ఫీ ‘జులుం’తో మాయమవుతున్న విద్య…?

  ప్రచార ఆర్భాటంలో విద్యాసంస్థల మోసం ప్రైవేట్ మాయలో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు డిస్కౌంట్‌తో గాలం ..? అడ్మిషన్ కాగానే మోయలేని భారం బ్యాగ్ , యూనిఫాం, టై, షూ లతో బాదుడే ఇబ్రహీంపట్నం : విద్యాసంస్థలు ప్రచార ఆర్బాటాలతో హోరెత్తుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించే లక్షంతో ప్రణాళికలతో ప్రచారాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. కరపత్రాల, హోర్డింగ్‌ల ద్వారా మైక్‌ల ద్వారా విధ్యార్థుల తల్లి దండ్రుల ద్వారా ఆకర్షితులైతున్నారు. కొన్ని విద్యా సంస్థలు యాజమానులై సామాన్య కోణాన్ని సైతం ఉపయోగించుకొని […] The post ఫీ ‘జులుం’తో మాయమవుతున్న విద్య…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రచార ఆర్భాటంలో విద్యాసంస్థల మోసం
ప్రైవేట్ మాయలో విద్యార్థుల తల్లిదండ్రులు
ఫీజు డిస్కౌంట్‌తో గాలం ..?
అడ్మిషన్ కాగానే మోయలేని భారం
బ్యాగ్ , యూనిఫాం, టై, షూ లతో బాదుడే

ఇబ్రహీంపట్నం : విద్యాసంస్థలు ప్రచార ఆర్బాటాలతో హోరెత్తుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించే లక్షంతో ప్రణాళికలతో ప్రచారాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. కరపత్రాల, హోర్డింగ్‌ల ద్వారా మైక్‌ల ద్వారా విధ్యార్థుల తల్లి దండ్రుల ద్వారా ఆకర్షితులైతున్నారు. కొన్ని విద్యా సంస్థలు యాజమానులై సామాన్య కోణాన్ని సైతం ఉపయోగించుకొని విద్యార్థులను తమ వైపు తిప్పుకొంటున్నారు. ముందస్తుగానే ఫీజులతో సంబంధంలేదు. ముందు మీ పిల్లవాన్ని మా పాఠశాలలో, కాలేజిలో చేర్పించండి. అని మేమేచూసుకుంటామంటూ, నమ్మబలుకుతూ అడ్మిషన్లను జోరుగా కొనసాగించే పనిలో విద్యాసంస్థలు పనిచేస్తు తలమునకలై ఉన్నారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం , అబ్ధ్దుల్లాపూర్ మెట్ మండలాలలో విద్యార్థుల చదువుల పేరుతో విద్యా సంస్థలు మొక్కుపిండి చేస్తున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు ముక్త కంఠంతో అరిచిన పలితంలేక పోవడంతోవిద్యా సంస్థల నేతలు మాత్రం విద్యాధికారులతో లోపయికారిగా కాసులకు కక్కర్తి పడి చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపనలు వినిపిస్తున్నా యి. ముఖ్యంగా ప్రవేటు విద్యా సంస్థల యజమానులు రియల్ ఏస్టేట్ సిండికేట్‌గా మాదిరి ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు సిండికేట్‌గా మారి తమ వ్యాపారాన్ని మూడు పూవ్వులు ఆరుకాయలగా కొనసాగిస్తూ తమ దందా నడుపుకుంటున్నారు.

దీంతో ప్రవేటు వి ద్యాసంస్థల యజమానులు ప్రైవే టు పాఠశాలలో టై, బెల్టు పేరుతో దందా, స్కూల్ డ్రెస్ కోడింగ్‌తో మ రో దందా, పుస్తకాలపై ఆ పాఠశాల లోగోతోఉన్న నోట్ పుస్తకాలనే కొనాలి. ఇతర షాపుల వద్ద దొరకవు . కొంటె అదె పాఠశాలలో కొనాలి నగదురూపం లో విద్యార్థుల తల్లి దండ్రుల వద్ద అందినాకాడికి పిండి చేసి ఫీజుల పేరుతో పీండిస్తున్నారనే ఆరోపనలు మిన్నంటా యి. ఇక మేము పిల్లల చదువులను కొనలేము. ఏం చేస్తే ఫీజులు తగ్గుతాయని తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యుల బాధల నుంచి అప్పులు పాలైతున్నారు. అధికారులు నుండి నియంత్రనేది : ప్రతి మండల కేం ద్రంలో ప్రైవేటు విద్యాసంస్థల నుండి ఇదే మాట వినిపిస్తుంది. అయిన ప్రభుత్వ అధికారుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ ప్రారంభ కొత్తలో అధికారులు ప్రవేటు యజమానుల తీరుపై మొదట్లో అధికారులు తీ వ్రంగా ఉన్నప్పటికి ఆ తరువాత రానురాను వారికి వెలుసు లు బాటు కల్పిస్తూ, తూతూ మంత్రంగా వదిలేస్తున్నారు. ఇదేక్కడి అన్యామని నిలదీస్తే అంతెనమ్మ అని మౌనంగా ఉంటున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫలితం లేదు. ఏమంటే ప్రభుత్వం వారిపై కఠిన వైఖరి తీసుకోకపోవడంతో ప్రైవేటు యజమానులు సైతం పట్టించుకోవడంతో యథావిధిగా స్కూల్ నడుపుతున్నారు.

Parents of students in private delusion

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఫీ ‘జులుం’తో మాయమవుతున్న విద్య…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: