ఎయిర్ ఇండియా విమానానికి భద్రతా బెదిరింపు

లండన్: భద్రతాపరమైన బెదిరింపు కారణంగా ముంబయి నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో గల న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 విమానం గురువారం ఉదయం అత్యవసరంగా లండన్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో దిగింది. బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని మొదట ట్వీట్ చేసిన ఎయిర్ ఇండియా ఆ తర్వాత దాన్ని తొలగించి ఈ సంఘటనను భద్రతా బెదిరింపుగా అభివర్ణించింది. తమ ఇళ్లపై నుంచి విమానం వెళుతుండగా భీకరమైన శబ్దం వచ్చిందని […] The post ఎయిర్ ఇండియా విమానానికి భద్రతా బెదిరింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: భద్రతాపరమైన బెదిరింపు కారణంగా ముంబయి నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో గల న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 విమానం గురువారం ఉదయం అత్యవసరంగా లండన్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో దిగింది. బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని మొదట ట్వీట్ చేసిన ఎయిర్ ఇండియా ఆ తర్వాత దాన్ని తొలగించి ఈ సంఘటనను భద్రతా బెదిరింపుగా అభివర్ణించింది. తమ ఇళ్లపై నుంచి విమానం వెళుతుండగా భీకరమైన శబ్దం వచ్చిందని స్థానికులు వెల్లడించారు. ఉదయం 10.15 ప్రాంతంలో విమానం సురక్షితంగా లండన్ స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఇతర విమానాలకు దూరంగా దీన్ని ఉంచి తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని ఎయిర్‌పోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Air India Boeing 777 faces Security Threat

The post ఎయిర్ ఇండియా విమానానికి భద్రతా బెదిరింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: