నేరగాళ్లు తప్పించుకోలేరు

రాత్రి పోలీస్ పెట్రోలింగ్ వాన్ సైరన్ వినడంతో రిక్షా వదిలి ఇద్దరు ఆగంతకులు పరుగులు తీసారు. ఎటుచూసిన సందులు గొందులున్న ప్రదేశం. ఆ ఇద్దరు క్షణాల్లో తప్పించుకున్నారు. రిక్షా అదుపుతప్పినట్లు రోడ్డు పల్లెంవైపు జారుతూ పెట్రోలింగ్ వాన్‌కు అడ్డం పడింది. వెంటనే వాన్ ఆపేసి, పోలీసులు దిగి రిక్షాలో మూటలా ఉన్నదేమిటా అని కళ్లు పెద్దవి చేసి చూ సారు. ఎవరో ఇద్దరు రిక్షా వదిలి పారిపోవడాన్ని కళ్లార చూసారు. వారు విడిచిన రిక్షా వాన్‌కు అడ్డం […] The post నేరగాళ్లు తప్పించుకోలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాత్రి పోలీస్ పెట్రోలింగ్ వాన్ సైరన్ వినడంతో రిక్షా వదిలి ఇద్దరు ఆగంతకులు పరుగులు తీసారు. ఎటుచూసిన సందులు గొందులున్న ప్రదేశం. ఆ ఇద్దరు క్షణాల్లో తప్పించుకున్నారు. రిక్షా అదుపుతప్పినట్లు రోడ్డు పల్లెంవైపు జారుతూ పెట్రోలింగ్ వాన్‌కు అడ్డం పడింది.
వెంటనే వాన్ ఆపేసి, పోలీసులు దిగి రిక్షాలో మూటలా ఉన్నదేమిటా అని కళ్లు పెద్దవి చేసి చూ సారు. ఎవరో ఇద్దరు రిక్షా వదిలి పారిపోవడాన్ని కళ్లార చూసారు. వారు విడిచిన రిక్షా వాన్‌కు అడ్డం పడింది కనుకనే వాన్ ఆపాల్సివచ్చిందన్నట్లు మరో ఇద్దరు నాలుగైదు సందుల్లో చూసి వెనక్కివచ్చారు.
అప్పటికే ఇన్‌స్పెక్టర్ జిన్నా మూటను పరిశీలించి చేత్తో నొక్కి చూసాడు. మెత్తగా తగిలింది. “ఏదో శవంలా ఉంది. ఎక్కడో చంపి ఆ నదిలోకి పారేయడానికి వచ్చారు. మనం ఎదుటపడ్డాం. వదిలి పారిపోయారు.” తనకు అవగతమైనదంతా చెప్పాడు.
ఆ వెంటనే ఠాణాకు ఫోన్‌చేసి మెన్‌కు అలర్టు చేసాడు. పట్టణం అంతా రోడ్లపై గాలింపులు చేపట్టేలా చేసాడు.
భళ్లున తెల్లారేసరికి ఎవరెవరినో తెచ్చారు. కానీ, వారు కాదని ప్రాధమిక విచారణలో తేల్చి వదిలేసారు. సిసి ఫుటేజిలో ఇద్దరు ఆగంతకులను ఎంతగా పరిశీలించినా వారెవరో తెలియలేదు. శవం ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిమిత్తం పంపబడింది. ఆ రిపోర్టు రావాలి.
శవం మీద షర్టుపై చెన్నయ్ టైలర్ స్టిక్కరుంది. షర్టులో నాలుగు విజిటింగ్ కార్డులున్నాయి. అవి కలకత్తా గోల్డుషాపుల చిరునామాలున్నాయి. అదే పర్సులో ఖాదర్‌పాషా పేరిట ఆధార్ ఉంది. శవం మూతిగొరికేసి, గడ్డం ఏపుగా పెరిగి ఉంది. హతుడు పేరు ఖాదర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పర్సులో కొంత కరెన్సీ ఉన్నా అవి నకిలీనోట్లే అని పోలీసులు తేల్చారు.
ఇన్‌స్పెక్టర్ జిన్నా నైట్ డ్యూటీకి వచ్చాడు. పగలు డ్యూటీ చేసిన పోలీసులు సేకరించిన వివరాలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడు. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఊపిరాడకుండా చేసి చంపారు. పక్కటెముకలు విరిగేలా పిడిగుద్దులు గుద్దారని తేల్చారు. హతుడు పేరు ఖాదర్.
జిన్నా మార్చురీకి వెళ్లి ట్రేలో శవాన్ని మరోసారి చూసాడు. చంపాక మీసాలు గీయబడినట్లు నిర్ధారించాడు. నెత్తుటి గాట్లున్నాయి. మీసకట్టులో అక్కడక్కడ వెంట్రుకలు గీయబడలేదు. వెనక్కి వచ్చి ఠాణాలో కూర్చుని హతుడి ఆధార్‌ను నెట్‌లో వెతికాడు. మార్ఫింగ్ ఆధార్ అది అని తేలింది. షర్టు మీద స్టిక్కర్ టైలర్ సెల్‌కు రింగ్ చేసాడు.
అటు నుంచి “టైలర్ సింగ్ అనారోగ్యంగా ఉన్నారు. కష్టమర్లు ఫోన్లు చేస్తూనే ఉన్నారు.” అని సింగ్ కొడుకు చెప్పాడు.
“సింగ్ కుట్టిన షర్టు వేసుకున్న ఒక అనామక శవం దొరికింది. విచారణలో భాగంగా మిమ్మల్ని అడుగుతున్నాను. సహకరించండి.” ఇన్‌స్పెక్టర్ జిన్నా పోలీసు గొంతుతో చెప్పాడు. “సారీ సార్, మా నాన్న సింగ్ షర్టులు, ఫ్యాంట్లు కుట్టడం మా నేసి పదిహేనేళ్లు అయ్యింటుంది. ఆయన కేవలం సూట్లు కుట్టడంలో పేరుపడ్డాడు. అందులో బిజీ” “అయితే, నీ ఫోన్‌కు శవంపై దొరికిన షర్టు ఫొటో ని వాట్సాప్ చేస్తాను. చూసి కుట్టింది లేందీ చెప్పు”

కొన్ని క్షణాల తర్వాత
“సార్, ఈ షర్టు లేటెస్టు. పైగా, ఆ స్టిక్కర్ మేం సూట్ కాలర్‌లో అతుకుతాం. చాలామంది తీసేసి జర్మన్, అమెరికా సూట్ అని గొప్పలు చెప్పుకుంటారు. అందుకే తీసేలా అలాఇలా అతుకుతాం.” “ఓకే, మా ఏరియాలో మీరేమైనా సూట్లు
కుట్టిచ్చారా?”
“మీ ఏరియా గురించి చెబితే మా రికార్డు
చూసి చెబుతా”
“పెరంబులూర్‌లో ఇటీవల ఎవరైన కుట్టించ్చారా?”
“లిస్టు చూసి చెబుతాను.”
కొన్ని క్షణాల తర్వాత
“ఒకే ఒకరు ఆరుమాసాల క్రితం మూడు సూట్లు కుట్టించుకున్నారు. అతని పేరు దురైముత్తు.”
“ఫోన్ చేసినప్పుడు ఎన్ని పనులున్నా నాతో
మాట్లాడాలి.”
“తప్పకుండా సార్‌”
ఇన్‌స్పెక్టర్ జిన్నా దురైముత్తు అనే పేరుగల వ్యక్తులు ఎంత మంది సూట్లు కుట్టించుకునే స్థితిలో ఉన్నారు. ఆ దిశలో ఆరాతీసాడు.
ఫంక్షన్లకు సూట్లతో వచ్చే దురైముత్తు అనే వ్యక్తి గురించి వార్తాసేకరణకు వచ్చే లోకల్ రిపోర్టర్సు ను అడిగితే వారు గుసగుసలాడుకుని చిరునామా తెలిపారు.
ఇన్‌స్పెక్టర్ జిన్నా ఇద్దరు కానిస్టేబుళ్లను దురైముత్తు ఇంటివద్ద రహస్యంగా కనిపెట్టమని ఏర్పాటు చేసాడు.
దురైముత్తు వివిధ రకాల వ్యాపారాలు చేసే వ్యక్తి. కానీ, సంచార జీవిలా ఎప్పుడూ బిజీగా క్యాంపుల్లో ఉంటాడు. అతడిపై విచారణ ఆరంభం అయ్యింది. దురైముత్తు నేర చరిత్ర ఉన్నవాడే అనే ఆధారాలు సేకరించారు.
మరోవైపు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు జిన్నా అనామక శవంగా గొరిగేసిన మీసం తగిలించి ఫొటోని ట్రిమ్ చేసి పంపాడు. మరుసటి రోజు బెంగళూర్ పోలీసులు మిస్సింగ్ కేసులో ఉన్న ఫొటో వివరాలు పంపారు. అనామక శవంగా పెరంబుళూర్‌లో నమోదు అయిన శవం బెంగళూర్‌లో వెండి నగల సప్లయ్‌దారు కాలప్పన్ అని తేలింది.
కేసు ముడివీడిపోతున్నందుకు జిన్నా ఉత్సాహంగా ముందుకు కదిలాడు. ఆ రోజు జిల్లా క్రయిమ్ మీటింగ్‌లో అనామక శవంగా వదిలేసారా? పక్కా హత్య అని పోస్టుమార్టమ్ రిపోర్టులున్నాయి. మూడు రోజులైనా హంతకులు దరిదాపుల్లో నీ పరిశోధన లేదు. ఏమిటి కథ” పోలీస్ పెద్ద నిలదీసి అడిగారు.
“సార్, అనుమానించబడ్డ నిందితుడు (దురైముత్తు) కళ్లముందే తిరుగాడుతున్నాడు. మరిన్ని సాక్షాలతో అరెస్టు చేసేస్తాను.” జిన్నా వివరంగా తెలియజేసాడు.
“అట్టే ఆలస్యం చేయొద్దు. వెంటనే అసలైన హంతకులను అదుపులో తీసుకోండి.”
స్టిఫ్‌గా శ్యాలుట్ చేసి బయటికి వచ్చేసాడు.
***
జిన్నా వేకువజామున తనపక్కనే ఉన్న ఫోన్ మోగుతుంటే వెంటనే నిద్రమత్తులో బెడ్ మీద నుంచి లేచి చెవికి అదుముకున్నాడు.
“సార్, దురైముత్తు ఇంటిముందు రైల్వే పోలీసువాన్ ఆగి ఉంది. ముత్తును పోలీసులు నిద్రలేపి మరీ తీసుకుపోయారు.” కనిపెట్టడంలో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆత్రంగా చెప్పాడు.
ఆ మాటకు జిన్నాకు నిద్ర మత్తు వదిలింది.
“వెరీ ఇంట్రెస్టింగ్. ఏ రైల్వేస్టేషన్ పోలీసులో తెలుసుకున్నావా?”
“నేను ఎంటర్ అయ్యేసరికే వాన్ వెళ్లిపోయింది. వాన్‌పై రైల్వే పోలీస్ అని ఉంది.”
“నాన్‌సెన్సు. ఏం పోలీస్‌వి. నీ వెహికిల్‌పై వెళ్లి ఆ వాన్‌ను నిలువరించి విషయం సేకరించాల్సింది.” జిన్నా చిరుబుర్రులాడాడు.
“దురైముత్తు ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో వారిని వాకబు చేసి నాకు ఏ విషయం తెలియచెయ్.”
కొంత సేవటి తర్వాత
“సార్ బళ్లారి రైల్వేపోలీసులు ఎవరినో గుర్తించమని ఎన్ని సార్లు పిలిచినా వెళ్లనందుకు తీసుకు వెళ్లారని తెలిసింది.”
జిన్నా కానిస్టేబుల్ విషయసేకరణతో తన కేసు మరో ట్విస్టులో పడ్డట్టుందేనని బళ్లారి రైల్వే పోలీసులు ఫోన్ నెంబర్ వెతికాడు.
‘దురైముత్తు నేరాలు బాగానే చేస్తున్నాడే. తను మర్డర్ కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించి ఆధారాలతో పట్టుకునేందుకు విశ్వయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు పోలీసులు వేకువజామున పట్టుకువెళ్లారంటే మరో మర్డర్ చేసే ఉంటాడు.’ అని ఆలోచనలు సుడిగాలిలో బళ్లారి రైల్వేపోలీసుల ఫోన్‌నెంబర్లు సేకరించాడు.
ఆ వెంటనే ఫోన్ చేసాడు.
రైల్వే పోలీసు హెడ్‌కానిస్టేబుల్ లైన్‌లోకి వచ్చాడు.
తను ఎవరైంది చెప్పాడు జిన్నా.
“సార్, ఇక్కడ బ్యాగ్ పోగొట్టుకున్నాడు దురైముత్తు. మాకు ఫిర్యాదు చేసాడు. మేము మూడు రోజులుగా వెతికి అనుమానంగా ఉన్న ఇద్దరిని పట్టుకున్నాం. వారిని గుర్తించమని రమ్మంటే రానందుకు వదిలేసేవాళ్లం. అయితే, మాకు చిక్కిన ఇద్దరు ముంబయి నుంచి దిగిన కిరాయి గూండాలని తెలిసింది. వారిపై బోలెడు కేసులున్నాయి. ఈ ఇద్దరికి తన బ్యాగ్ అప్పగించి టాయ్‌లెట్‌కు వెళ్లాడు దురైముత్తు.
ఆ బ్యాగ్‌తో పారిపోయారు. వారం క్రితం జరిగింది. వీరిని సిసి కెమెరా ఫుటేజిలో గుర్తించి వెతికేసరికి బళ్లారి తిరిగొచ్చి ముంబయ్ వెళ్లేందుకు ట్రయిన్ ఎక్కడానికి ఫ్లాట్‌ఫామ్‌పై దొరికారు. వీరిని గుర్తించమని దురైని పిలిస్తే రావట్లేదు.” ఊపిరి తిరక్కుండా చెప్పాడు.
“బ్యాగ్ ఎత్తుకెళ్లిన వారివద్ద ఆ బ్యాగ్ రికవరీ చేయలేదా?”
“నిందితుల వద్దనే దొరికింది. అందులో దురై సూటు ఒకటి అలానే ఉంది. అయితే ఈ ఇద్దరు వద్దనున్న ఫోన్‌లలో ముంబయ్ నంబర్లున్నాయి. దాదాలు, గూండాల పేర్లున్నాయి. పైగా కంట్రీమేడ్ పిస్తోలు దొరికింది. దాంతో ఇద్దరిని హెడ్‌క్వార్టర్‌కు తరలించేసి విచారణ చేపట్టాం.”
జిన్నా వెంటనే బళ్లారి ప్రయాణం అయ్యాడు.
***
నిందితులను ఇద్దరిని నేల మీద కూర్చోబెట్టారు.
తనవద్ద ఉన్న సిసి ఫుటేజిలో అర్ధరాత్రి రిక్షాలో శవాన్ని వదలి పరుగులు తీసిన ఇద్దరు ఆగంతకులను సరిపోల్చి చూసాడు ఇన్‌స్పెక్టర్ జిన్నా. రైల్వే పోలీసులు, లోకల్ పోలీసులు అక్కడ నిందితులను శల్యపరీక్ష చేసారు.
జిన్నా సిసి ఫుటేజిలో శవాన్ని వదిలి పరుగులు తీసిన ఇద్దరు ఈ రోజు బళ్లారి రైల్వే పోలీసులకు చిక్కినవారే అని తేలింది. దురైముత్తు ఆ రోజు బ్యాగ్ చూడమని ఇచ్చింది ఈ ఇద్దరికే. బ్యాగ్‌లో సూటు, టవల్, లుంగీ తప్పితే ఏమీలేదు.
విలువైన సూటు కోసం తప్పదని రిపోర్టు ఇచ్చాడు. తీరా దొరికింది ఎప్పుడైన వెళ్లొచ్చు అని ధీమాపడితే పోలీసులు తీసుకువచ్చి నిందితుల్ని గుర్తించమన్నారు. ఈ లోగా ఇన్‌స్పెక్టర్ జిన్నా హత్యకేసు ఒకటి ఆ ఇద్దరిపై మోపుతూ ఆధారాలు చూపాడు.
నేలమీద చతికిలపడిన నిందితులిద్దరు నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు.
ఆ రోజు పెరంబుళూర్‌లో ఇలాంగో అనే చెన్నయ్ వాసి తనతో ఉండే కాళప్పన్‌ను చంపితే ఆరులక్షలు ఇస్తామన్నాడు. అందుకు ముంబయ్ నుంచి వచ్చాం. గుట్టుచప్పుడు కాకుండా చంపాలన్నాడు. అప్పటికే ఒకిల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరు మద్యం సేవించి ఉన్నప్పుడు మాకు రింగ్ ఇచ్చాడు. తలుపు తెరిచి ఉన్నందున లోపలికి వెళ్లి కాళప్పన్‌ను సైగలతో చూపాడు ఇలాంగో.
వెంటనే పక్కటెముకలు విరిగేలా తన్నాం వాడు తెలివితప్పి పడిపోయాడు. ఊపిరాడకుండా చంపేసాం. అప్పుడు ఇదేమిటయ్యా చంపడం ఇంత ఈజీయా అని ఇలాంగో సర్టిఫికెట్ ఇచ్చాడు. వెంటనే శవానికి పోలీసులు పొరపడేలా రకరకాల మేకప్‌లు చేసి ప్లాస్టిక్ కవర్‌లో మూటకట్టి ఆ ఇంటి ఎదురుగా ఉండే రిక్షాల్లో ఒకదానిలో వేసుకుని తోసుకుపోయాం. అక్కడ ఉన్న కాలువలో పడేస్తే కొట్టుకుపోతుందని అనుకుని అక్కడివరకు వెళ్లాం. తీరా, పోలీస్ పెట్రోలింగ్ వాన్ సైరన్‌కు పరుగులు తీసాం.” చెప్పారు ఇద్దరు.
“ఇలాంగో లక్షలు ఇచ్చాడా?” పోలీసులు ప్రశ్నించారు.
“హత్య చేసిన వెంటనే మా భార్యల నెంబర్లకు ఆన్‌లైన్ చెల్లింపు చేసాడు.”
“ఇంతకీ హత్య ఎందుకు ఇలాంగో చేయించాడు.”
“నలబై లక్షలు బాకీ చెల్లించడానికి ఇష్టం లేనందున చంపేస్తే మిగులుతుందని హత్య చేయించాడు.”
ఆ రాత్రే ఇలాంగోను చెన్నయ్‌లో అక్కడ పోలీసులు అరెస్టు చేసారు.

Criminals Cannot Escape

యర్నాగుల సుధాకరరావు

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేరగాళ్లు తప్పించుకోలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.