ఖమ్మంలో నలుగురు విషాదాంతం

మన తెలంగాణ/ఖమ్మం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలం వల్లభి గ్రామాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం వల్లభి గ్రామానికి చెందిన కోయ రాంప్రసాద్ (43) ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బిర్యానీలో విషం కలిపి భార్యకు, ఇద్దరు కుమార్తెలకు ఇచ్చి తానూ అదే తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంప్రసాద్‌కు భార్య సుచిత్రతో గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని రాంప్రసాద్ […] The post ఖమ్మంలో నలుగురు విషాదాంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/ఖమ్మం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలం వల్లభి గ్రామాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం వల్లభి గ్రామానికి చెందిన కోయ రాంప్రసాద్ (43) ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బిర్యానీలో విషం కలిపి భార్యకు, ఇద్దరు కుమార్తెలకు ఇచ్చి తానూ అదే తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంప్రసాద్‌కు భార్య సుచిత్రతో గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని రాంప్రసాద్ తనతో అంటుండేవాడని మృతుని తండ్రి కోయ వెంకయ్య పేర్కొన్నారు. ఆ ఘటనపై రాంప్రసాద్ బావ మరిది కనపర్తి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం అర్బన్ సిఐ సాయిరమణ తెలిపారు.

Four members Of A family commit suicide In Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఖమ్మంలో నలుగురు విషాదాంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: