ప్రకృతి అందాలకు నెలవు మేల్కొటే

రజనీకాంత్ సినిమాల్లో తరచుగా కనిపించే సుందర దృశ్యాలు చూసినపుడల్లా అవెక్కడివోనన్న ఆశ్చర్యం కలిగేది. అయితే అవన్నీ కర్ణాటక రాష్ట్రంలోని మెల్కొటెలోని సుందర దృశ్యాలని తెలిసినపుడు అక్కడకు వెళ్ళకుండా ఉండడం నావల్ల కాలేదు. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం దేశంలో ఉన్న ప్రాచీన నగరాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అడుగడుగూ అద్భుత, అతిపురాతన ఆలయాలు, మనోహరమైన దృశ్యాలతో అలరారుతున్న ఈ క్షేత్రం పర్యాటకులకు మధురానుభూతులెన్నింటి నో సొంతం చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా […] The post ప్రకృతి అందాలకు నెలవు మేల్కొటే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రజనీకాంత్ సినిమాల్లో తరచుగా కనిపించే సుందర దృశ్యాలు చూసినపుడల్లా అవెక్కడివోనన్న ఆశ్చర్యం కలిగేది. అయితే అవన్నీ కర్ణాటక రాష్ట్రంలోని మెల్కొటెలోని సుందర దృశ్యాలని తెలిసినపుడు అక్కడకు వెళ్ళకుండా ఉండడం నావల్ల కాలేదు. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం దేశంలో ఉన్న ప్రాచీన నగరాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అడుగడుగూ అద్భుత, అతిపురాతన ఆలయాలు, మనోహరమైన దృశ్యాలతో అలరారుతున్న ఈ క్షేత్రం పర్యాటకులకు మధురానుభూతులెన్నింటి నో సొంతం చేస్తుంది.

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పాండవపుర తాలూకాలో బెంగళూరుకు సుమారు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం చారిత్రక, పౌరాణిక గాధలకు నిలయంగా పేర్గాంచింది. నేను ఎప్పుడైతే మెల్కొటెను సందర్శించాలన్న దృఢ నిర్ణయానికొచ్చానో, వెంటనే బెంగళూరుకు చేరుకున్నాను. అక్కడ నుంచి వెహికల్ మీద మెల్కొటె బయలు దేరి వెళ్ళాను. పాండవపుర తాలూకాలో ఉన్న చిన్న పట్టణం మెల్కొటె. ఇది మైసూరు నగరానికి 36 కిలోమీటర్లు దూరంలో ఉంది. సంస్కృత భాషకు, సంస్కృత పరిశోధనలకు నిలయంగా మెల్కొటెను చెబుతారు. ఈ పట్టణంలోకి అడుగుపెట్టగానే ఏదో మారుమూల ప్రాంతంలోకి వెళ్ళామన్న అనుభూతి కలిగింది. పురాతనకాలం నాటి భవనాలతో, పాత కాలంనాటి వాసనలతో నిశ్శబ్దంగా ఉంది.

పట్టణంలో చాలా ప్రాంతాలలో వైష్ణవ స్వాములు తారస పడడం కనిపించింది. భగవద్రామానుజుల వారు ఇక్కడ 12 సంవ్సరాల పాటు నివాసమున్నారట. ఆ కారణంగా ఈ క్షేత్ర ప్రాధాన్యం పెరిగింది. మెల్కొటె దివ్య క్షేత్రాన్ని పూర్వం వేదాచలమని పిలిచేవారట. దత్తాత్రే యుల వారు పూర్వం ఈ క్షేత్రంలో తన శిష్యులకు వేదాలను ఉపదేశించడం వల్ల ఈ క్షేత్రానికి వేదాచలమని, నారాయణాద్రని పేరొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ద్వాపర యుగాంతాన యదు వంశపు మహారాజులు ఈ క్షేత్రాన్ని పాలించడం వల్ల ఈ క్షేత్రానికి యదుగిరని, భగవద్రామానుజా చార్యుల వారు ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేయడం వల్ల యశిశైలమని పేర్లు వచ్చిందట. అలాగే ఈ క్షేత్రాన్ని తిరునారాయణపురమని కూడా పిలుస్తారు. మెల్కొటె దివ్య క్షేత్రం మనోహర మైనది. ప్రకృతి అందాలకు నెలవుగా నిలిచిన ఈ దివ్య క్షేత్రం హోయసల రాజుల పాలనలో ఉన్నట్టు ఇక్కడి చారిత్రక ఆధారాలు చెబుతున్నా యి.

మెల్కొటెలో ఉన్న అద్భుత దృశ్యాలెన్నో నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలకు నెలవుగా నిలిచిన ఈ క్షేత్రానికి 12వ శతాబ్దంలో భగవద్రామానుజాచార్యుల వారు తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చి, ఈ క్షేత్రంలో 12 సంవత్సరాలు నివసించారట. . ఆ కారణంగా వైష్ణవ మతస్థులకు ఇదో ప్రత్యేకమైన ప్రసిద్ధమైన క్షేత్రంగా అలరారుతోంది. అలాగే రామానుజా చార్యులు మొట్టమొదట ఇక్కడున్న తిరునారాయ ణ స్వామి దేవాలయంలోనే హరిజనులకు ప్రవేశం కల్పించారట.

మెల్కొటెలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఇక్కడున్న తిరునారాయణ స్వామి ఆలయం ఒకటి. హోయసల రాజు విష్ణువర్ణనుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అద్భుతమైన కట్టడాలకు నిలయంగా నిలిచిన ఈ ఆలయానికి టిప్పు సుల్తానుతో పాటు అనేక మంది రాజులు మాన్యాలు, ఆభరణాలు ఇచ్చినట్లు అక్కడి వారు చెప్పగా విన్నాను. ఇక్కడ ఈ ఆలయంలో చలువునారాయణ స్వామి,తిరునారాయణ స్వామి వార్ల మూర్తులను దర్శించుకోవచ్చు. చలువు నారాయణ స్వామి వారు ఉత్సవ మూర్తిగా, తిరునారాయణ స్వామి వారు ఉద్భవ మూర్తు లుగా ఇక్కడ నీరాజనాలందుకుంటున్నారు.
బ్రహ్మదేవుడి కోరిక మేరకు ఈ క్షేత్రంలో శ్రీమహావిష్ణువు అర్చావతార రూపంలో వెలిశాడట. అంతట సనత్కుమారులు లోక కల్యాణార్ధం

స్వామివారిని ఇక్కడే కొలువుండమని కోరగా, శ్రీమహావిష్ణువు ఇక్కడ వెలిసినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారిని ఎదుగిరి నాచియార్‌గా పిలుచుకుంటారు. ఆ తల్లే కళ్యాణ తాయారుగా కూడా పూజాదికాలందుకుంటోంది. ఇంకా ఆలయ ప్రాంగణంలో భగవద్రామాను జుడు, మనవాళమహాముని, భక్తప్రహ్లాద మంది రాలు కూడా భక్తులు, పర్యాటకులు దర్శించుకో వచ్చు. ఆలయానికి సమీపంలో మనోహరమైన కళ్యాణి తీర్ధముంది. అత్యంత పురాతనమైనదిగా, మహిమాన్వితమయినదిగా పేర్గాంచిన ఈ కళ్యాణి తీర్ధం అందాలు చూడడానికి రెండు కనులూ చాలవంటే అతిశయోక్తి కానేరదు. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమయిన కట్టడాలతో అందంగా, ఆహ్లాదంగా దర్శనమిచ్చే ఈ కళ్యాణి తీర్ధం మహత్తు గొప్పది.

హిరణ్యాక్షుడి వల్ల పాతా ళం లోకి నెట్టి వేయబడిన భూదేవి మాతను శ్రీమ హావిష్ణువు ఆది శ్వేత వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుడిని వధించి ఆ తల్లిని రక్షించాడట. ఆ క్రమంలో శ్రీ మహావిష్ణువు ఆ తల్లిని తన కోరలపై ధరించి సముద్ర గర్భం నుంచి పైకి తీసుకొని వచ్చి స్థాపించాడట. ఆ సమయాన ఆ దివ్య దంపతులకు కలిగిన మహాశ్రమచే వారిరు వురి దివ్య శరీరాల నుంచి విపరీతంగా స్వేద జలం ఏర్పడిందట. ఆ స్వేద జలమే కళ్యాణి తీర్ధంగా ఏర్పడినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే గంగానదీ తదితర నదులు ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో ఈ కళ్యాణి తీర్ధంలో అంతర్వాహినులుగా కలుస్తాయట. ఆయా పుణ్య దినాలలో దేవతలు స్వయంగా ఈ కళ్యాణి తీర్ధంలో స్నానాదికాలు చేస్తారని చెబుతా రు. ఓ అద్వితీయమైన అనుభూతులను సొంతం చేసే ఈ కళ్యాణి తీర్ధంలో ఓ పక్క భువనేశ్వరి మండపం, దాని పక్క దారా మండపం కనువిందు చేస్తాయి. దారా మండపంలో ఏటా దేవుడి పెళ్ళి చేస్తారు.

కళ్యాణి తీర్ధం ప్రముఖ షూటింగ్ స్పాట్ గా కూడా పేర్గాంచింది. అనేక సినిమాలు ఈ కళ్యాణి తీర్ధ ప్రాంగణంలో షూటింగులు జరుపుకున్నాయి. ఇక్కడ షూటింగ్ జరిపితే హిట్టవ్వడం ఖాయమన్న సెంటిమెంటు ఉండడంతో వివిధ భాషలకు చెం దిన కథానాయకులు ఇక్కడ షూటింగ్ జరుపుకో వడం ఆసక్తిని కనబరుస్తున్నారు.

మెల్కొటెలో కొండ మీద యోగ నరసింహ స్వామి వారి ఆలయముంది. పచ్చని ప్రకృతి అందాలను, మనోహరమైన దృశ్యాలకు వేదికైన ఈ దివ్య క్షేత్రం భూమికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉండి మనోహరమైన అనుభూ తులను సొంతం చేస్తుంది. ఈ దివ్యాలయాన్ని చేరుకోవడానికి విధిగా మెట్లున్నాయి. భక్తులు ఈ మెట్ల మీదుగానే ప్రధానాలయానికి చేరుకుంటా రు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం విష్ణువర్ణన రాజు కట్టించాడట. అలాగు టిప్పు సుల్తాను ఈ ఆలయాన్ని దర్శించి, ఈ స్వామికి మాన్యాలిచ్చాడట.

హిరణ్య కశిపుడి సంహారం అనంతరం తాను కూర్చోవడానికి ఓ ప్రదేశాన్ని చూపించమని, లక్ష్మీనరసింహ స్వామి ప్రహ్లాదుడ్ని అడిగినపుడు ప్రహ్లాదుడు ఈ ప్రదేశాన్ని చూపించాడట. గర్భాల యంలో యోగనరసింహ స్వామిని దర్శించుకున్న తరువాత మెల్కొటెలో ఉన్న ఇతర సుందర ప్రదేశా లను దర్శించుకోవడానికి బయలు దేరాను.
మెల్కొటెలో ఉన్న మరో విశిష్టమైన ఆకర్షణ ఇక్కడున్న రాయగోపురం. షూటింగ్ స్పాట్ గా కూడా పేర్గాంచిన ఈ

రాయగోపురాన్ని ఓ ఎత్తయి న ప్రదేశంలో నిర్మించారు. ఈ రాయగోపురాన్ని గోపాలరాయల వారు ఒక్క రోజులో కట్టించారట. ఈ రాయగోపురం మీద ఉన్న అద్బుత శిల్పాలు భక్తులలో ఓ కొత్త అనుభూతిని సొంతం చేస్తాయి.ఇదే క్షేత్రంలో అక్కాచెల్లెళ్ళ చెరువు, వేదపు ష్కరిణి, ధనుష్కోటి, నారాయణ తీర్ధాలను కూడా భ దర్శించుకోవచ్చు. అలాగే, తొండనూర్‌లో ఉన్న నంబి నారాయణ ఆలయం, పార్థిసారధి ఆలయం, రామానుజ ఆలయం, మేల్కొటే ఆలయ అభయారణ్యం, ఇస్కాన్ వనప్రస్థాన ఆశ్రమం తది తరాలను కూడా దర్శించవచ్చు.

ఎలా చేరుకోవాలి?

మేల్కొటే కు సమీపాన 180 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్ర యం ఉంది. అలాగే 55 కిలోమీటర్ల దూరంలో మాండ్య రైల్వే స్టేషన్ కూడా ఉంది. బెంగళూరు, మాండ్య, మైసూర్ తదితర ప్రాంతాల నుంచి మేల్కొటేకు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు కూడా అం దుబాటులో ఉన్నాయి.
భోజన, వసతి సదుపాయాలు
మెల్కొటెలో భోజన వసతి సదుపాయాలు అం తంత మాత్రంగానే ఉన్నాయి. అందువల్ల ఎవరికి వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే, మెల్కొటె కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ దాదాపు అందరూ కన్నడ భాష మాట్లాడుతారు. అయినప్పటికీ వారిలో చాలా మందికి తెలుగుభా ష అర్ధమవుతుంది. అందువల్ల భాష సమస్య కూడా ఇక్కడ తలెత్తదు. చూసిన కొద్దీ చూడాల నిపించే సుందర ప్రదేశ మిది. ఈ క్షేత్ర సందర్శ నం వల్ల అటు ఆధ్యాత్మికానందంతో పాటు మానసికానందం కూడా సొంతమవుతుంది.

Cheluvanarayana Swamy Temple Melukote

దాసరి దుర్గాప్రసాద్, 77940 96169 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రకృతి అందాలకు నెలవు మేల్కొటే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.