సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అశోక్

హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయులు, రచయిత, సాహితీవేత్త టంకశాల అశోక్ ను అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సిఎం కెసిఆర్ నియమించారు. ఈ క్రమంలో అశోక్ గురువారం సచివాలయం డి బ్లాక్ లోని కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, బిసి కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్, అశోక్ కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని అశోక్ తెలిపారు. […] The post సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయులు, రచయిత, సాహితీవేత్త టంకశాల అశోక్ ను అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సిఎం కెసిఆర్ నియమించారు. ఈ క్రమంలో అశోక్ గురువారం సచివాలయం డి బ్లాక్ లోని కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, బిసి కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్, అశోక్ కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని అశోక్ తెలిపారు. సిఎం కెసిఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. అంతర్రాష్ట్ర సంబంధాలు చాలా ముఖ్యమైనవని, వాటిని అధ్యయనం చేసి, తన పదవికి న్యాయం చేస్తానని అశోక్ స్పష్టం చేశారు.

Tankasala Ashok Took Charges As TS Govt Adviser

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: