స్త్రీ సమస్యలపై గళమెత్తిన కలం

  ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గొప్ప మానవతామూర్తి అబ్బూరి ఛాయాదేవి జూన్ 28న పరమపదించారు. పురుషాధిక్యంపై కలమెత్తిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాష సంఘం మాజీ అధ్యక్షుడైనా అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి సతీమణి. ఛాయాదేవి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో వెంకటాచలం, వెంకట రమణమ్మ దంపతులకు 1933 అక్టోబర్ 13న జన్మించారు. 1953లో నిజాం కళాశాల నుండి వెలువడిన ప్రత్యేక సంచికలో ’అనుభూతి’ […] The post స్త్రీ సమస్యలపై గళమెత్తిన కలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గొప్ప మానవతామూర్తి అబ్బూరి ఛాయాదేవి జూన్ 28న పరమపదించారు. పురుషాధిక్యంపై కలమెత్తిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాష సంఘం మాజీ అధ్యక్షుడైనా అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి సతీమణి. ఛాయాదేవి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో వెంకటాచలం, వెంకట రమణమ్మ దంపతులకు 1933 అక్టోబర్ 13న జన్మించారు. 1953లో నిజాం కళాశాల నుండి వెలువడిన ప్రత్యేక సంచికలో ’అనుభూతి’ కథతో ఛాయాదేవి కథ ప్రస్థానం మొదలైంది. స్త్రీల జీవితాల్లోని వివిధ దృక్కోణాలను దృష్టిలో ఉంచుకొని ఆమె రచనలు ఎక్కువగా కొనసాగేవి. మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ కథలను రాస్తూ ప్రముఖ స్త్రీవాద రచయితగా గుర్తింపు పొందారు. ఆమె రాసిన రచనలలో బోన్సాయ్ బతుకులు పేరిట వచ్చిన కథాసంపుటి ఆమెకు చాలా పేరు తెచ్చి పెట్టింది.

తన మార్గం కథల సంపుటికిగాను 2005లో అబ్బూరి ఛాయాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కళాసాగర్ పందిరి సాహిత్య పురస్కారం మొదలైనవి అందుకోవడం ఆమె సాహితీ ప్రతిభకు నిదర్శనాలు. అబ్బూరి ఛాయాదేవి రచనలలో తనమార్గం, మృత్యుంజయ, అబ్బూరి ఛాయాదేవి కథలు, పిల్లలకోసం, అనగనగా జానపద గాథాలు, ఆఖరికి అయిదు నక్షత్రాలు, ఉడ్ రోజ్ కథలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఆమె రాసిన కథలు వివిధ భారతీయ భాషలలోకి అనువదింపబడ్డాయి. అదేవిధంగా వివిధ భాషల్లోని రచనలను ఆమె తెలుగులోకి కూడా అనువదించారు.అబ్బూరి ట్రస్ట్ ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేస్తూ సాహితీ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత ఆలోచనలతో మరణాంతరం కూడా తన కళ్లను, శరీరాన్ని దానం చేసిన గొప్ప మానవతామూర్తి అబ్బూరి ఛాయాదేవి.

                                                                                                        – కందుకూరి భాస్కర్

Telugu writer Abburi Chaya Devi write on women problems

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్త్రీ సమస్యలపై గళమెత్తిన కలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: