ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య…

  ఖమ్మంలో విషాదం కన్నీటి పర్యంతమైన బంధువులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ దాసరి, ఏసీపీ ఘంటా ఖమ్మం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం వల్లభి గ్రామానికి చెందిన కోయ రాంప్రసాద్ (43) ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తుండేవాడు. గురువారం రాత్రి బిర్యానీలో విషం కలిపి భార్య సుచిత్ర (38), కుమార్తెలు రుచిత (13) జాహ్నవి (9)కు […] The post ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మంలో విషాదం
కన్నీటి పర్యంతమైన బంధువులు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ దాసరి, ఏసీపీ ఘంటా

ఖమ్మం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం వల్లభి గ్రామానికి చెందిన కోయ రాంప్రసాద్ (43) ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తుండేవాడు. గురువారం రాత్రి బిర్యానీలో విషం కలిపి భార్య సుచిత్ర (38), కుమార్తెలు రుచిత (13) జాహ్నవి (9)కు ఇచ్చి తానూ అదే తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంప్రసాద్‌కు భార్య సుచిత్రతో గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని రాంప్రసాద్ తనతో అంటుండేవాడని మృతుని తండ్రి కోయ వెంకయ్య పేర్కొన్నారు. ఆ ఘటనపై రాంప్రసాద్ బావ మరిది కనపర్తి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం

అర్బన్ సిఐ సాయిరమణ తెలిపారు.

ఫోన్ చేస్తే ఎత్తకపోవటంతో అనుమానించిన రాంప్రసాద్ తండ్రి : శుక్రవారం ఉదయం ఖమ్మం మమతా రోడ్డులోని నేతాజీ నగర్‌లో జరిగే మేనకోడలి నూతన గృహ ప్రవేశానికి వస్తున్నాననే విషయాన్ని రాంప్రసాద్‌కు చెప్పేందుకు వల్లభిలో ఉండే తండ్రి కోయ వెంకయ్య ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తకపోయే సరికి బయపడ్డాడు. ఖమ్మం వచ్చిన తరువాత సైతం వెంకయ్య ఫంక్షన్‌కు వచ్చిన బందువుల ఫోన్ ద్వారా చేయించాడు. అయినప్పటికీ ఎత్తకపోవటంతో అనుమానం వచ్చిన వెంకయ్య తన మేనల్లుడైన కనపర్తి వెంకటరమణతో పాటు మరో ఇద్దరు బంధువులను వెంట పెట్టుకుని శ్రీరాం నగర్‌లోని ప్లాట్‌లో ఉండే రాంప్రసాద్ ఇంటికి వచ్చాడు.

లోపల గడియ పెట్టి ఉండటాన్ని గమనించి గట్టిగా తలుపులు కొట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ తీయకపోవటంతో బెడ్‌రూంకు చెందిన కీటీకీ తలుపులు తీసి చూశారు. అందులో కోడలు సుచిత్ర అచేతనంగా పడిపోయి ఉండటాన్ని గమనించి నిర్ఘాంతపోయారు. అ పక్కనే పిల్లలు రుచిత, జాహ్నవిలో సోయి లేకుండా పడిపోయి ఉండటాన్ని గమనించారు. హుటాహుటిన తలుపులను చేదించి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి, బిడ్డలు ముగ్గురు చనిపోయి ఉండటాన్ని గమనించారు. మరో గదిలోకి వెళ్లి చూడగా రాంప్రసాద్ వాంతులు చేసుకుని ఉండి నోటి నుంచి నురగలతో బోర్ల పడి చనిపోయి ఉండటాన్ని గమనించారు.

కన్నీరు మున్నీరుగా రోదించిన బంధువులు : ఖమ్మంలో గృహ ప్రవేశం కోసం వచ్చిన బంధువులు రాంప్రసాద్ కుటుంబం మృతి చెందిందనే విషయం తెలుసుకుని హుటాహుటిన శ్రీరాంనగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. బెడ్‌రూంలలో విగత జీవులుగా పడిఉన్న మృత దేహాలపై పడి కన్నీరు మున్నీరు అయ్యారు. ఎంత పనిచేశావయ్యా రాంప్రసాద్ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కంట తడి పెట్టించింది. ఫంక్షన్‌కు వచ్చి మీ మరణ వార్తను వినాల్సి వస్తుందని ఊహించలేందంటూ బందువుల ఆర్తనాదాలు రాంప్రసాద్ ఇంట్లో మిన్నంటాయి. అంతే కాదు విగత జీవులైన రుచిత, జాహ్నవిలు అల్లరి పిల్లల్లా సరదాగా అపార్ట్‌మెంట్ మొత్తం తిరుగుతూ అందరిని కలుపుకుని వచ్చేవారని, ఇలా తెల్లవారే సరికి విగత జీవులు అవుతారని కలలో కూడా ఊహించలేదంటూ పక్క ప్లాట్లకు చెందినవారు కన్నీటి పర్వంతమయ్యారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ దాసరి

ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారనే విషయం తెలుసుకున్న ఖమ్మం అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యుల ద్వారా విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాంప్రసాద్ తండ్రి కోయ వెంకయ్య ద్వారా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, ఆర్ధిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలపై వివరాలు సేకరించారు.

ఖమ్మం నగర ఏసీపీ ఘంటా వెంకట్రావు ఆదేశాల మేరకు అర్బన్ సీఐ సాయి రమణ ఇంటి గదులను శోదించి ఇంట్లో లభించిన బిర్యాని పార్శిల్ సంబంధించిన కవర్స్‌ను, బాక్స్‌లను సేకరించారు. రాంప్రసాద్ ద్విచక్ర వాహనంలో పురుగు మందుకు సంబంధించిన ప్యాకెట్ ఉండటాన్ని గుర్తించి స్వాధీన పరుచుకున్నారు. జరిగిన సంఘటనపై రాంప్రసాద్ బామ్మర్ధి కనపర్తి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం అర్బన్ సీఐ సాయి రమణ తెలిపారు.

Four Members Suicide in same Family

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: