కుమారస్వామికి మతిస్థిమితం తప్పింది

న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మతిస్థిమితం కోల్పోయారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. రాయచూర్ జిల్లాలోని కారేగుడ్డా గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం బస్సులో వెళుతున్న కుమారస్వామిని యర్మరస్ థర్మల్ పవర్ సేషన్ ఉద్యోగులు అడ్డుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరగా వారిపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. మీ సమస్యలను ప్రధాని మోదీకి చెప్పుకోండంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై గురువారం స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రిగా కుమారస్వామిని […] The post కుమారస్వామికి మతిస్థిమితం తప్పింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మతిస్థిమితం కోల్పోయారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. రాయచూర్ జిల్లాలోని కారేగుడ్డా గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం బస్సులో వెళుతున్న కుమారస్వామిని యర్మరస్ థర్మల్ పవర్ సేషన్ ఉద్యోగులు అడ్డుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరగా వారిపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. మీ సమస్యలను ప్రధాని మోదీకి చెప్పుకోండంటూ ఆయన విరుచుకుపడ్డారు.

ఈ సంఘటనపై గురువారం స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రిగా కుమారస్వామిని కర్నాటక ప్రజలు ఎన్నుకోలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి మతిస్థిమితం కోల్పోయారని జోషి విమర్శించారు. తన కుమారుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో కుమారస్వామి తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Karnataka CM lost his mental balance Says Pralhad Joshi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుమారస్వామికి మతిస్థిమితం తప్పింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: