కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు సాంకేతిక లోపం…

  మూడు గంటల పాటు నిలిపివేత బోనకల్ : ఆదిలాబాద్ నుండి గుంటూరు వెళ్ళే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్ 2 బోగీ బ్రేకులు బోనకల్ స్టేషనులో ఆగి కదిలే సమయంలో పట్టుకుపోవటంతో రైలును సుమారు మూడు గంటలపాటు బోనకల్‌లోనే ఆపివేసిన సంఘటన ఆదివారం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో బోనకల్ స్టేషన్‌కు వచ్చిన రైలు ప్రయాణీకులు దిగిన అనంతరం కదిలే సమయంలో రైలుకు మద్యలో గల బోగీలో బ్రేకులు మొరాయించాయి. దీంతో బండి కదలలేని […] The post కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు సాంకేతిక లోపం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మూడు గంటల పాటు నిలిపివేత

బోనకల్ : ఆదిలాబాద్ నుండి గుంటూరు వెళ్ళే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్ 2 బోగీ బ్రేకులు బోనకల్ స్టేషనులో ఆగి కదిలే సమయంలో పట్టుకుపోవటంతో రైలును సుమారు మూడు గంటలపాటు బోనకల్‌లోనే ఆపివేసిన సంఘటన ఆదివారం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో బోనకల్ స్టేషన్‌కు వచ్చిన రైలు ప్రయాణీకులు దిగిన అనంతరం కదిలే సమయంలో రైలుకు మద్యలో గల బోగీలో బ్రేకులు మొరాయించాయి. దీంతో బండి కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఆ బోగీని తొలగించేందుకు అది రైలుకు మద్యలో ఉంది. వెంటనే ఆ సమాచారాన్ని స్టేషన్ సిబ్బంది మధిర ఉన్నతాధికారులకు అందించగా అక్కడ నుండి మెకానిక్‌లతో రిపేరు చేసిన అనంతరం ఆ బోగీని లూప్‌లైనుకు తరలించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు రైలు కదిలింది. మూడు గంటల పాటు ప్రయాణీలకు ఇబ్బందులు పడ్డారు.

Technical Glitch to Krishna Express

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు సాంకేతిక లోపం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: