మైనింగ్ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక నిధులు…

  మైనింగ్ భూములను సర్వే చేసి గనుల తవ్వకాలకు అనుమతులు పొందాలి పర్యావరణానికి ముప్పు లేకుండా చూడాలి అనుమతులు లేని ప్రదేశాలలో క్రషర్లను ఉపయోగిస్తే చర్యలు మంత్రి మల్లారెడ్డి రంగారెడ్డి : మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధ్దికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర కార్మిక ఉపాధి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం టిఎస్‌ఐఆర్‌డిలో జిల్లా మినరల్ ఫౌండేషన్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన […] The post మైనింగ్ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక నిధులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మైనింగ్ భూములను సర్వే చేసి గనుల తవ్వకాలకు అనుమతులు పొందాలి
పర్యావరణానికి ముప్పు లేకుండా చూడాలి
అనుమతులు లేని ప్రదేశాలలో క్రషర్లను ఉపయోగిస్తే చర్యలు
మంత్రి మల్లారెడ్డి

రంగారెడ్డి : మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధ్దికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర కార్మిక ఉపాధి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం టిఎస్‌ఐఆర్‌డిలో జిల్లా మినరల్ ఫౌండేషన్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన భూములను ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ గనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలన్నారు. గనుల తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నపుడు చుట్టు పక్కల ప్రాంతాలలో ఎటువంటి ఆటంకాలు, పర్యావరణానికి ఎలాంటి హనీ కలగకుండా పరిశీలించి అనుమతులు మంజూరు చే యాలని అధికారులు దీనిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

మైనింగ్ ప్రభావిత ప్రాంతాలలో పలు అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గత 9 నెలలుగా ఎన్నికలు ఉన్నందున అభివృద్ధి మీద దృష్టి సారించలేదు. కావున ఇప్పటి నుంచి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు సంపూర్ణ జీవన భద్రత విషయంలో జీవన భరోసా కల్పించడమే లక్షంగా ప్రభుత్వం జిల్లా ఖనిజ సంస్థను ఏర్పాటు చేసి వివిధ అభివృద్ధ్ది కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ నిధిలో జమ అయిన వాటిలో ప్రత్యక్ష ప్రభావిత ప్రాంతాలకు 70 శాతం, పరోక్ష ప్రభావిత ప్రాంతాలకు 30 % నిధులు కేటాయిస్తామన్నారు. జిల్లాలో 27 కోట్ల రూపాయాలు జమ ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్‌కు అనుమతులిచ్చిన భూములన్నీ ఆన్‌లైన్ చేయాలన్నారు.

ఇష్టారాజ్యంగా మైనింగ్…
మైనింగ్ పనులు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. మైనింగ్ పనుల తవ్వకాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అనుమతులు ఇచ్చి న భూముల్లో కాకుండా ఇతర భూములలో తవ్వకాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్ర భుత్వం కేటాయించిన భూముల్లోనే మైనింగ్ తవ్వకాలను జరపాలన్నారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా క్రషర్లను వాడుతున్నారని, అనుమతులు లేని స్థలాల్లో మైనింగ్ జరిపితే అనుమతులను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

సొంత స్థలంలో డబుల్ బెడ్ రూం..
స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టుకునేందు కు డబ్బులు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కోరారు. మిషన్ భగీరథపనులలో పెండింగ్‌లో ఉన్న పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలన్నారు.

జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరా, వైద్య ఆరోగ్య సంరక్షణ, విద్య, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధ్దులు, వికలాంగుల సంక్షేమం, నైపుణ్యం మెరుగుపరచడం ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పన, స్వయం సహయక సంఘాలు, పారిశుద్ధం, పర్యావరణ కాలుష్య నివారణ నియంత్రణ చర్యలకు 60 శాతం నిధులు కేటాయించడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనుమతులు లేని ప్రదేశాలలో క్రషర్‌లను ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. క్రషర్ల వాడకాలతో పర్యావరణాన్ని కాపాడేందుకు నూతన టెక్నాలజీ తీసుకువస్తామన్నారు. నూతన విద్యుత సబ్ సెంటర్ కొరకు వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని వాటికి స్థలం కేటాయిస్తామన్నారు.

మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లాలో 1069 అవాసాలలో పనులు చేపట్టామని ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు 90 శాతం పనులు పూర్తి అయ్యాయన్నా రు. జిల్లాలో 6777 డబుల్ బెడ్ రూం ఇండ్లు మం జూరు అయ్యాయని 2567 ఇండ్లకు టెండర్‌లు ఫైనల్ కాగా 1077 ఇండ్ల పనులు ప్రారంబమై పురోగతిలో ఉన్నాయన్నారు. సమావేశ అనంతరం తెలంగాణకు హరితహారం బంగారు భవితకు సోపానం పుస్తకం అవిష్కరించారు. జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, జాయింట్ కలెక్టర్ హరీష్, జడ్పీ సిఇఓ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Special Funds for Mining Affected Areas

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మైనింగ్ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక నిధులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: