లు వారంలోగా ఏర్పాటు చేసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో గుర్తించిన 161 సమస్యాత్మక ప్రాంతాల చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణంలో ఏ విధమైన హకర్లు, చిరు వ్యాపారులు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నగరంలో వచ్చే సోమవారం నుంచి సాయంత్ర వేళలోనూ గార్బెజ్‌ను తరలిచేందుకు ప్రతి సర్కిల్‌కు నాలుగు వాహనాలు,బాబ్ కాట్‌లను కేటాయించనున్నట్లు దాన కిషోర్ తెలిపారు. గ్రేటర్‌లో ప్రతి రోజు నగర వాసుల వినియోగార్దం 420 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా దీనిలో 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వృథాగా రోడ్లపై వదులుతున్నారన్నారు. ఈ వృథాగా అయ్యే నీ రు ప్రస్తుతం చెన్నై నగరానికి అందించే నీటితో సమానమని వెల్లడించా రు.

నీటిని వృథాగా రో డ్లపై వదిలేసే వారిని గుర్తించి పెద్ద ఎత్తున జ రిమానాలు విధించాలని, ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార సంస్థలు, ఎవరూ నీటిని వృథాగా రోడ్లపైకి వదిలనా భారీ ఎత్తున జరిమనాలు విధించాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగరంలో పారిశుద్ద కార్యక్రమాలను మరింత సమర్దవంతంగా పర్యవేక్షించడానికి డిప్యూటీ కమిషునర్లు, మెడికల్ ఆఫీసర్లు ఉదయం 7 గంటలలోపు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ఈ సందర్భంగా గార్బెజ్ పాయింట్లను తొలగించే ప్రక్రియను ఫోటోల ద్వారా నివేదికను సమర్పించాలన్నారు. హరితహారం లక్ష సాధనకు కావాల్సిన మొక్కలను ప్రైవేట్ నర్సరీల నుంచి సేకరించడానికి టెండర్ ప్రక్రియలో మార్పు తేవాలని సూచించారు.

ప్రధాన రహదారులకు ఇరువైపులా, ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి ప్రస్తుతం 78 వాహనాలను వినియోగిస్తున్నామన్నారు. గ్రేటర్ హైరాబాద్ స్వచ్చ కార్యక్రామాలను మరింత సమర్దవంతంగా నిర్వహించడానికి ప్రారంభించిన సాఫ్ హైదరాబాద్, షాన్ హైదరాబాద్ ’ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండు నెలలు పూర్తయ్యిందని దీని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.ఈ కార్యక్ర నిర్వహణ, సాధించిన ఫలితాలను రానున్న కాలంలో చేపట్టే చర్యలపై స్థానిక శాసన సభ్యులు, కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులకు వివరిస్తూ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సాఫ్ హైదరాబాద్, షాన్ హైదరబాద్, తొలివిడత నిర్వహణకు సుమారు రూ. 3 కోట్లు వెచ్చిస్తున్నామని, దీనిపై అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. న్యాయ స్థానాల్లో జిహెచ్‌ఎంసిపై ఉన్న కేసులను ప్రతి వారం పర్యవేక్షించాలని, జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి కాట, అద్వైత్ కుమార్ సింగ్, కెనడీ, కృష్ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్లు, సురేష్, శ్రీధర్, జియుఉద్దిన్, సిసిపిలు దేవేందర్ రెడ్డి శ్రీనివాసరాలు తదితరులు పాల్గొన్నారు.

Street vendors should have Dustbins

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రతి వీధి వ్యాపారి విధిగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకోవాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: