పక్కాగా గ్రామ సభలు…

  అమల్లోకి కొత్త పంచాయతీరాజ్ చట్టం నిర్ధేశించుకున్న సమయానికి సభలు ఏడాదికి ఆరుసార్లు తప్పనిసరి ఆలస్యమైతే సర్పంచ్‌లపైవేటు ప్రతిఒక్కరు హాజరు కావచ్చు షాబాద్ : గ్రామాలను అభివృద్ధిబాటలో నడిపించాలనే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేసింది. గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలనే ఎజెండాతో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని పూర్తి స్ధాయిలో అమలు పరిచే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై పెట్టడంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలు పక్కాగా […] The post పక్కాగా గ్రామ సభలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమల్లోకి కొత్త పంచాయతీరాజ్ చట్టం
నిర్ధేశించుకున్న సమయానికి సభలు
ఏడాదికి ఆరుసార్లు తప్పనిసరి
ఆలస్యమైతే సర్పంచ్‌లపైవేటు
ప్రతిఒక్కరు హాజరు కావచ్చు

షాబాద్ : గ్రామాలను అభివృద్ధిబాటలో నడిపించాలనే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేసింది. గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలనే ఎజెండాతో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని పూర్తి స్ధాయిలో అమలు పరిచే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై పెట్టడంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలు పక్కాగా జరగనున్నాయి. మొక్కుబడిగా జరిగే గ్రామ సభలకు నూతన పంచాయతీరాజ్ చట్టం చెక్ పెట్టనుంది.

మొక్కుబడి సభలకు చెక్
మండలంలో 41 గ్రామ పంచాయతీలుండగా 43 వేల జనాభా ఉంది. ఇటీవల్ల నూతన పంచాయతీరాజ్ చట్టంపై పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల అవగాహన కల్పించారు. గతంలో పంచాయతీ గ్రామ సభలు మొక్కుబడిగా నిర్వహించినా కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పక్కాగా సభలు జరపాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్ధేశిత గడువు ప్రకారం సభలు నిర్వహించకపోతే సర్పంచ్ పదవీకి అనర్హులుగా ప్రకట్టించాలని చట్టంలో పేర్కొన్నారు.

గతంలో ఏడాదికి నాలుగుసార్లు
పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 73వ రాజ్యాంగా సవరణలో పంచాయతీలకు సంబంధించి 29 అంశాలను చేర్చారు. వివిధ సంక్షేమ పథకాల నిధులు, విధులు పారదర్శకంగా నిర్వహించేలా గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తూ అభివృద్ధి పర్చేలా పంచాయతీ సమావేశాలు పక్కాగా నిర్వహించాల్సి ఉంది.

రెండు నెలలకోసారి గ్రామ సభ
కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రెండు నెలలకోసారి గ్రామ సభ తప్పనిసరిగా నిర్వహించాలి. పంచాయతీ పాలకవర్గ సమావేశాలు సైతం నెలనెలా నిర్వహించాలి. ఇది వరకు గ్రామ సభలను మమా అనిపిస్తూ ముగించేవారు ఇకపై గ్రామ సభలకు జనాభాను బట్టి ప్రజలు హాజరు ఉంటేనే నిర్వహించాల్సి ఉంటుంది.

చట్టం ఏం చెబుతుందటే
గ్రామ సభకు ఆ పంచాయతీ పరిధిలోని ఓటర్లంతా హాజరుకావచ్చు. గ్రామ పంచాయతీలో 500 ఓటర్లుంటే 50 మంది, వేయ్యిమంది ఉంటే 75మంది, 3వేల మందికి 150, ఐదువేలమందికి 200, 10వేలమందికి 300, అంతకు మించి ఓటర్లుంటే 400మంది గ్రామసభకు హాజరుకావాల్సి ఉంటుంది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ఏడాదికి ఆరు సార్లు గ్రామ సభలు నిర్వహించాలని సభను నిర్వహించే తేదీ సమయం ముందుగా గ్రామంలో ప్రచారం చేయించాలి. ఒక వేళ నిర్ణయించిన తేదీన గ్రామ సభ నిర్వహించలేకపోతే పది రోజులలోపు నిర్వహించాలి. సర్పంచ్ లేకుంటే ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో కొనసాగించాలని కొత్త చట్టం చెబుతుంది.

Gram Sabhas under the new Panchayati Raj Act

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పక్కాగా గ్రామ సభలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: