కొత్త జంటలకు.. కొద్ది ఎడబాటు…

  నేటి నుండి ఆషాఢమాసం,  ఆఫర్స్‌తో సేల్స్‌కు రంగం సిద్ధం ఖమ్మం : ఈ ఏడాది కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఒకింత ఎడబాటు భరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నో ఆశలతో కలసిమెలసి భవిష్యత్‌పై ఎన్నో ఊహలను పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్న జంటలు ఒక నెలరోజుల పాటు విడివిడిగా శాస్త్రప్రకారంగా ఉండాల్సిన సయం రానే వచ్చింది. అదే ఆషాఢమాసం. ఆ షాఢమాసంలో కొత్తగా ప్ళైన వారు ఒక నెల రోజుల పాటు ఎవరి పుట్టింట్లో వారు ఒకరొకరు […] The post కొత్త జంటలకు.. కొద్ది ఎడబాటు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేటి నుండి ఆషాఢమాసం,  ఆఫర్స్‌తో సేల్స్‌కు రంగం సిద్ధం

ఖమ్మం : ఈ ఏడాది కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఒకింత ఎడబాటు భరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నో ఆశలతో కలసిమెలసి భవిష్యత్‌పై ఎన్నో ఊహలను పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్న జంటలు ఒక నెలరోజుల పాటు విడివిడిగా శాస్త్రప్రకారంగా ఉండాల్సిన సయం రానే వచ్చింది. అదే ఆషాఢమాసం. ఆ షాఢమాసంలో కొత్తగా ప్ళైన వారు ఒక నెల రోజుల పాటు ఎవరి పుట్టింట్లో వారు ఒకరొకరు దూరంగా ఉండాలనేది పెద్దలు చెప్పిన శాస్త్ర నియమం.

వారి మధ్య ప్రేమను మరింత పె ంచటానికి, ప్రకృతి పరంగా వచ్చే సమస్యలను తట్టుకుని నిలబడటానికి పైళ్లైన ప్రతి జంటకూ ఆషాడమాసంలో ఈ భరించలేని ఎడబాటును పెద్దలు తప్పనిసరి చేసారు. గత ఏడాది నవంబర్ నుండి ఈ ఏడాది మే నెల వరకు పెళ్లిళ్లు చేసుకున్న కొత్త జంటలన్నీ ఈ కేటగిరిలోకి రానున్నాయి. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న నూ తన వధూవరులు ఇప్పటికే ఒకరంటే మరొక రికి చెప్పలేని ప్రేమ తో గుండె నిండా నిండి ఉంటారు కాబట్టి కొత్త జంటలు ఈ కొద్ది ఎడబాటును సహించరు. కొంతమంది అంగీకరించరు కూడా. ఎందుకంటే ఒకర్ని విడిచి మరొకరు దూరంగా క్షణమైన ఉండలేనంత బంధం వారి మధ్య వివాహ రూపంలో ఏర్పడుతుంది. మూడుముళ్లతో ఇన్నాళ్లు చేసిన సంసారబం ధం వారిని విడిగా ఉంచలేనంత బలంగా కట్టిపడేసింది. శాస్త్రప్రకారం వారు విడిగా ఉండాల్సిన అవసరం లేదని కూడా కొందరు అం టుంటారు.

అయితే అత్తా-కోడలు, మామ-అల్లు డు ఒక గడపలో ఉండరాదని, ఒకరికొకరు ఎదురుపడకూడదని కూడా అంటారు. పూర్వంలాగ అత్తామామలు, వారి పిల్లలు కలసిమెలసి ఒకే చోట ఉంటున్నవారు ఈ రోజుల్లో అక్కడక్కడా అలాగే ఉంటున్నారు. అలా ఉంటున్న వారిలో కొత్తజంట మాత్రమే ఆషాడమాసంలో ఎవరింటికి వెళుతున్నారు. నూతన వధువు తన వివాహానంతరం ఒక నెలరోజులు భర్తను, మెట్టినింటిని విడిచి ఉండాలంటే కష్టంగానే ఉంటుంది. దీనిలో కూడా మర్మం చాలా ఉందని పెద్దలు చెప్తుంటారు. తొలకరి పడి పాత నీరు వెళ్లి దాని స్తానంలో కొత్తనీరు వస్తుంది కాబట్టి వాతావరణ పరంగా ఆ ఇబ్బందిని శరీరకధర్మం ప్రకారం ఇద్దరు తట్టుకుని నిలబడాలనే ఉద్దేశ్యంతో కొత్త జంటకు ఈ కొద్ది ఎడబాటు పెట్టారన్నది అనుభవజ్ఞులు చెప్తున్నారు.

భర్తకు దగ్గరగా ఉన్నపుడు కంటే కొద్ది కాలం దూరంగా ఉండాల్సి వచ్చినపుడు కలిగే ప్రేమ చాలా గొప్పదని చెప్తుంటారు. అందుకే ఒక సినీ కవి ’కలువకు చంద్రుడు ఎంతో దూరం..సూర్యుడు కమలానికి మరీ దూరం..దూరమైన కొలదీ పెరుగును అనురాగం ..’ అన్నాడు. ఆయా జంటల మధ్య ప్రేమానుబంధ ం మరింత బలపడుతుందంటారు. ఆషాడమాసం నూతన వధూవరులను దూరం చేసిందని అనుకోరాదు. వారి మద్య ప్రేమను పెంచేదిగా భావించాలి. ఈ నెల రోజుల విరహవేదనను ఎవరింట్లో వారికి తప్పదు. ఇపుడు కొత్తజంట పెళ్లి కాగానే ఉద్యోగం చేసే ప్రదేశానికి వెళ్లి కొత్త కాపురం పెడుతున్నారు కాబట్టి వారికి ఈ నెల రోజుల ఎడబాటు అవసరంలేదని కూడా అంటున్నారు.

ఎవరికి వారు తమ అత్తగారు, మామగారు ఎదురుపడే అవకాశం లేనందున వారు ఆషాడమాసంలో దూరంగా ఉండాల్సిన అవసరం లేదని అనటమేకాదు ఆ విధంగా కూడా చేస్తున్నారు కూడా. నెల రోజుల తరువాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి మంగళప్రదంగా ఆశీస్సులు ఇచ్చి తమ ఇంటికి తిరిగి తీసుకవస్తారు. దీనిని శ్రావణపట్టె పెట్టటం అంటారు. దాంతో ఆషాడమాసం తెచ్చిన కొద్ది ఎడబాటుకు తెరపడుతుంది. ఈ నెల అంటే జూన్ 31తో ఆషాడమాసం ముగుస్తుంది. ఇదిలా ఉ ంటే ఆషాడమాసం అంటే బంగారు , వస్త్రాల విక్రయాలు బాగా తగ్గుముఖం పడతాయని అంటారు. శుభకరమైన మాసం కాదు కాబట్టి బంగారం, వస్త్రాలను కొనటానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరని అంటారు.

పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు ఈ మాసంలో అసలే చేయరు కాబట్టి బంగారు, వస్త్రదుకాణాల వారు ఈ ఆషాడమాసంలో కూడా సేల్స్ పెంచుకోవటం కోసం ఆఫర్స్, డిసౌంట్స్‌లను వెల్లువలా ప్రకటించటం ప్రతి ఏడాది చూస్తున్నదే. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపేమీ లేదు. ఇప్పటికే ఖమ్మంలోని కొన్ని వస్త్రదుకాణాలు ఆషాడం సేల్స్‌ను ప్రకటించాయి. వీటి ధరలు పడిపోతాయని ఆశించి కొనుగోలుదారులు రావటంతో సేల్స్ పెరుగుతాయని వ్యాపారవర్గాల విశ్వాసం. బంగారం ధర ఆషాడమాసంలో తగ్గుతుందంటారు. బంగారం ధర తగ్గేసరికి ఆటోమేటిక్‌గా వస్త్రాల ధరలు కూడా తగ్గుతాయని వినియోగదారులు భావించి ఆ మేరకు కొనుగోళ్లు సాగిస్తుంటారు. ఆషాడ మాసం అంటే మగువలకు చాలా ఇష్టమైన మాసం.

ఎందుకంటే గోరింటాకు పుష్కలంగా పండుతుంది. వర్షాకాలం ప్రారంభమై పచ్చని చెట్లన్నీ ఆకుపచ్చ రంగు పరుచుకోవటంతో గోరింటాకు కూడా ఎక్కడపడితే అక్కడ లభ్యమౌతుంది. ఈ ఆషాడమాసంలో గోరింటాకు పెట్టని తెలుగింటి ఆడకూతురు ఉండదంటే అతిశయోక్తికాదు. గోరింటాకు స్వయం చేతికి పెట్టుకుని ఎర్రగా పండితే చూసి మురిపెంగా మురిసిపోతారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత శుభప్రదంగా భావిస్తారు. తొలకరి పడి భూమి పులకరించే సమయం కాబట్టి ప్రతి ఇంటా గోరింటాకు విరగకాస్తుంది. అయితే చాలా మంది సహజంగా దొరికే గోరింటాకునే వాడుతుంటారు.

కృత్రిమంగా ఉండేది వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు. ఆడపిల్లలు, యువతులు, మహిళలు చేతులకు, పాదాలకు గోరింటాకు వివిధ డిజైన్లతో పెట్టుకుని ఆనందిస్తుంటారు. ఖమ్మం నగరంలోని కొన్ని సంస్థలు మహిళలకు గోరింటాకు పోటీలు పెట్టి ఆ కళను ప్రోత్సహిస్తున్నారు. ఆషాడమాసంలో ఏ శుభకార్యం చేయరాదంటారు. రానున్న రోజుల్లో శుభకార్యాలు తలపెట్టేవారు ఈ నెల రోజులు మదిలోనే ప్రణాళికలు వేసుకుంటూ శ్రావణమాసం కోసం ఎదురుచూస్తుంటారు.

New couples distance with Ashada Masam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొత్త జంటలకు.. కొద్ది ఎడబాటు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: