శాండ్‌విచ్ అదిరిందోచ్…!

  చికెన్ శాండ్‌విచ్ కావాల్సినవి : బ్రెడ్ ప్లైసెస్ ఎనిమిది, బోన్‌లెస్ చికెన్ పావుకిలో, టొమాటో కెచప్ రెండు టేబుల్ స్పూన్లు, వెనిగర్ ఒక టేబుల్ స్పూను, తేనె రెండు టేబుల్ స్పూన్లు, చిల్లీసాస్ టీస్పూను, వెల్లుల్లి ముక్కలు టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను, క్యాప్సికమ్ రెండు, క్యాబేజీ (చిన్నది) ఒకటి, వెన్న టేబుల్ స్పూను, ఉల్లిముక్కలు టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము టేబుల్ స్పూను, సోయాసాస్ టీస్పూను. తయారీ విధానం: […] The post శాండ్‌విచ్ అదిరిందోచ్…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చికెన్ శాండ్‌విచ్
కావాల్సినవి : బ్రెడ్ ప్లైసెస్ ఎనిమిది, బోన్‌లెస్ చికెన్ పావుకిలో, టొమాటో కెచప్ రెండు టేబుల్ స్పూన్లు, వెనిగర్ ఒక టేబుల్ స్పూను, తేనె రెండు టేబుల్ స్పూన్లు, చిల్లీసాస్ టీస్పూను, వెల్లుల్లి ముక్కలు టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను, క్యాప్సికమ్ రెండు, క్యాబేజీ (చిన్నది) ఒకటి, వెన్న టేబుల్ స్పూను, ఉల్లిముక్కలు టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము టేబుల్ స్పూను, సోయాసాస్ టీస్పూను.

తయారీ విధానం: చికెన్ ముక్కల్లో కెచప్, వెనిగర్, తేనె, చిల్లీసాస్, వెల్లుల్లి ముక్కలు.. అన్నీ కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే క్యాప్సికమ్‌లను గ్రిల్ చేసి నల్లబడిన తొక్క తీసేయాలి. నానబెట్టిన చికెన్‌ను మెత్తగా ఉడకబెట్టాలి. చల్లారాక ఉడికించిన చికెన్ ముక్కల్ని మరింత సన్నగా కోయాలి.
1. బాణలీలో వెన్న, నూనె వేసి ఉల్లి ముక్కలు వేసి వేగాక తీసి చికెన్ విశ్రమంలో కలపాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కల్నీ, క్యాబేజీ తురుమునూ కూడా కలిపి ఈ మొత్తం విశ్రమాన్ని బ్రెడ్ ముక్కల మీద సర్ది, దానిపైన మరో బ్రెడ్ ముక్క పెట్టి అందిస్తే సరి.

 

వెజ్ శాండ్‌విచ్
కావాలినవి : బ్రెడ్ స్లైసెస్ ఆరు, బంగాళాదుంప ఒకటి, టొమాటో ఒకటి, ఉల్లిపాయ ఒకటి, క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా, కీరదోస ఒకటి, చాట్ మసాలా అర టీస్పూను, జీలకర్రపొడి అర టీస్పూను, వెన్న తగినంత.
గ్రీన్ చట్నీ కోసం : కొత్తిమీర తురుము కప్పు, పుదీనా తురుము అరకప్పు, వేయించిన మినప్పప్పు టేబుల్‌స్పూను, జీలకర్ర అర టీస్పూను, పచ్చిమిర్చి మూడు, వెల్లుల్లి రెబ్బలు రెండు, అల్లం తురుము అర టీస్పూను, నిమ్మరసం తగినంత.

తయారీ విధానం : బంగాళాదుంపలు, బీట్‌రూట్ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఉడికించి తీయాలి.
1. ఉల్లి, కీరదోస, టొమాటో ముక్కల్ని సన్నగా తరిగి ఉడికించిన బంగాళాదుంప ముక్కలతో కలపాలి.
2. గ్రీన్ చట్నీ కోసం తీసుకున్నవన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
3. బ్రెడ్ స్లైసెస్ మీద వెన్న రాయాలి. ఆ పైన గ్రీన్ చట్నీ కూడా రాసి, దాని మీద కూరగాయల ముక్కల మిశ్రమాన్ని సమంగా సర్దాలి. ఆ పైన చాట్‌మసాలా చల్లి మరో స్లైస్‌తో మూసేసి త్రికోణాకారంలో కోసి అందించాలి. బ్రెడ్ స్లైసుల్ని కాస్త వెన్నతో రెండు వైపులా పెనంమీద కాల్చి ఇచ్చినా బాగుంటుంది.

 

ఎగ్ శాండ్‌విచ్

కావాల్సినవి : బ్రెడ్ స్లైసెస్ ఎనిమిది, గుడ్లు నాలుగు, ఉల్లిపాయలు రెండు, టొమాటోలు రెండు, పచ్చిమిర్చి నాలుగు, క్యారెట్ ఒకటి, నూనె మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర అర టీస్పూను, అల్లం తురుము అర టీస్పూను, పసుపు పావు టీస్పూను, మిరియాల పొడి పావు టీస్పూను, ఉప్పు రుచికి సరిపడ.
తయారీ విధానం : బాణలిలో నూనె వేసి జీలకర్ర, అల్లం, పసుపు అన్నీ వేసి ఓ నిమిషం వేయించాలి. ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, టొమాటో కూడా వేసి మగ్గనివాలి. గుడ్లసొన, ఉప్పు వేసి తిప్పుతూ వేగనివ్వాలి. ఇప్పుడు దీని మీద క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేసి కలపాలి. విశ్రమాన్ని బ్రెడ్ ముక్కల మధ్య పెట్టి పైన వెన్న రాసి పెనం మీద కానీ, టోస్టర్‌లో కానీ పెట్టి కాల్చి తీయాలి.

 

బఠాణీ ఆలూ శాండ్‌విచ్

కావాల్సినవి : బ్రెడ్ స్లైసెస్ ఆరు, ఉడికించిన బఠాణీలు 100 గ్రా., ఆలూ 3, పచ్చిమిర్చి రెండు, కూర కారం పావు టీస్పూను, ఆలివ్ నూనె లేదా నెయ్యి 2 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, వెన్న తగినంత.

తయారీ విధానం : 1.బఠాణీలను ఉడికించి పక్కన ఉంచాలి.
2. నాన్‌స్టిక్ పాన్‌లో ఆలివ్ నూనె లేదా నెయ్యి వేసి కాగాక, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిమిన బంగాళాదుంపలు వేసి వేయించాలి. కొత్తిమీర తురుము, కూర కారం, ఉడికించిన బఠాణీలు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. బంగాళాదుంపల తురుము, బఠాణీలని మెత్తగా మెదిపినట్లుగా చేసి, రెండు మూడు నిమిషాలు వేయించి తీయాలి. బ్రెడ్ స్లైసెస్‌ల మీద వెన్న రాసి, ఆ పైన కూరను సమానంగా సర్ది, దానిమీద మరో బ్రెడ్ స్లైస్‌ను ఉంచి అందిస్తే సరిపోతుంది.

 

పెరుగు శాండ్‌విచ్
కావాల్సినవి : బ్రెడ్ స్లైసెస్ ఆరు , నీళ్లు లేకుండా బట్టలో వేలాడదీసిన గట్టి పెరుగు అరకప్పు, కీరదోస రెండు, వెల్లుల్లిముద్ద పావుటీ స్పూను, ఉప్పు చిటికెడు, ఉల్లితురుము 2 టీస్పూన్లు, మిరియాల పొడి పావుటీస్పూను, వెన్న 2 టీ స్పూన్లు, మిరియాల పొడి పావు టీస్పూను.
తయారీ విధానం : కీరదోస తొక్కు తీసి, ఓ సారి కడిగి, పొడిబట్టతో తుడిచి, సన్నగా తురమాలి. ఇందులోనే వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పెరుగు, మిరియాల పొడి, ఉప్పు అన్నీ వేసి కలపాలి. ఇష్టమైతే క్యారెట్, బీట్‌రూట్, కాబేజీ కూడా సన్నగా తరిగి ఇందులో కలుపుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టి గట్టిగా నొక్కాలి. తరువాత శాండ్‌విచ్‌కి రెండువైపులా వెన్న రాసి పెనం మీద ఓ నిమిషం రెండు వైపులా కాల్చి తీయాలి.

Sandwich different recipes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శాండ్‌విచ్ అదిరిందోచ్…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: