ఎస్‌ఐపై దాడికి యత్నం.. మానసిక వైద్యశాలకు తరలింపు

  మన తెలంగాణ / అమీర్‌పేట: డ్యూటీలో ఉన్న ఆ ఎస్‌ఐపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ యాదవ్ (22) ఎంటెక్ పూర్తిచేసి ఉద్యోగ నిమిత్తం మూడు నెలల క్రితం నగరానికి వచ్చి ఎల్లారెడ్డి గూడలోని వెంగమాంబ హాస్టల్‌లో పేయింగ్ గెస్టుగా ఉంటున్నాడు. అయితే మూడు నెలలుగా మెస్ చార్జీలు చెల్లించక పోవడంతో హాస్టల్ నిర్వాహకుడు వెంకట్ రెడ్డి గణేష్ యాదవ్ పై ఒత్తిడి […] The post ఎస్‌ఐపై దాడికి యత్నం.. మానసిక వైద్యశాలకు తరలింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ / అమీర్‌పేట: డ్యూటీలో ఉన్న ఆ ఎస్‌ఐపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ యాదవ్ (22) ఎంటెక్ పూర్తిచేసి ఉద్యోగ నిమిత్తం మూడు నెలల క్రితం నగరానికి వచ్చి ఎల్లారెడ్డి గూడలోని వెంగమాంబ హాస్టల్‌లో పేయింగ్ గెస్టుగా ఉంటున్నాడు. అయితే మూడు నెలలుగా మెస్ చార్జీలు చెల్లించక పోవడంతో హాస్టల్ నిర్వాహకుడు వెంకట్ రెడ్డి గణేష్ యాదవ్ పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. వెంటనే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై పిటీ కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కావాలనే తనకు అన్యాయం చేస్తున్నారని నగర సీపీకి గణేష్ యాదవ్ ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేపట్టిన ఎస్‌ఐ నరేష్ పూర్తి నివేదికను తయారు చేశారు. విచారణ సందర్భంగా గణేష్ యాదవ్ మిత్రుడు నవీన్, మరికొంత మందిని విచారించగా ప్రతీ రోజు ఏదో విషయంపై నిర్వాహకుడితో గొడవకు దిగడం జరుగుతుందని తెలిపారు.

ఎస్‌ఐపై కోపం పెంచుకున్న గణేష్ యా దవ్ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పావని గొడవకు దిగాడు ఇందుకు ఎస్‌ఐ కలుగజేసుకుని నీ ప్రవర్తన సరిగా లేని కారణంగానే ప్రతి వారితో గొడవలు పెట్టుకుంటున్నావని సీఐ ముందు మాట్లాడిస్తానని తీసుకెళ్తుండగా కోపంతో ఊగిపోయిన గణేష్ యాదవ్ ఎస్‌ఐని నెట్టివేశాడు.. దీంతో పోలీసులు గణేష్‌ని అదుపులోనికి తీసుకొని ఎస్‌ఐ నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నాంపల్లిలోని 3వ అదనపు మెట్రో పాలిటన్ న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. గణేష్ మానసిక పరిస్థితిని గమనించిన న్యామూర్తి రిమాండ్‌కు తరలించకుండా వెంటనే మానసిక ఆసుపత్రిలో చేర్పించి గణేష్‌కు వైద్యం అందించాలని పోలీసులను ఆదేశించారు. న్యామూర్తి ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం గణేష్ యాదవ్‌ను ఎర్రగడ్డలోని మానసిక ఆసుపత్రిలో చేర్పించారు.

 

M Tech Student Attack on Sub Inspector in Meerpet

 

The post ఎస్‌ఐపై దాడికి యత్నం.. మానసిక వైద్యశాలకు తరలింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: