భర్త కృష్ణకు చెల్లెలుగా నటించిన విజయనిర్మల

హైదరాబాద్ : ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన విషయం తెలిందే. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకున్న విజయనిర్మల తన భర్త సూపర్ స్టార్ కృష్ణకు చెల్లెలుగా కూడా నటించింది. వీరు ప్రేమలో పడిన తరువాతనే అన్నాచెల్లెలుగా నటించారు. కృష్ణ, విజయనిర్మల కలిసి సుమారు 50 సినిమాల్లో నటించారు. ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘మంచి మిత్రులు’, ‘ముహూర్త బలం’ చిత్రాల్లో ఆమె కృష్ణకు చెల్లెలుగా నటించారు.  ‘మంచి […] The post భర్త కృష్ణకు చెల్లెలుగా నటించిన విజయనిర్మల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన విషయం తెలిందే. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకున్న విజయనిర్మల తన భర్త సూపర్ స్టార్ కృష్ణకు చెల్లెలుగా కూడా నటించింది. వీరు ప్రేమలో పడిన తరువాతనే అన్నాచెల్లెలుగా నటించారు. కృష్ణ, విజయనిర్మల కలిసి సుమారు 50 సినిమాల్లో నటించారు. ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘మంచి మిత్రులు’, ‘ముహూర్త బలం’ చిత్రాల్లో ఆమె కృష్ణకు చెల్లెలుగా నటించారు.  ‘మంచి మిత్రులు’ సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించారు. అయితే కృష్ణ, విజయనిర్మల అన్నాచెల్లెలుగా నటించిన ఈ మూడు సినిమాలు విజయం సాధించలేదు. ఈ క్రమంలో అన్నా చెల్లెలుగా ప్రేక్షకులను మెప్పించలేమన్న ఆలోచనకు వచ్చిన వీరు మరే సినిమాలో అన్నాచెల్లెలుగా నటించలేదు.

Vijaya Nirmala Act As Sister To Her Husband Krishna

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భర్త కృష్ణకు చెల్లెలుగా నటించిన విజయనిర్మల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.